ఉత్తర తెలంగాణ

గమ్యం చేరేదాకా..(మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముసిరిన చీకట్ల దగ్గర ఆగిపోయేది
కాలమే కాదు,
కమ్మిన మబ్బుల్ని చూసి కుంగిపోయేది
వెలుగే కాదు
పైన కప్పుకున్న నివురును చూసి నీరసపడేది
నిప్పే కాదు
చిన్న చిన్న దెబ్బలకు చితికిపోయేది
అసలు జీవితమే కాదు
జీవిత ప్రయాణంలో ఎదురైన సవాళ్లకు లొంగక,
అపజయాల్ని విలువైన అనుభవాలుగా మార్చుకొని
గాయాల్ని విలువైన పాఠాలుగా మల్చుకొని
తన ప్రస్థానాన్ని సాగిస్తూ
తన గమనంలో మొదటి అడుగును
గుర్తు చేసుకుంటూ,
గమ్యం చేరేదాకా ధైర్యంగా నిలిచి,
తనన నమ్మకాన్ని నిలబెట్టుకోగలగాలి!
ఒక ఆశయాన్ని నమ్మి చేయవలసిన
మహాత్కార్యాన్ని సాధించిన
మనిషి, మనీషిగా మారుతాడు
సమాజంలో శాంతిని నెలకొల్పుతాడు
*
- శ్రీమతి ఇషత్ సుల్తానా
కరీంనగర్, సెల్.నం.9440739159
*
జీవితమంటే?
*
ఆ ఇద్దరూ ఒకనాటి ప్రేమికులు
ఒకరికొరకు ఒకరు అన్నట్లుగా
విడదీయలేని బంధంగా
ఉల్లాసంగా ఉత్సాహంగా ఊసులాడుకునేవారు
అడుగులో అడుగులేసుకుంటూ
సముద్రతీరాన అలలతో
నీటి అంచున రాతలతో
చూపులే తూపులై
మాటలే కరువై ఆశలపల్లకిలో ఊరేగుతూ
నీవులేక నేను లేను, నేనే నువ్వు నువ్వేనేనంటూ
ప్రేమంటే ఇదేనంటూ చెట్టాపట్టాలేసారు
పెద్దల నొప్పించి, మెప్పించి పంచభూతాల సాక్షిగా
ఇద్దరు ఒకటయ్యారు..
బ్రతుకు బాటలో పరుగులు తీసారు,
నేడు
వారి జీవిత సంద్రాన ఎన్నో అలజడులు
నిట్టూర్పులు..నిస్పృహలు
ఎన్నో భారమైన అడుగులు
సముద్రతీరాన తిరిగిపడే అలలు
నీటి అంచున చెరిగిన రాతలు
ఆహ్లాదకరమైన సముద్ర తీరాన్ని ఆస్వాదించని మనసులు
మాటలు కరువై..మనసుకు బరువై
వెళ్లదీస్తున్నారు జీవితం
సమస్యల కొలిమి..సర్ధుమాటులేమి
అహంకారపు ఆజ్యం..ఆగని మాటలయుద్ధం
తడిసిన తలగడాల..వేరైన పరుపులు
ప్రేమంటే ఇదేనా..
దాంపత్యానికి ఇది తగునా
కలిసి చేయాల్సిన కాపురం కారాదు కదనరంగం
మూన్నాళ్ల జీవితం ముచ్చటలసొంతం
చిన్ని ఆనందాల ప్రపంచం
చేరువైతేనే వసంతం
అహం గోడలతో విడిపోక
సరిహద్దులు చెరిపే ప్రేమతో కలిసిపోవాలి!
అవగాహన, అనురాగాలతో
నూరు వసంతాలు సొంతం చేసుకోవాలి!
అదే అదే ఆనందమయ జీవితం!
*
- పట్రాయుడు కాశీవిశ్వనాథం
ధర్మవరం, సెల్.నం.9494524445
*
ఆకలి
*
ఎందరో అన్నారు!
చావు పుట్టుకల మధ్య
సంఘర్షణే జీవితం అని
మరి ఆకలిది ఏ పాత్ర!
జన్మించిన కొద్ది క్షణాల నుండి
ఆఖరు క్షణం వరకు ఆకలి
మరి దానిదే కదా! ఈ
జీవితంపై ఆధిపత్యం
జీవి జవసత్వాలకు అదో
గ్లూకోజు లాంటిది... ఆకలి
లేకుండా మనిషి జీవించలేడు
ఆకలి కోసమే జీవన పోరాటం
చివరి రక్తపు బొట్టునూ చిందించేది
తన కండల కొండలు కరిగించి
తన రక్తాన్ని స్వేదంగా మార్చేది?
తల్లి గర్భం నుండి ధరిత్రి గర్భం
చేరే వరకు...
శ్రమైక జీవిది
అంతం లేని అంతిమ పోరాటమే...
ఆకలి... ఆకలి...
*
- గంప ఉమాపతి, కరీంనగర్, 9849467551
*
కవల
*
ఉదయించిన ఆనందాల్లో మనమేకమై
అలలు అలలుగా ఓలలాడలేదు
ఆనంద డోలికల్లో!
ఎన్నిసార్లు
వౌనంగా దిగులు భారాన్ని
సాగిపోయే సంధ్యల్లోకి
మనమై ఒంపిరాలేదు!
మరెన్నిసార్లు అంతరంగంలో
ఒక్కొక్కటిగా రాలిపోయె
ఆశయాలను చూస్తూ
వెక్కి వెక్కి కరిగిపోలేదు
నువ్వు నేను!
చెలీ... ప్రతి బాధలోను
నేనున్నానంటూ కంటి చూపుల్లోనే
తచ్చాడతావు, అమ్మ ఆలింగనమై
నులివెచ్చగా స్పృశిస్తావు!
నేస్తం, మూసిన రెప్పల మాటున
చెలివై ఎదను అతికే ఉంటావు!
పొడిబారిన మనసు పగళ్ల మధ్య
సెలయేరై ఏరులుగా ఎన్నిసార్లు
గలగలమని సాగిపోతు చదును చెయ్యలేదు!
అయ్యో ఒంటరిగా ఉండనియ్యవే!!
తుంపర తుంపరగా మొదలవుతావు
జల్లువై, బొట్టు బొట్టుగా
ఎదలోకి జేరుతావు
గుండె మడతల్లో గూడు పెట్టిన
దుఃఖాన్ని ప్రవాహమై కుదిపేస్తావు
కూలుస్తావు చామ!
ఎన్నిసార్లు, మరెన్నిసార్లు
దిగులు బారిన హృదయ
ద్వారాల గుండా గాలి వానలా
దొంగవై చొరబడతావు సఖి!
మరెన్నిసార్లు నన్ను నేను కోల్పోయినా
నీడవై జోడువై
నాలోకి నన్ను చేర్చలేదు చెలీ!
ఉమ్మ నీటిలో కవలలమై పెరిగామేమో!
కన్నీరై మున్నీరుగా
తోబుట్టాయ్యావు మరి!
అందుకేనేమో శ్వాస ఆగినా..
జీవన చివరి మజిలీ దాకా
కంట చెమ్మవై నా తోడుగానే
అగ్ని జ్వాలల్లో ఆవిరై పోతావు
కన్నీరా..
*
- రామానుజం సుజాత, రేకుర్తి, కరీంనగర్, సెల్.నం.9701149302