విజయవాడ

చెరపకురా.. చెడేవు (కథ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమాట వినగానే నర్మగర్భమైన చిరునవ్వు తొణికసలాడింది ముత్యాలయ్య ముఖాన. తాను అనుకున్నది నెరవేరిందనే గర్వం, తనకు తిరుగులేదనే అహంకారం, తనలో అంతర్లీనంగా అతనిపై దాగి ఉన్న ద్వేషం.. అన్నీ ఒక్కసారిగా కలిసి కొట్టవచ్చినట్లు కనీకనపడకుండా ప్రస్ఫుటమయ్యాయి అతని ముఖంలో.
చేతివేళ్లు నలుపుకుంటూ, కళ్లలో కనీకనిపించని ఆనందంతో ‘అనుకున్నది సాధించావ్!’ అనే భావన ముత్యాలయ్యకు మాత్రమే అర్థమయ్యేలా అతని వైపు చూశాడు పక్కనే ఉన్న పొట్టి సుబ్బడు.
పొట్టి సుబ్బడు తన పని నెరవేరడానికి ఎంతటి వాడినైనా కాకాపట్టగల అతితెలివి, అవసరమైతే అవతలి వాడికి తెలియకుండానే వారిపై బురదజల్లగల కుసంస్కారం, రెండూ మేళవించి అవినీతిపరులకు భజన చేయడంలో అందెవేసిన వాడు. పది రూపాయలకు దొరికేదాన్ని పది పైసలకు కొనే కుయుక్తులు పన్నగల నేర్పరి. తనకు తాను కావాలనుకున్న వారికి ఎట్లాగైనా న్యాయం చేయగల విదూషక శిఖామణి. ముత్యాలయ్యకు నమ్మిన బంటు.
కొత్తగా ఏర్పడిన విశాల ఆంధ్ర సామ్రాజ్యానికి అధిపతి కావాలనుకున్నాడు ముత్యాలయ్య. వాళ్లా వీళ్లా కాళ్లావేళ్లా పడ్డాడు. తనకున్న పరపతిని, అధికారాన్ని ఉపయోగించాడు. అహంకారాన్ని ప్రదర్శించాడు. అధికారం పొందాలన్న తన అత్యాశను సమర్థించుకుంటూ పైవారికి విజ్ఞప్తులూ చేశాడు. పని కాకపోయేసరికి ధన, కుల, వర్గ బలాలను ప్రయోగించాడు. చివరకు తాను అనుకున్నది సాధించడానికి కాళ్ల బేరానికి వచ్చాడు. అప్పటికి ఆ సామ్రాజ్యాన్ని దశదిశలా విస్తరింపచేస్తున్న వారిపై ఉన్నవీ, లేనివీ పైవారికి చెప్పాడు. సత్యాన్ని అసత్యమన్నాడు. ధర్మాన్ని అధర్మం అని నొక్కిచెప్పాడు. న్యాయాన్ని అన్యాయంగా చిత్రీకరించాడు. ఇదంతా ముత్యాలయ్యకు వెన్నతో పెట్టిన విద్య. తనను సమర్థించుకుంటూ తననొక మేధావిగా అభివర్ణించుకుంటూ ఆ సామ్రాజ్యాన్ని పాలించగల అర్హత, సమర్థత తనకే ఉన్నాయని పైవారిని బెదరగొట్టాడు. చెవికింద రొద పెట్టాడు.
ముత్యాలయ్య పోరు పడలేక ‘సరే! ఈసారికి అధికారం నీవు తీసుకో? ప్రజలను బాగా చూసుకో! భూమండలిపై మిగిలిన సామ్రాజ్యాల కన్నా మన సామ్రాజ్యం మిన్నగా ఉండేట్టు చూడమ’ని అధికారులు ఆదేశించారు.
