మిర్చిమసాలా

‘గాలి’ కబుర్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణంగా ఊహాజనిత, అసాధ్యమైన విషయాలను ఎవరైనా ప్రస్తావిస్తుంటే ‘గాలి కబుర్లు’ చెబుతున్నారంటూ ఎ ద్దేవా చేస్తుంటాం. టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు విలేఖర్ల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేసి ఎదుటివారిని విస్తుపోయేలా చేశారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అసలు కారకుణ్ని తానేనని చెప్పారాయన. ‘అసెంబ్లీ ఎన్నికలకు రెండు మాసాల ముందుగా వెదురుకుప్పం జెడ్పీటిసి స్థానానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని 7 వేల ఓట్ల ఆధిక్యతతో గెలిపించి చంద్రబాబు దిమ్మతిరిగేలా చేశాను. అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి ‘ఉప ఎన్నికల్లో గెలవటం అసాధ్యం. దీనికి కోటి రూపాయలు కావాలం’టూ నన్ను నిరాశపరిచినా పట్టుదలతో అభ్యర్థిని పోటీకి నిలిపాను. ఉపఎన్నికలో అభ్యర్థి గెలిచిన తర్వాత కాంగ్రెస్‌కు మంచి ఊపువచ్చింది. వైఎస్ అవినీతి కార్యకలాపాలు నచ్చకపోవడంతో తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారట గాలి!
- నిమ్మరాజు చలపతిరావు
ఇదో వేలం వెర్రి..!
ఈ మధ్య రాజకీయ నేతలు కాలేజీల వెంట పడుతున్నారు. ఏ పిచ్చి పడితే అదే పిచ్చిని కొన్నాళ్లు భరించాలి. మొహం మొత్తేవరకూ అంతే. కాలేజీల్లో విద్యార్థులనుద్దేశించి నైతిక విలువలు, సమాజ సేవ గురించి ఉర్రూతలూంగించే ఉపన్యాసాలు నేతలు ఇవ్వడం ఇపుడు బాగా పెరిగింది. ఎపిలో ఇదొక ఫ్యాషన్‌గా తయారైంది. సిఎం చంద్రబాబు తనయుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వరుసగా కాలేజీలను సందర్శించి, అక్కడి విద్యార్ధులతో ఇష్టాగోష్టిగా చర్చిస్తున్నారు. ఇటీవల జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ ఓ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధులనుద్దేశించి ప్రసంగించారు. ఇక, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎపికి ప్రత్యేక హోదా ప్రాధాన్యతను వివరించేందుకు, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి వివిధ ప్రాంతాల్లో కాలేజీ విద్యార్ధులను ఉద్దేశించి ప్రసంగాలు చేస్తున్నారు. విద్యార్ధులు ప్రశ్నలు అడగడం, నేతలు సమాధానాలు చెప్పడం చూస్తున్నాం. వీరి ఉపన్యాసాలు, హితవచనాలను విద్యార్ధులు శ్రద్ధంగా వినడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉపన్యాసాలు వినడం వరకైతే ఫర్వాలేదు.. నేతలు చెప్పింది విద్యార్థులు చేయాలనుకుంటే ఇబ్బందే మరి.. -శైలేంద్ర

