మిర్చిమసాలా

పిట్టపోరు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖలో ఇద్దరు నిజాయితీ అధికారులను ప్రభుత్వం నియమించడంతో ఇద్దరి మధ్య పోరు తీవ్రతరం అయిపోయింది. ప్రతి ఫైలు తనకు రావల్సిందే అంటే తనకు రావల్సిందే అని చాంబర్లు, సంతకాలు, బదిలీలు, పదోన్నతులు, మీటింగ్‌లు, సమీక్షలు అన్నింటిలో పోటీలు పడుతూ నేనే సీనియర్ అంటే, ఫైల్ రూటింగ్ నాకే ఉంది అంటూ బాహాబాహీకి దిగడంతో అధికారులు ఇద్దరిలో నిజాయతీకి మారుపేరైన మహిళా అధికారిని బదిలీ చేయించాలని చూశారు. కాని జరిగింది వేరే...అక్కడ ఆమెనే కొనసాగించి ఇంకో సీనియర్ అధికారిని ప్రభుత్వం బదిలీ చేసింది. అంతే కాదు ఆ అధికారి బాధ్యతలను పూర్తి అదనపు చార్జీ కిం ద అప్పగించింది. కాని దిగువస్థాయి సిబ్బందికి మాత్రం కష్టాలు తీరలేదు...ఎందుకంటే ఆ అధికారి ఎవరి మాట వినరు...ఎందుకలా అని అడగరేం..ఆమె నిజాయితీ అధికా రి...ఎవరి అవినీతిని సహించదు..అదీ సమస్య, ఇపుడు ఆమెపైనా వేటు తప్పదా...చూద్దాం
-బి.వి.ప్రసాద్

దేవయ్య ఓటమికి కారణం?
వరంగల్ ఉప ఎన్నికల్లో టిడిపి-బిజెపి ఉమ్మడి అభ్యర్థి దేవయ్య ఎందుకు ఓడిపోయారో ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన చేసిన ప్రకటననే పరోక్షంగా బయటపెట్టింది. తనను గెలిప్తి కేంద్ర మంత్రి పదవి ఇస్తామని ప్రధాన మంత్రి ముందుగా ప్రకటించి ఉంటే గెలిచేవాడినని దేవయ్య చెప్పుకొచ్చారు. గెలిచినా ఓడినా ప్రజల మధ్యన ఉండే వ్యక్తి అని ప్రజలు నమ్మితేనే ఓట్లు వేస్తారు తప్పితే కేంద్ర మంత్రి పదవి కోసమే పోటీ చేసానంటే ఎలా నమ్ముతారన్నది దేవయ్యకు అర్థం అయినట్టు లేదు. వరంగల్ ఎంపిగా కాకుండా కేంద్ర మంత్రి పదవి ఇస్తారన్న ఆశతోనే ఆయన ఎన్నికల బరిలో దిగారన్నది దేవయ్య ప్రకటనను బట్టే తెలుస్తుంది. అయినా డిపాజిట్ కూడా తెచ్చుకోలేని అభ్యర్థికి కేంద్ర మంత్రి పదవి ఎలా ఇస్తారన్నది దేవయ్యకు అర్థం అయినట్టు లేదు. పైగా పిలిస్తే పలికే దయాకర్‌కు ఓటు వేస్తారా? ఎన్నికల తర్వాత అమెరికా చెక్కెసే దేవయ్యకు వేస్తారా? అని టిఆర్‌ఎస్ నినాదాన్ని ప్రజలు విశ్వసించడం వల్లనే ఆయన డిపాజిట్ గల్లంతుకు కారణమై ఉంటుందని డిపాజిట్ గల్లంతైన పార్టీల నేతలు చేసిన పోస్టుమార్టమ్ నివేదికలో విశే్లషించారు. దేవయ్య వరంగల్ బరిలో నిలిచింది ఎంపి పదవి కోసం కాకుండా కేంద్ర మంత్రి పదవి కోసమని వరంగల్ ప్రజలు అర్థం చేసుకోవడం వల్లనే ఓడించి ఉంటారు కాబోలు!
- వెల్జాల చంద్రశేఖర్