పదవి దక్కిందే చాలనుకున్నాడు. సింహాసనాన్ని అధిష్ఠించాడు. పాలన సాగిస్తున్నాడు. కానీ అవినీతి, అన్యాయం, అధర్మం మాత్రమే తెలిసి, తన వర్గంవారే ప్రజలు, ఇంకెవరూ కాదనుకునే ముత్యాలయ్యకు అడుగడుగునా అవరోధాలే ఎదురయ్యాయి. అన్నీ చికాకులే కనిపించాయి.
ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నట్లు ముత్యాలయ్యకు ఇంట గెలవడమే తెలుసుగాని మరొకటి తెలియకపాయె! అందుకే ఆ సామ్రాజ్యాన్ని తన ఇంటిగా మార్చుకున్నాడు. తను అనుకున్న వారిని గూఢచారులుగా నియమించాడు. నమ్మిన బంటులైన సుబ్బడు లాంటి విదూషకులకు అత్యంత స్వేచ్ఛనిచ్చాడు. తన సామ్రాజ్యాన్ని మెప్పించేందుకు ఇతర సామ్రాజ్యాల పాలనా తీరును, అవి అనుసరిస్తున్న విధానాలను అనుకరిస్తున్నాడు. దీనికి ‘ఆహా! ఓహో!’ అంటూ వంతపాడే వందిమాగధులను కూడగట్టుకున్నాడు. అందులో భాగంగానే తన చేతలను విమర్శిస్తూ తన లోపాన్ని వేలెత్తి చూపుతున్న ఒక్కొక్క సైనికుడికి తన సామ్రాజ్యం నుంచి బహిష్కరణ శిక్ష విధిస్తున్నాడు.
ఎవరిని బహిష్కరించాలి? ఎవరిని బహిష్కరించకూడదో.. సమాచారం ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఎంపిక చేసుకున్న తాటిచెట్టు లాంటి ఇద్దరు విశ్వాసపాత్రులను నియమించాడు. వారికి సర్వాధికారాలు ఇచ్చినట్లు చెప్పాడు. వారెంత చెబితే అంతేనన్నాడు. ఇక వారు రెచ్చిపోయారు. న్యాయాన్ని, ధర్మాన్ని నాలుగుపాదాల నడిపిస్తామంటూనే అందరినీ సమానంగా చూడాలనే ఆదర్శవంతులుగా చెప్పుకుంటూనే నియంత పోకడలు పోయారు. తాము ఏ పనికిమాలిన పని చెప్పినా చేయనివారిని, ఎదురుతిరిగిన వారిని ముత్యాలయ్య ఎదురు దోషిగా నిలబెడుతున్నారు. ముత్యాలయ్య కూడా విదూషకుడి సలహాతో వారికి సామ్రాజ్య బహిష్కరణను శిక్షగా విధిస్తున్నాడు. అతనూ ఆ తానులో ముక్కేగా! ఇప్పుడు సైన్యాధికారి వంతు వచ్చింది. వందిమాగధులు అతన్ని ముత్యాలయ్య ఎదుట దోషిగా నిలబెట్టారు. ముత్యాలయ్య విచారణ చేపట్టాడు. తాను అడిగిన ప్రశ్నలకు సైనికాధికారి ఇస్తున్న సమాధానాల్లో వాస్తవాన్ని, నిజాయితీని గ్రహించాడు. ముత్యాలయ్య తనలోని లోపాన్ని తెలుసుకున్నాడు. అయినా అహంకారం అడ్డొచ్చింది. తాను చుట్టూ కొండరాళ్లతో గట్టిగా కట్టుకున్న తన వర్గం గుర్తుకొచ్చింది. పైకి ఎన్ని చెప్పినా ఆ వర్గాన్ని, తన సొంత ఇంటిని వదలలేని బలహీనత ఏర్పడింది. తన వర్గం కాని సైనికాధికారిని ఏదోఒకటి చేయాలని వందిమాగధులు, విదూషకుడి ఒత్తిడి ఎక్కువైంది. ఇక చేసేదిలేక పచ్చి అబద్ధాలను, ఆరోపణలను సైనికాధికారిపై వేశాడు ముత్యాలయ్య. అవన్నీ అవాస్తవాలేనని మరోవైపు తన మనస్సు హెచ్చరిస్తూనే ఉంది. అమ్మో! తన వర్గబలం పోతే తన అధికారం పోతుందేమోనన్న భయం ఏర్పడింది అతనిలో.
