బిజినెస్

కడప జిల్లాలో ఖనిజాల ఆదాయ లక్ష్యం రూ. 1,000 కోట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను నిర్ణయంచుకున్న ప్రభుత్వం
ఈ ఆర్థిక సంవత్సరం బెరైటీస్ ఆదాయం రూ. 400 కోట్ల పైమాటే
ఇతర ఖనిజాల ద్వారా రూ. 151 కోట్లు, ఇసుక నుంచి రూ. 70 కోట్లు
జనవరి నుంచి 50 శాతం రాయల్టీ పెంపునకు కసరత్తు

కడప, డిసెంబర్ 21: కడప జిల్లాలో విస్తారంగా ఉన్న ఖనిజ సంపద ద్వారా ఖజానాకు భారీ ఎత్తున ఆదాయాన్ని రాబట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17)లో కనీసం 1,000 కోట్ల రూపాయలను అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకుగల అవకాశాలపై దృష్టిసారించాల్సిందిగా ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది. గనులు, భూగర్భ శాఖకు సంబంధించి కడప, ఎర్రగుంట్లలో భారీ, చిన్నతరహా పరిశ్రమల పర్యవేక్షణకు ప్రత్యేక కార్యాలయాలు ఉన్నాయి. ఇవిగాక ఎపిఎండిసి ఆధ్వర్యాన మంగంపేటలో బెరైటీస్ గనుల వెలికితీతకు ప్రత్యేక విభాగం పనిచేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం (2015-16)లో ఇప్పటిదాకా మైనింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నేతృత్వంలో నిర్వహిస్తున్న మంగంపేట బెరైటీస్ ద్వారా సర్కారు ఖజానాకు సుమారు 400 కోట్ల ఆదాయం లభించగా, డ్వామా, డిఆర్‌డిఏల నేతృత్వంతో డ్వాక్రా మహిళాసంఘాల ద్వారా నిర్వహిస్తున్న ఇసుక అమ్మకాల ద్వారా మరో 70 కోట్లకు పైగా రాబడి వచ్చింది. ఇవిగాక భారీ ఖనిజ పరిశ్రమల ద్వారా రూ. 126 కోట్ల 83 లక్షలు, చిన్నతరహా పరిశ్రమల ద్వారా రూ. 24 కోట్ల 40 లక్షల మేర ప్రభుత్వానికి ఆదాయం లభించింది. భారీ, చిన్నతరహా ఖనిజసంపద ద్వారా (బెరైటీస్, ఇసుక మినహా) ప్రస్తుత సంవత్సరం రూ. 151 కోట్ల 23 లక్షల రూపాయల ఆదాయం సమకూరింది. దీంతో జిల్లాలో ఖనిజాల ద్వారా వచ్చే ఆదాయాన్ని మరింత పెంచడానికి ఖనిజ నిక్షేపాల వెలికితీతను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికితోడు వివిధ ఖనిజాలపై రాయల్టీని జనవరి నుంచి 50 శాతం వరకు పెంచుతూ ప్రభుత్వం తాజాగా 100, 105 జిఓలను జారీ చేసింది. జిల్లాలో బెరైటీస్, ముగ్గురాళ్లు, సున్నపురాయి, బాక్సైట్, మాంగనీస్, డోలామైట్, క్వార్ట్జ్, ఐరన్‌ఓర్, లేటరైట్, బిల్డింగ్‌స్టోన్స్ తదితర ఖనిజాలు పెద్దఎత్తున లభ్యమవుతున్నాయి. వీటికి గ్లోబల్ టెండర్లు పిలిచి టెండర్లు తద్వారా 5 నుంచి 10 ఏళ్లపాటు లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. లీజుకు తీసుకునేవారు ప్రభుత్వం నిర్ణయించిన రాయల్టీని ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు కొందరు ‘ఘనులు’ అక్రమంగా ఖనిజాలను తరలిస్తూ ఖజానాకు భారీగా గండికొడుతున్నారు. దీంతో ప్రభుత్వానికి పెద్దఎత్తున నష్టం వాటిల్లితుండటంతో గనులు, భూగర్భశాఖ అధికారులు, సిబ్బందిపై రాష్ట్ర ఉన్నతాధికారులు అజమాయిషీ పెంచి వారికి టార్గెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఐరన్‌ఓర్‌ను కడప, రాజంపేట, కమలాపురం, జమ్మలమడుగు నియోజకవర్గాల నుంచి అక్రమంగా తరలించేవారు. ఈ అక్రమాలకు అధికారులు ఇటీవల చెక్ పెట్టారు. ప్రస్తుతం ఐరన్ ఓర్‌తోపాటు లైమ్‌స్టోన్, డోలామైట్, మాంగనీస్, బాక్సైట్, మ్యాగ్నిటైట్, హెమటైట్‌ల రవాణాతోపాటు తెలుపు, నలుపురాళ్లను అక్రమ రవాణా చేయకుండా పోలీసు, రెవెన్యూ, గనుల శాఖ అధికారులు టీమ్‌గా ఏర్పడి నిఘాను కట్టుదిట్టం చేశారు.
మరోవైపు జిల్లా కలెక్టర్ కూడా సంబంధిత అధికారులతో ఇప్పటికే సమీక్షించి ఆదాయ వనరుల పెంపునకు ఆదేశించారు. మొత్తమీద ఇప్పటివరకు అక్రమార్కుల బొక్కసాలు నింపుతున్న ఖనిజ సంపదను ప్రభుత్వ ఖజనాకు చేరేలా సర్కారు గట్టి చర్యలు చేపట్టింది. దీంతో అక్రమ ఖనిజ రవాణాద్వారా ఇప్పటివరకు కోట్లు గడించిన నేతలు సర్కారు ఎత్తుకు పైఎత్తు వేసేందుకు వ్యూహరచన చేస్తున్నారు.(చిత్రం) మంగంపేటలో బెరైటీస్ ఖనిజం వెలికితీత దృశ్యం