మిర్చిమసాలా

మేమే గెలుస్తాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేమే గెలుస్తాం అని బిజెపి అగ్రనేతలు బహిరంగ ప్రకటన చేయడం... ఎన్నికల ఫలితాలు తుస్సుమనడం చూస్తున్న కార్యకర్తలు మా నేతలు మేమే గెలుస్తాం అని చెప్పకపోతే తప్పకుండా గెలుస్తాం అని జోకులేస్తున్నారు. బీహార్ ఎన్నికలకు ముందు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ సహా ఢిల్లీ నుండి దిగివచ్చిన కేంద్ర మంత్రులు అంతా బీహార్ ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడక్కర్లేదని అది బిజెపికి ఎపుడో వశమైపోయిందన్నట్టు మాట్లాడారు. ఫలితాలు వచ్చాక కేంద్ర మంత్రులు మాట మారుస్తూ ఫలితాలు ప్రధాని నరేంద్రమోదీ పనితీరుకు కొలమానం కాదని స్పష్టం చేశారు. నేతలు మాటలు కట్టిపెట్టి క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే అనుకూల ఫలితాలు అని కార్యకర్తలు చెప్పుకుంటున్నారు
-బి.వి.ప్రసాద్

ఆపరేషన్ రోమియో..!
ఈవ్ టీజింగ్ సమస్య రోజు, రోజుకు పెరుగుతున్నదే తప్ప తగ్గడం లేదు. దీనిని అరికట్టడం ఎలా? అని పోలీసులు తలమునకలవుతున్నారు. కాగా హర్యానాలోని గుర్‌గావ్ పోలీసులకు ఒక మంచి ఐడియా వచ్చింది. యువత ఎక్కువగా ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నందున, దాని ద్వారానే ఈవ్ టీజర్లుకు గుణపాఠం చెప్పాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇంకేందుకు ఆలస్యమని ఉన్నతాధికారుల ఆమోదం తీసుకుని కొత్త ఆలోచనను అమల్లోకి తెచ్చారు. ‘ఆపరేషన్ రోమియో’ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించి, అకతాయిల ఫొటోలను ఏకంగా ఆ సైట్‌లోకి ఎక్కించేస్తున్నారు. రౌడీ షీటర్ల ఫొటోలు పోలీసు స్టేషన్లలో పెట్టినట్లు రోమియోల ఫొటోలను ఆ వెబ్‌సైట్‌లో పెడితే ఇంకేముంది పరువు కాస్త ....కలిసినట్లే. ఈ ఆలోచన ఏదో మన పోలీసులూ చేస్తే బాగుంటుంది కదూ!.
- వి. ఈశ్వర్ రెడ్డి

గుడిసేసుకుంటే ఇల్లొస్తది..
తెలంగాణ ప్రభుత్వం రెండు పడకల గదుల నిర్మాణాలు చేపట్టింది. బలహీన వర్గాలతోపాటు ఆర్థిక స్థోమత కలిగిన వారు కూడా దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నియోజవర్గానికి నాలుగు వందలు ఇళ్లు సరిపోవు. అయినా పేదలకే ప్రాధాన్యత ఇస్తున్నాం అంటుంది ప్రభుత్వం. ఈ నేపథ్యలో అయ్యా..మంత్రి గారూ నాకు కూడా ఇల్లు కావాలె..ఎప్పుడిస్తవు అంటూ ఇటీవల నగరంలో పదివేల ఇళ్లకు శంకుస్థాపన చేసిన మంత్రుల్లో ఒకరైన హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డికి ఓ మహిళ అడిగింది. ఇందుకు స్పందించిన మంత్రి నాయిని మాట్లాడుతూ నీకు గుడిసె ఉందా..? గుడిసె ఉంటేనే ఇల్లొస్తది..అన్నారు. గుడిసె లేదనే ఇల్లడుగుతున్నా అంది ఆ మహిళ. లేదు..లేదు.. గుడిసె ఉండాల్సిందే..లేదా..అయితే గవర్నమెంట్ స్థలంలో గుడిసెయ్ ఇల్లొస్తది అన్నారు. ఇటీవల నగరంలోని ఓ కార్యక్రమంలో మంత్రి నాయిని అన్న మాటలివి.
- గౌస్‌పాషా

బెదిరించేంత ధైర్యమా..
కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని విలేఖరుల సమావేశంలో ప్రకటించగానే కాంగ్రెస్ నాయకులు వెంటనే స్పందించి అధికార పక్షంపై తీవ్రంగా విమర్శలు చేశారు. ఈ విషయాన్ని ఐటి మంత్రి కె తారక రామారావు వద్ద మీడియా ప్రశ్నిస్తే, షబ్బీర్ అలీని బెదిరించేంత ధైర్యం టిఆర్‌ఎస్‌లో ఎవరికన్నా ఉందా? అంటూ ఆయన ఎదురు ప్రశ్నించారు. అయినా బెదిరిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలి కానీ విలేఖరుల సమావేశాలు ఏంటని కొందరు ప్రశ్నించారు. ఎవరు బెదిరించారో ఏం జరిగిందో కానీ షబ్బీర్ అలీ ఒక్కసారిగా చానల్స్‌లో వెలిగిపోయారు.
- మురళి

సంపూర్ణ మద్య నిషేధం సాధ్యమేనా
నాయకులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుతుండాలి. లేకపోతే ఇచ్చిన హామీలు అమలు చేయలేక అభాసుపాలవుతుంటారు. విజయవాడ కల్తీమద్యం ఉదంతం విషాదాన్ని మిగిల్చింది. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబాలను ఓదార్చుతూ తమ పార్టీ అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామన్నారు. వాస్తవానికి సంపూర్ణ మద్యపాన నిషేధం ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు కాలంలో అమలు చేసి విఫలమయ్యారు. ఆ తర్వాత దివంగత ముఖ్యమంత్రి ఎన్టీరామారావు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో అమలు చేశారు. కాని సత్ఫలితాలు ఇవ్వలేదు. మద్యనిషేధం వల్ల మాఫియాలు పుట్టుకొచ్చి అనేక మంది ఐశ్వర్యవంతులయ్యారు. తాజాగా జగన్ సంపూర్ణ మద్య నిషేధం అనడంపై సర్వత్రా మిశ్రమ స్పందన లభిస్తోంది.
- శైలేంద్ర