సైనికాధికారిని బహిష్కరిస్తూ తన పదవికి ముప్పు రాదనుకున్నాడు. అదిగో ఆ క్రమంలో జరుగుతున్న తంతే ఇది.
ముత్యాలయ్య ఎదుట కూర్చున్నాడు సైనికాధికారి. పక్కనే చేతులు నలుపుకుంటూ నిలబడ్డాడు విదూషకుడు సుబ్బడు.
మరోపక్క చేతులు కట్టుకుని నిలుచున్నారు తాటిచెట్ల లాంటి విశ్వాసపాత్రులు.
ఈ దృశ్యాన్ని చూసిన సైనికాధికారికి చికాకు వేసింది. తాను ఎంత చెప్పినా వారు వినరనిపించింది. వారంతా అభివృద్ధి ముసుగేసుకున్న విద్రోహుల్లా కనిపించారు. మేధావులమని చెప్పుకునే అసాంఘిక శక్తులను నిరోధించాడు. నిజమే! పైకి కనిపించే మెరుగైన సమాజం చెప్పుకోడానికే గాని, ఆ ముసుగులోని విద్రోహులను దనుమాడే వారెవ్వరు?
సైనికాధికారి సామ్రాజ్య బహిష్కరణకు సిద్ధమేనన్నాడు.
అదిగో అప్పుడే, ఆ మాట వినగానే నర్మగర్భమైన చిరునవ్వు తొణికిసలాడింది ముత్యాలయ్య ముఖాన!
కాని ఆ చిరునవ్వు ఎంతోకాలం నిలవలేదు. అచ్చంగా ముత్యాలయ్య లాంటివాడే కాని అంతకు మించి రెండాకులు ఎక్కువ తెలివితేటలు గలవాడు, కుయుక్తులూ కలవాడు ఆ పదవికి పోటీకొచ్చాడు.
ముత్యాలయ్యను మించినవాడు, అంతకన్నా ఎక్కువ వర్గబలం కలవాడు, తాను నమ్మినవారికి కొండ మీది కోతినైనా తెచ్చిపెట్టేవాడు ముత్యాలయ్యపై అవాకులు, చెవాకులు చెప్పాడు. అతని తప్పులనూ ఎత్తిచూపాడు. ముత్యాలయ్య అధికారం కోసం ఏమైతే చేశాడో అచ్చం అలాగే, అంతకన్నా ఇంకొంత మెరుగ్గా తన తెలివితేటలను ప్రదర్శించి అధికారంలోకి వచ్చాడు.
పాపం! ముత్యాలయ్యకు రక్తపోటు పెరిగింది.
గుండె కండరాలు విశాలమయ్యాయి.
వైద్యులు నీవిక ఏ పనీ చేయొద్దున్నారు.
అంతే అక్కడే కళ్లు తిరిగి పడిపోబోతున్న ముత్యాలయ్య కళ్ల ఎదుట అస్పష్టంగా సైనికాధికారి రూపం కదలాడింది. ‘నాకు అన్యాయం చేస్తావా? నీ పనేమైందో చూడు!’.. అని హెచ్చరించినట్లుంది. అప్పుడనిపించింది ముత్యాలయ్యకు ‘చెరపకురా.. చెడేవు’ అని. వందిమాగధులు, విదూషకుడు కొత్త అధికారి వెంట పరుగెత్తారు అతన్ని కాకా పట్టడానికి!

