బిజినెస్

అమెరికాలో 22.5 బిలియన్ డాలర్ల పన్నులను చెల్లించిన భారతీయ టెక్నాలజీ సంస్థలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి
న్యూఢిల్లీ, డిసెంబర్ 21: భారతీయ టెక్నాలజీ పరిశ్రమ 2011-15 మధ్య అమెరికాలో 22.5 బిలియన్ డాలర్ల పన్నులను చెల్లించింది. అలాగే 2011-13 మధ్య 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులను కూడా పెట్టింది. అంతేగాక గత ఆర్థిక సంవత్సరం (2014-15)లో 4,11,000 మందికి ఉద్యోగాలనిచ్చాయి. ఈ మేరకు సోమవారం ఓ లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభకు స్పష్టం చేశారు. భారతీయ ఐటి పరిశ్రమ సంఘం నాస్కామ్ ప్రచురించిన ‘అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారతీయ టెక్నాలజీ పరిశ్రమ అందించిన సహకారం’ నివేదిక ఆధారంగా ఈ గణాంకాలను మంత్రి లోక్‌సభకు అందించారు.