రాష్ట్రీయం

మెట్రో పనులు 74శాతం పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనుల్లో జాప్యం లేదు
మంత్రి కెటిఆర్ వివరణ
ప్రాజెక్టు వెనుక భారీ స్కాం
విచారణకు అక్బరుద్దీన్ డిమాండ్

హైదరాబాద్, మార్చి 13: హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి జాప్యం లేదని, అనుకున్న సమయానికే పూర్తి చేస్తామని తెలంగాణ పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. ఇప్పటికే 74 శాతం పనులు పూర్తయ్యాయని వివరణ ఇచ్చారు. ఆదివారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణ పనులపై వాడివేడి చర్చ జరిగింది. కాంగ్రెస్ సభ్యుడు మల్లు భట్టి విక్రమార్క, ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ తదితరులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఢిల్లీలో 25 కిలోమీటర్ల మెట్రో పనుల నిర్మాణానికి ఏడున్నరేళ్లు, బెంగళూరులో 6 కిలోమీటర్ల దూరానికి ఏడేళ్లు, చెన్నైలో 8 కిలోమీటర్లు నిర్మాణానికి 6 సంవత్సరాలు పట్టిందని, హైదరాబాద్‌లో 72 కిలోమీటర్ల మార్గాన్ని నిర్మించాలంటే ఎంత కాలం పడుతుందో సభ్యులు గమనించాలని మంత్రి కెటిఆర్ వివరణ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెట్రో పనులు శరవేగంగా జరిగి 43 కి.మీ దూరం పూర్తయ్యాయన్నారు. మంత్రి సమాధానంతో సంతృప్తి చెందని భట్టివిక్రమార్క మాట్లాడుతూ అసెంబ్లీ, సుల్తాన్ బజార్, పాతబస్తీలో మెట్రో అలైన్‌మెంట్ మార్పు చేస్తామంటూ జాప్యం చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడి రూ.3 వేల కోట్ల నుంచి ఆరు వేల కోట్లకు పెరిగిన మాట వాస్తవం కాదా, పనుల్లో జాప్యం కారణంగా ఎల్‌అండ్‌టికి అదనంగా ఎంత చెల్లించారని ప్రశ్నించారు. ఎంఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ మెట్రో రైల్ ప్రాజెక్టు కాంట్రాక్ట్ వెనుక వేల కోట్ల కుంభకోణం దాగి ఉందని, వాస్తవాలు వెలుగు చూడాలంటే విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. తాము మెట్రో ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని, అయితే ప్రైవేటు కాంట్రాక్టర్లకు దీర్ఘకాలికంగా వేల కోట్ల ఆదాయాన్ని కల్పించే విధంగా ఒప్పందాలు చేసుకున్నారని అక్బరుద్దీన్ ఆరోపించారు. తన వద్ద ఉన్న సమాచారాన్ని మొత్తం సభకు వివరిస్తూ 30 ఏళ్ల లీజు సమయానికి దాదాపు 50 వేల కోట్లకుపైగానే కాంట్రాక్టర్లకు ఆదాయం సమకూరుతుందని వివరించారు. ప్రభుత్వ, ప్రైవేటు స్ధలాలను మెట్రోకి భారీగా కట్టబెట్టారని, పార్కింగ్ ఫీజలు, కమ్మర్షియల్ స్థలాలు, ప్రకటనలపై వచ్చే ఆదాయం అంతా కలిపితే రూ.లక్ష కోట్ల ఆదాయాన్ని రానున్న 37 ఏళ్లలో ప్రైవేటు వ్యక్తుల చేతికి అప్పగించినట్లు ప్రస్తుతం ఉన్న ఒప్పందాల్లో ఉందని అన్నారు. మంత్రి స్పందిస్తూ మూడు చోట్ల అలైన్‌మెంట్ మార్చాల్సి ఉందని తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత భావించిన మాట వాస్తవమేనని, అయితే ప్రాజెక్టు త్వరగా అమలు చేయాలనే సంకల్పంతో అలైన్‌మెంట్ మార్పునకు సంబంధించి సిఆర్‌ఆర్‌ఐ కేంద్ర సంస్థ ద్వారా సర్వే చేయించి నివేదిక తీసుకున్నామన్నారు.