- కాకుమాను శ్రీనివాసమూర్తి,
మంగళగిరి, గుంటూరు జిల్లా.
చరవాణి : 9704082336

చిన్ని కథ

అనుబంధం, ఆత్మీయత బూటకం!

‘మీ చెల్లిలికి ఎలా వుంది?’ అడిగింది పక్కింటావిడ. ‘డాక్టర్లు ఇంటికి తీసుకెళ్లిపొమ్మన్నారు. అమెరికా నుంచి మూడో కొడుకు వచ్చేవరకే దాని ప్రాణం. అది చనిపోతే ఇల్లు మైలపడుతుందని కొనప్రాణంతో వున్నదానిని వరండాలో పెట్టారు. షామియానాలు వేసేశారు. ఇంట్లో ఫ్యామిలీ మొత్తం ఆ ‘నీటిపూలు’ సీరియల్ చూస్తున్నారు’.
‘మరి మీరు వచ్చేశారేం? మీరు కూడా ఆ సీరియల్ రోజూ చూస్తారు కదా..’!
‘పిదపకాలం! పెద్దవాళ్లని గౌరవించడం తెలియదు. సోఫాలు, కుర్చీల్లో కొడుకులు, కోడళ్లూ వచ్చిన బంధువులందరికీ ఒక చాప వేశారు. పేరంటానికి వచ్చిన వాళ్లల్లా.. పెద్దవాళ్లందరూ వాళ్ల కాళ్ల దగ్గర..’ కోపంగా అంది.
‘చావుబతుకుల మధ్య వున్న చెల్లెల్ని బయటపారేస్తే ఆవిడ దగ్గర ఒక్కరు కూడా లేని బాధ కాదు, తనకు మర్యాద ఇవ్వలేదని వచ్చేసింది. మిగిలిన సీరియల్స్ తన ఇంట్లో చూసుకోవచ్చని’.. చాటుగా అనుకున్నారు.
మర్నాడు ఉదయం వెళ్లి కూడా అరగంటలో వచ్చేసింది.
‘అమెరికా కొడుకు రాలేదు. కొడుకులు, కూతుళ్లూ అందరూ పేకాటలో వున్నారు. ఆడాళ్లంతా టిఫెన్లు, కాఫీల సందడిలో.. వెళ్లగానే ఒక చిన్న ఏడుపు. మా చెల్లిని బాక్స్‌లో చూశా. ప్రాణం ఎప్పుడు పోయిందో ఎవరికీ తెలియదు. వరండాలో దోమలతో దాని ప్రాణం హరీ అని వుంటుంది. తలదగ్గర టార్టాయిస్ పెట్టేరనుకోండి.
‘ఇప్పుడు పెద్దవాళ్లు పోతే బాధలేదు. నిజంగా వారికి చావు ఒక విముక్తి. ఆస్తిని త్వరగా పంచుకుని ఎవరికివారు వెళ్లిపోడానికే వచ్చారు వాళ్లంతా. పాత సినిమా పాట గుర్తుందా.. ‘అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం - ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం’ అని. అప్పుడే రాశారీ పాట. ఇప్పుడింకా ప్రేమలు తగ్గిపోతున్నాయి.’

- చావలి శ్యామల, విజయవాడ
వేదిక

8వ ‘సోమేపల్లి’ జాతీయస్థాయి
చిన్న కథల
పోటీ ఫలితాలు
సోమేపల్లి హనుమంతరావుగారి స్మృత్యర్థం ఇటీవల రమ్యభారతి సాహిత్య త్రైమాసిక పత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి చిన్న కథల పోటీలకు మొత్తం 123 కథలు పరిశీలనకు రాగా ‘ఇది కథ కాదు’ కథకు గాను చిత్తూరుకు చెందిన సిఎన్ చంద్రశేఖర్‌కు ప్రథమ స్థాయి సోమేపల్లి పురస్కారం లభించింది. బి కళాగోపాల్ (నిజామాబాద్) రాసిన ‘్ఫలక్’కు ద్వితీయ, రాచమళ్ళ ఉపేందర్ (ఖమ్మం) రాసిన ‘కొత్త బంధం’కు తృతీయ స్థాయి సోమేపల్లి పురస్కారాలు లభించాయి. ప్రోత్సాహక కథలుగా మొలుగు కమలాకాంత్ (విజయవాడ) రాసిన ‘అలజడి వాన’, సింహప్రసాద్ (హైదరాబాద్) రాసిన ‘ఆశావహం’, డా.అల్లంశెట్టి చంద్రశేఖరరావు (పొందూరు) రాసిన ‘పొడుగు చేతులు’, కె రామమోహన్ (ప్రొద్దుటూరు) రాసిన ‘మేఘ సందేశం’ ఎంపికయ్యాయి. విజేతలకు నగదు బహుమతులతో పాటు డిసెంబర్‌లో విజయవాడలో జరిగే బహుమతి ప్రదానోత్సవ సభలో జ్ఞాపిక, శాలువాలతో ఘనంగా సత్కరించనున్నట్లు అవార్డు కమిటీ చైర్మన్ సోమేపల్లి వెంకట సుబ్బయ్య, రమ్యభారతి ఎడిటర్ చలపాక ప్రకాష్ ఇక్కడ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలకు ప్రముఖ రచయిత కాట్రగడ్డ దయానంద్ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.

