ఉత్తర తెలంగాణ

4న రాష్టస్థ్రాయ గండ్ర హన్మంతరావు స్మారక పురస్కార ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితీ గౌతమి కరీంనగర్ ఆధ్వర్యంలో మే 4వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు కరీంనగర్ గ్రంథాలయ సంస్థ సమావేశ మందిరంలో రాష్టస్థ్రాయ గండ్ర హన్మంతరావు స్మారక సాహితీ పురస్కారాన్ని ప్రముఖ సినీ విమర్శకులు వారాల ఆనంద్‌కు అందజేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు గంప ఉమాపతి, ఎస్. గంగాధర్ తెలిపారు. సాహితీ గౌతమి అధ్యక్షులు దాస్యం సేనాధిపతి అధ్యక్షతన జరిగే సభకు ముఖ్య అతిథులుగా ప్రముఖ కవి డాక్టర్ నందిని సిధారెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ ఓ.ఎస్.డి దేశపతి శ్రీనివాస్, విశిష్ట అతిథిగా వజ్జల శ్రీనివాస్, ఆత్మీయ అతిథులుగా పురస్కార ప్రదాత డా. గండ్ర లక్ష్మణరావు, కె.ఎస్. అనంతాచార్య, పొన్నం రవిచంద్ర, ఎస్.వేణుశ్రీ, గాజుల రవీందర్‌లు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. పురస్కారం కింద రూ. 5,116 నగదు, ప్రశంసాపత్రం అందజేయనున్నట్లు తెలిపారు.

*
యువతకు ప్రేరణనిచ్చే శతకం!
*
ప్రతులకు: అవుసుల భానుప్రకాష్
11-10/జి-2, సెవన్‌హిల్స్ అపార్ట్‌మెంట్
కె.ఎస్.నగర్, పోతిరెడ్డిపల్లి చౌరస్తా
సంగారెడ్డి-502295, సెల్.నం.9603204507

సంగారెడ్డికి చెందిన యువ కవి అవుసుల భానుప్రకాష్ ‘తెలంగాణ వీరుడా!’పేరుతో ఓ పద్య కావ్యాన్ని వెలువరించారు. బంగారు తెలంగాణ సాధనలో యువతను భాగస్వాములు చేసేందుకు కవి ఈ గ్రంథం ద్వారా చేసిన ప్రయత్నం ప్రశంసనీయం! తెలంగాణ భాషా సంస్కృతులను పరిరక్షించడానికి యువత ముందుండాలని పిలుపునిస్తూ రాసిన ఇందలి పద్యాల్లో కవి యొక్క సామాజిక బాధ్యత కానవస్తోంది..తేటగీతిలో రాయబడిన ఈ కావ్యంలోని పద్యాలలో.. సమకాలీన సంఘటనలకు పెద్దపీట వేయడం అభినందనీయం! రైతుల కష్టాలు.. చదువు దోపిడీలు.. కాలుష్య పరిణామాలు.. మొక్కల పెంపకాలు..స్నేహం యొక్క ప్రాశస్త్యం..టి.వి సీరియళ్లు తదితర వర్తమాన అంశాలు..కవి పద్యాలకు కవితా వస్తువులైనాయి! సంస్కృతీ సంప్రదాయాలతో పాటు మన వారసత్వ సంపదను నొక్కి వక్కాణించారు. అలతి అలతి పదాలతో అనల్పార్థాన్ని సృష్టించారు. తెలంగాణ భాషను కొన్ని పద్యాల్లో ప్రయోగించిన తీరు బాగుంది. తెలంగాణ సాంస్కృతిక వారసత్వ సంపదను తెలుసుకోవడానికి..మత సామరస్యాన్ని కాపాడటానికి ఇందలి పద్యాలు ఉపకరిస్తాయి! సామాజిక చైతన్యానికి దోహదపడతాయి! బంగారు తెలంగాణ వైపు అడుగులేయడానికి యువతకు బాటను చూపుతాయి! మెతుకు సీమ సాహితీ సాంస్కృతిక సంస్థలో క్రియాశీలక పాత్రను పోషిస్తూ.. కవి అవుసుల భానుప్రకాష్..్ఛందోబద్ధ కావ్యాలను వెలువరించడంలో అగ్రభాగాన నిలుస్తున్నందులకు అభినందనలు తెలుపుదాం!

- సాన్వి, సెల్.నం.9440525544

**

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net