జేబుదొంగలకు ఎంత కష్టం!
పెద్దనోట్ల రద్దు తర్వాత నగదుకు కొరత ఏర్పడి చాలామంది జేబులు ఖాళీగా కనిపిస్తున్నాయ. దీంతో జేబు దొంగతనాలు ఇపుడు తగ్గాయని పోలీసులు అంటున్నారు. జేబు దొంగతనాల్లో ముందు వరసలో నిలిచే విజయవాడ, గుంటూరు, విశాఖ, హైదరాబాద్ నగరాల్లో జేబు దొంగతనాలు , బ్యాగుల చోరీ కేసులు నమోదు కావడం లేదని పోలీసులు సంబరపడిపోతున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వైపు జేబుదొంగలు రావడమే మానేసారంట. బ్యాంకుల వద్ద ఖాతాదారులను మాయమాటల్లో పెట్టి నగదు తస్కరించే దొంగల జాడ కూడా లేదట! బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి తీసుకొచ్చే పాత నోట్లు చెల్లకపోవడం, నగదు డ్రా చేసుకున్నా వెయ్యి, రెండు వేలకు మించి బ్యాంకులు ఇవ్వకపోవడంతో బ్యాగుల అవసరం లేకుండా పోయంది. బ్యాంకుల వద్ద ఇక తమకు గిట్టుబాటు కాదని తేలడంతో పాపం.. జేబుదొంగలు ప్రత్యామ్నాయాలను వెదుక్కుంటున్నారు.
-వెల్జాల చంద్రశేఖర్

‘కిక్’ తగ్గకూడదు..
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో జనం అవస్థల గురించి తన రోజువారీ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆరా తీసే ఎపి సిఎం చంద్రబాబు జిల్లా అధికారులకు ఓ ‘రేంజ్’లో క్లాసు తీసుకున్నారు. పెద్దనోట్లు రద్దయినందున మందుబాబులు ఇక ‘స్వైప్ మిషన్ల’తో నగదు ర హిత లావాదేవీలు జరిపితే- వారికి ఎం ఆర్‌పి ధరలకే మ ద్యం లభిస్తుందని, గ్రామాల్లో బెల్టుషాపుల బెడద తీరుతుందని జిల్లా పాలనాధికారి అత్యుత్సాహంగా సిఎంతో అన్నారు. మద్యం షాపుల్లో ‘స్వైప్ మిషన్లు’.. ఎంఆర్‌పి ధరలకే మద్యం.. బెల్టుషాపుల నివారణ.. ఇవన్నీ అయ్యే పనులు కావని, ఎక్సయిజ్ ఆదాయం పడిపోకుండా చూడాలని చంద్రబాబు కాస్త కఠినంగానే అన్నారు. పెద్దనోట్ల రద్దు ప్రభావం మద్యం విక్రయాలపై ఏ విధంగానూ పడరాదన్నారు. తాను ఇస్తున్న ఈ సూచనలను రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లంతా పాటించాలని సిఎం ఆదేశించారు. నగదు రహిత లావాదేవీలు, ఆర్థిక క్రమశిక్షణ అంటూ నిత్యం పాఠాలు చెప్పే చంద్రబాబు ఇలా- మద్యం ఆదాయం తగ్గరాదని ఆదేశాలివ్వడం కొంతమంది అధికారులను విస్మయపరచింది.
- వురిటి శ్రీనివాస్
‘నకిలీ’కీ అదే ఇంకు..
పెద్దనోట్ల రద్దు వెనుక కారణాలు ఎన్నో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. నల్లధనం నియంత్రణ, పాకిస్తాన్ నుంచి నకిలీ కరెన్సీ రాకుండా అరికట్టడం, అవినీతిని నిర్మూలించడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నారని బిజెపి నేతలు సెలవిస్తున్నారు. కాగా, మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ మాత్రం బాంబులాంటి వార్త చెప్పారు. భారత్‌లో కరెన్సీ ముద్రణకు ఉపయోగించే ఇంకు, సిల్వర్ థ్రెడ్ సరఫరా చేసే కంపెనీయే పాకిస్తాన్‌కూ సప్లయ్ చేస్తోందట. ఇక మీరే అర్థం చేసుకోండి..! భారత్‌లో నిజమైన నోట్ల తయారీకి, పాక్‌లో నకిలీ కరెన్సీ ముద్రణకు ఇంకు ఒక్కటే.. తేడా గుర్తించకుంటే చెలామణిలో విలువ కూడా ఒక్కటే..! -ఈశ్వరరెడ్డి