ఎవరికెన్ని ఓట్లు?
వరంగల్ ఉప ఎన్నికల్లో మొట్టమొదట అన్ని పార్టీల కన్నా ఎక్కువ హడావుడి చేసింది. సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. అన్ని పార్టీలను కలిపి గద్దర్‌ను ఉమ్మడి అభ్యర్థిగా నిలపాలని ప్రయత్నించారు. చివరకు పది వామపక్షాలు, 74 ప్రజా సంఘాల ఉమ్మడి అభ్యర్థిని నిలిపారు. ఉమ్మడి అభ్యర్థి ఏడవ స్థానంలో నిలిచారు. ఇండిపెండెంట్ అభ్యర్థి కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి. ఇంతోటి ఓట్లలో పది వామపక్షాల్లో ఏ పక్షం ఓట్లు ఎన్ని? 74 ప్రజాసంఘాల్లో ఏ సంఘం ఓట్లు ఎన్ని అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అందరి కన్నా ముందు హడావుడి చేసిన నాయకులే పోలింగ్‌లో అందరి కన్నా వెనుక నిలిచారు.
- మురళి

తారు-మారు..
రాజకీయ పార్టీల నాయకులు తమ అవసరాలను బట్టి మాట్లాడుతుంటారన్న విషయంలో ఎవరికీ సందేహం అవసరం లేదు. అప్పుడు అలా అన్నారు కదా? అని ఏదైనా విషయంలో ప్రశ్నిస్తే, అప్పట్లో అది కరెక్ట్, ఇప్పుడు ఇది కరెక్ట్ అని ఠకీమని సమాధానమిస్తారు. తాజాగా వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక ఫలితాల అనంతరం ఓడిపోయిన పార్టీల నేతలు ఎన్నో సాకులు చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఇవిఎం)లను తారు మారు చేశారని, దీనిపై న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని సెలవిచ్చారు. పోలింగ్ పూర్తయి, ఫలితం వెలువడడానికి ముందు మాత్రం లక్షకు పైగా మెజారిటీతో విజయం సాధించనున్నట్లు ప్రకటించారు. ఫలితం ప్రభావం మాటలను ఎలా తారు- మారు చేసిందో..!
- వి. ఈశ్వర్ రెడ్డి

స్నాప్‌డీల్ అదృష్టం..
మనిషి తన పని తాను చేసుకుంటూ పోవడం ప్రకృతి. ఎప్పు డూ ఎవరినో ఒకరిని ఆడిపోసుకోవడం వికృతి. తీరి కూర్చుని పనికిమాలిన వ్యాఖ్యలు చేయకుండా ఉండటం సంస్కృతి. కానీ దేశంలో సంస్కృతిని పాటించకపోవడం అనేది ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలకు అలవాటైపోయంది. ఆకోవకు చెంది నవాడే అమీర్‌ఖాన్. చక్కగా తన సినిమాల గోలేంటో చూసు కోక, దేశంలో అసహనం పెరిగిపోతున్నదంటూ పనికి మాలిన డైలాగు వదిలి...కోరి నెత్తిని కొరివితో గోక్కున్నాడు. ఇది అతగాడి అభిప్రాయమా లేక వెనక ఎవరున్నారా అన్నది కాదు ఇక్కడ ప్రశ్న. తనతోపాటు దేశంలోని అనేకమందికి మనశ్శాంతి లేకుండా చేశాడు. దీంతో ఇప్పటి వరకు గొప్ప నటుడిగా ప్రశంసలు చేసిన వారే దుమ్మెత్తి పోయడం మొదలెట్టారు. మైనారి టీలకేనా మనోభావాలు.. మెజారిటీలకుండవా? అంటూ మెజా రిటీ వర్గాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయ. ఇంకేం... ఒక్క సారిగా, సెక్యులరిస్టులు, మేధావులు, విద్యావేత్తలు, సెలబ్రిటీల మధ్య కొనసాగిన ‘అభిప్రాయ ప్రకటనా’ యుద్ధంలో మొత్తం సీను వేడెక్కింది. ఇదిలావుండగా ఒక్కసారిగా అమీర్ ఖాన్ ప్రతిష్ఠ గ్రాఫ్ పాతాళపతనం కావడంతో ఆయన అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ‘స్నాప్‌డీల్’ వారి గుండెల్లో రైళ్లు, విమానాలు, రాకెట్లు తిరగడం మొదలైంది. ఈ దెబ్బకు తామెక్కడ శంకరగిరి మాన్యాలు పట్టాలోనని వారు తెగ ఇదైపోయారు. విచిత్రమే మంటే నవంబర్ 23న గూగుల్ ప్లే స్టోర్‌లో 28వ ర్యాంకులో ఉన్న స్నాప్‌డీల్ 28వ తేదీ నాటికి 22వ ర్యాంకుకు పెరగడంతో, వారి ఆనందానికి అవధులు లేవు. మరి దీన్ని ‘‘సుబ్బి చావు, ఎంకిపెళ్లికి దారితీసింద’’ని అందామా?
-జెవిఆర్