మీకు మీరే డాక్టర్

సుఖ విరేఛనం కలిగించే ఆహారద్రవ్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(గత సంచిక తరువాయ)

అల్లం ముక్కల్లో తగినంత సైంధవ లవణం కలిపి ముద్దగా నూరి, ఒక చెంచా మోతాదులో అన్నంలో కలుపుకుని నెయ్యి వేసుకుని మొదటి ముద్దగా రోజూ రెండు పూటలా తినే అలవాటు జీర్ణకోశ వ్యాధులన్నింటికీ మంచిది. సుఖవిరేచనం, కాల విరేచనం అవుతాయి.
ఆవపొడిని కొద్దిగా కలిపి కూరగాని, పెరుగులో కలిపి పెరుగు పచ్చడిగా గానీ రోజూ ఒక ఆహార పదార్థంగా అన్నంలో తినేవారికి పేగుల్లో సమస్యలు తీరుతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది. సుఖవిరేచనం అవుతుంది.
ఉత్తరేణి మొక్కలు రోడ్డు పక్కన, ఖాళీ స్థలాలలోనూ, పొలం గట్ల మీద పెరుగుతుంటాయి. దీన్ని ‘దుచ్చెన చెట్టు’ అని కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తుంటారు. దీని లేత ఆకులతో కూర వండుకుంటారు. మిరియాలపొడి, వెల్లుల్ని కలిపి పొడి కూరగా చేసుకుని కొద్ది మోతాదులో తరచూ తింటూ ఉంటే లివరు జబ్బులు, కిడ్నీ జబ్బులూ తగ్గుతాయి. పేగులు బలసంపన్నం అవుతాయి. కఫం తగ్గుతుంది. సుఖ విరేచనం అవుతుంది. ఉబ్బస రోగులకు మేలు చేస్తుంది.
కరక్కాయ బెరడుని పైపైన దంచిన పొడిని టీలాగా కాచుకుని రోజూ ఒకటి లేక రెండుసార్లు తాగుతుంటే సుఖవిరేచనం అవుతుంది.
కాకరాకులను కూడా కాకరకాయల మాదిరే పచ్చడి చేసుకుని తినవచ్చు. ఇది శరీరంలో విష దోషాలను పోగొట్టడమే కాకుండా సుఖ విరేచనం అయ్యేలా చేస్తుంది.
పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు సమానంగా తీసుకుని, కేరట్ ముక్కలు, కీరదోస ముక్కలు, ముల్లంగి ముక్కలు వీటిని తగుపాళ్లలో తీసుకుని మిక్సీ పట్టి రసం తీసుకుని తగినంత, ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం కలిపి రోజూ ఉదయానే్న ఒకటీ లేక రెండు గ్లాసుల రసం తాగటాన్ని అలవాటు చేసుకోండి. చలవ కలుగుతుంది. జీర్ణశక్తి బాగుపడుతుంది. సుఖ విరేచనం అవుతుంది.
10-15 కృష్ణతులసి ఆకుల్ని రాత్రిపూట గ్లాసు నీళ్లలో వేసి ఉంచి ఉదయానే్న ఆ నీళ్లు తాగండి. ప్రొద్దునే్న నీళ్లు తాగే అలవాటున్న వారు మామూలు నీటికి బదులుగా ఈ విధంగా తులసి తీర్థం ఆకులతో సహా తీసుకుంటూ ఉంటే పేగులు బాగుపడతాయి. విరేచనం ఫ్రీగా అవుతుంది.
తాజా గులాబీ రేకుల్ని పంచదారను సమానంగా కలిపి ఒకటి రెండు రోజుల్లో ముద్దగా అవుతుంది. దీనే్న గుల్కందీ అంటారు. ఒకటీ లేక రెండు చెంచాల ముద్దని రోజూ తింటూ ఉంటే సుఖవిరేచనం అవుతుంది.
లేత గుంటకలగర ఆకుల్ని కొద్దిగా చుక్కకూర లేదా గోంగూర కలిపి భాండీలో పైపైన వేయించి, మెత్తగా నూరి పచ్చడి చేసుకుని తరచూ తింటూంటే లివరు దృఢపడుతుంది. పేగులు బాగుపడతాయి. సుఖవిరేచనం అవుతుంది.
ముదురు తమలపాకులను మెత్తగా నూరిన ముద్దలో సగం మోతాదులో శొంఠి పొడి కలిపి తడి మీదే కుంకుడు గింజంత ఉండలుగా కట్టి ఆరబెట్టండి. పూటకు ఒకటీ లేక రెండు మాత్రల చొప్పున మూడు పూటలా తీసుకునేవారికి జీర్ణకోశ సమస్యలు తగ్గుతాయి. కాలవిరేచనం అవుతుంది. అమీబియాసిస్ వ్యాధిలో ఇది ఔషధంగా ఉపయోగపడుతుంది.
గలిజేరు తీగ పొలం గట్ల మీద పాకుతూ పెరుగుతుంది. దీని లేత ఆకులతో కూర, పప్పు, పచ్చడి, పులుసుకూర ఇలాంటివి చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. వారంలో ఒకటి లేక రెండుసార్లయినా గలిజేరు ఆకులతో వంటకాన్ని చేసుకుని తింటే సుఖవిరేచనం అవుతుంది. లివరు చాలా శక్తిమంతం అవుతుంది. జలోదరం వ్యాధిలో ఇది గొప్ప ఔషధం.
బచ్చలి, పొన్నగంటి, గంగపావిలి ఇలాంటి ఆకు కూరలు సుఖ విరేచనం కలిగించేవిగా ఉంటాయి.
బూడిద గుమ్మడికాయని ఒక కూరగాయగా వాడుకోవటాన్ని మనవాళ్లు ఏ కారణం చేతనో మరిచిపోయారు. సొరకాయతో వండుకోదగినవన్నీ బూడిద గుమ్మడికాయతోనూ వండుకోవచ్చు. శక్తితోపాటు బలమూ పెరుగుతుంది. జీర్ణశక్తి మెరుగౌతుంది. సుఖవిరేచనం అవుతుంది. తరచూ బూడిదగుమ్మడిని వండుకోవటానికి ప్రయత్నించండి.
పులుసు సాంబారులకన్నా పెసరకట్టు మెరుగైన వంటకం. పొట్టు తీయకుండా వండుకుంటే మరీ మంచిది. పొట్ట బాగుపడుతుంది. కాలవిరేచనం అవుతుంది.
కూరగాయలు, ఆకుకూరలతో వంటకాలను ఇప్పుడు తింటున్న దానికన్నా ఎక్కువగా తినటాన్ని అలవాటు చేసుకోవటం వలన సుఖ విరేచనం అవుతుంది. కూర ఎక్కువగానూ, అన్నం తక్కువగానూ తినటం ఒక్కటే మలబద్దతకు శాశ్వత పరిష్కారం.
*

- డా. జి.వి.పూర్ణచందు 9440172642 purnachandgv@gmail.com