పుస్తక పరిచయం

‘జీవ’ కలం సుమాలు

భద్రాద్రి కవిధారామంజరి సౌమ్యుడు, వైద్య రంగానికి చెందిన కవీశ్వరుడు గుమ్మల వెంకటేశ్వరరావు ‘జీవ’గా సుపరిచితుడు. బహుముఖ రంగాల్లో ప్రవేశం పొందిన ఈ సాహితీ ఉత్సాహి రాసిన రెండో కవితా సంపుటి ‘జీవకలం’ మొత్తం 25 కవితలు పొదిగిన ఈ కవితా కలంలో అన్ని కవితలు సామాజిక స్థితిగతుల చిత్రికలే! కుటుంబంలో తండ్రి పాత్రను బహుముఖాలుగా చిత్రించిన ‘తండ్రి’ కవిత మొదలు ‘స్థానబలం’లో వుండే వైవిధ్యం తెలిపే ‘స్థానబలం’ కవిత వరకు సాగిన ఈ జీవకలం ధార కవితా ప్రియుల పాలిట వరం.
‘అనుకోని వెతలను / ఆనందంగా మోసేది / అమ్మలోని అనురాగం / ఆకలి తీర్చే నైపుణ్యం కలది’ అంటూ భార్య ఔచిత్యాన్ని అందంగా అక్షరీకరించిన తీరు బాగుంది.
మనసు మర్మం చాటే చక్కని కవిత ‘మనసు’. కల్మషం లేని మాననీయ విలువలు అందిస్తుంది. ‘మనస్సు లేనిచోట / మగువ ఉండదు / చెలిమి లేనిచోట / స్నేహముండదు... అంటూ చక్కటి నిజాన్ని నిగారింపు చేసింది.
వైద్యంలో దోపిడీతత్వం, ‘చట్టం- న్యాయం’లోని డొల్లతనం, తెలుగు భాష ఔన్నత్యం, జాతిపితపై మమకారం, రాజకీయ కుతంత్రాలు, కాలుష్య కోరల్లో జనజీవనం, సతమతమవుతున్న వైనంతోపాటు కొన్ని అకాల సంఘటనలకు స్పందించి రాసిన కవితలు ఇందులో చదవవచ్చు.
అలాంటి కవితల్లో ఒకటి ‘లుంబిని విలయం’
హైదరాబాద్ లుంబినీ పార్కులో జరిగిన బాంబు దాడికి స్పందించిన కవిత అది. ‘మత వ్ఢ్యౌం / జడల దెయ్యంలా / విజృంభిస్తుంది / మతాభిమానం / మంచిని పెంచాలి కాని / మారణహోమాన్ని కాదు’ అంటూ మతం పేరుతో జరుగుతున్న అలజడులపై కవి ఆవేదన చూపిస్తాడు. కవిత్వంలో సరళత్వం, కవిత్వీకరణలో సామాజికత్వం పెనవేసుకున్న ‘జీవ’ కవితలు చదువుతుంటే మల్లెల పరుపుపై పవళించిన అనుభూతి కలుగుతుంది. చూపుకి సామాన్యంగా అగుపించినా భావానికి భరోసాగానే అగుపిస్తాయి ఈ కవితలు. తెలుగు కవితాభిమానులంతా తప్పక చదువుకోదగ్గ కవితా సంపుటి ‘జీవకలం’

