విజయవాడ

నిజం! నమ్మాలి మీరు.. (చిన్న కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నలభైకి చేరువలో వయసు.. పెద్ద చదువు.. మంచి జాబ్.. ఇన్ని వున్నా మైథిలికి పెళ్ళి చేయలేకపోయారంటే, జాతకంలో పెళ్ళి యోగం లేదని కాకమ్మ కబుర్లు. ‘పెద్దమ్మా! మిలీని నాతో ఢిల్లీ తీసుకుపోతాను. దాని పెళ్ళి చేశాకనే నీకు తెలియచేస్తాను’ అని మైథిలిని తీసుకుని ఢిల్లీ వచ్చేశాడు పృధ్వి.
‘వయసు పాతికేళ్ళు.. చదువు ఏడోక్లాసు.. దీనికెవరూ లేరు.. పిన్ని కూతురు. వంట బ్రహ్మాండంగా చేస్తుంది’ అంటూ నీలేష్‌కి పరిచయం చేశాడు.
‘నా తమ్ముడికి నలభై వయసు. ఈ పెద్దలు జాతకాలంటూ వాడికి పెళ్ళి కాకుండా చేశారు. ఎఆర్‌సిలో మంచి జాబ్. మనసులు కలవాలి గానీ వయసుతో పని ఏముంది పృధ్వీ’ అన్నాడు నీలేష్.
గ్రాండ్‌గా మైథిలికి, శ్యాంబాబుకి పెళ్ళి జరిపించాడు పృధ్వి. పెళ్ళి సంగతి పెదనాన్నకి తెలియపరచలేదు. ఏడాదిలోపే మైథిలి కవల పిల్లలకి జన్మనిచ్చింది.
పృధ్వీ నించి ఫోన్!
‘ఏడాది దాటింది వాడు మిలీని తీసుకుపోయి. ఏమంటాడు?’ అడిగింది వరమ్మ భర్తని.
‘దానికి కవల పిల్లలు పుట్టేరుట. రేపు నామకరణం చేస్తున్నారుట. మనల్ని రమ్మన్నాడు. మనం దాని తల్లితండ్రులని ఎవరికీ చెప్పకూడదట. జాతకాల్లో అప్పుడప్పుడూ తప్పు జరగవచ్చు. వాటిని నమ్ముకుని జీవితాలను పాడుచేసుకోవడం తగదు. ఇప్పుడింక కులమతాలు, జాతకాలు, నక్షత్రాలు.. అంటూ పెళ్ళిని వాయిదా వేస్తే చివరికి అందరూ శంతన కుమారుడులా మిగిలిపోతారని వాడు అంటున్నాడు’ వివరంగా చెప్పాడు భర్త.
‘వాడేమన్నా అంగీకరిస్తా. నా కూతురి జీవితం నందనవనం చేశాడు’ అంది వరమ్మ.
***

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి
మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. vijmerupu@gmail.com
email: merupuvj@andhrabhoomi.net

- చావలి సూర్యం, విజయవాడ.