- అమ్మిన శ్రీనివాసరాజు,
చర్ల, ఖమ్మం జిల్లా.
చరవాణి : 7729883223

మనోగీతికలు

నీకు నీవే
నీ కాళ్లు ఇంకా
పొడవు సాగాల్సిందే
పెద్దపెద్ద అంగలు వేస్తూ
అనుకున్న దారిలో
దూసుకుపోవాల్సిందే
ఎన్ని ఆటంకాలు ఎన్ని అవరోధాలు
పుట్టిన నాటి నుండి వినీవినీ
కుంచించుకుపోయిన మనసు
ఘనస్థితిలో దాగున్న భావాలు
ద్రవీకరించాల్సిందే
కంటకాలు తొలగిస్తూ
సర్వ స్వతంత్ర హక్కులు గుర్తిస్తూ
నీ పరిధి ఇంకా
విస్తరించుకోవాల్సిందే
మనో దృఢత్వంతో
వజ్ర సంకల్పంతో
ముందుకు నడుస్తూ
అభ్యుదయ గీతాన్ని ఆలపిస్తూ
భయోత్పాతాల్ని ఖండిస్తూ
అభద్రతా భావనలకు
స్వస్తిపలకాల్సిందే
అంగడి బొమ్మగా ఆట వస్తువుగా
వంశం పొడిగింపు యంత్రంగా
హీనంగా ఈసడించేందుకు జంకని
నీ చుట్టూ మూకల్ని నిలదీయాల్సిందే
ధైర్యం నిబ్బరం ఆభరణాలుగా ధరించి
నిన్ను నీవింకా విస్తృతంగా అవలోకించి
బలహీన తలాల్ని ఛేదిస్తూ
ఛాందస వాదాల్తో భేదిస్తూ
నీ బాటలో నీవు
పూలుపరచాల్సిందే!

- షేక్ బషీరున్నీసా బేగం,
గుంటూరు. 9985193970

సాలోచనగా..
నాలుగ్గోడల మధ్య
బతికేస్తూ నా అవసరాలన్నీ
గడచిపోతున్నా
ఈ ప్రపంచంతో
నాకేం పని అని అనుకోను!
ఇంటి పైకప్పు వ్యక్తిగత జీవితంలో
నను బందీ చేయాలనుకున్నా
ఈ లోకం పోకడ
నాకెందుకనుకోను!
ఎక్కడి నుండో ప్రసరించే
సూర్యకిరణం నన్ను తాకి
జీవాన్ని ప్రసాదిస్తున్నప్పుడు
దాన్నుంచి నేనేం తెలుసుకోవాలో
ఆలోచిస్తాను
విజ్ఞానం ముసుగులో
వెర్రితలలు వేస్తున్న
మానవీయ ప్రవృత్తిని
పరిశీలించవలసిన
ఓ మనిషీ
నువ్వు తిరోగమిస్తున్నావో
పురోగమిస్తున్నావో
ఆలోచించుకో!
‘అమరం’ వైపుకి
అడుగులు వేయాలని
తెలుసుకో!

- గోలి మధు,
వినుకొండ, గుంటూరు జిల్లా.
చరవాణి : 8121840029

ఆకాంక్ష
గుప్పెడు వృక్ష
మూల జీవికల్ని
వనిలో విత్తాను
అంకురాలు
మారాకులు విప్పడం
చెట్లు
మహా తరువులుగా ఎదగడం
చూడాలని ఉంది
వృక్ష శాఖలపై పక్షులు
గుంపులు గుంపులుగా
కొలువుతీరి
కువకువా రాగాలను
స్వరిస్తుంటే
వీనులు విప్పి వినాలనుంది
భూ ఉపరిస్థలంలో
వనవసంతం పూరించి
ధరిత్రిని
జీవవైవిధ్య ఆవాసంగా
సస్యసాకార సాదృశ్యంగా
ఆవిష్కరించాలని ఉంది
మొక్కవోని
ప్రకృతి పచ్చనిక్రాంతి
ప్రసవానికి
హరిత ప్రాణశక్తికి
చేతులు జోడించి
అంజలి ఘటించాలని ఉంది!

- సందుపట్ల భూపతి
మంగళగిరి,
9603569889

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007.
కథ

చెరపకురా.. చెడేవు

email: merupuvj@andhrabhoomi.net

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007.
vijmerupu@gmail.com

- కాకుమాను శ్రీనివాసమూర్తి