మిర్చిమసాలా

అడుసు తొక్కనేల..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడుసు తొక్కనేల, కాలుకడగనేల అనే సామెత ఊరికే రాలేదు. వైకాపా నుంచి ఎన్నికై టిడిపిలో చేరిన వారికి ఈ సామెత అతికినట్లు సరిపోతుంది. ఇటీవల కాలంలో చంద్రబాబు అభివృద్ధిని చూసి ఆనందపడి 17 మంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరారు. కాని అక్కడికి వెళ్లినప్పటి నుంచి అప్పటికే అక్కడ ఉన్న స్థానిక టిడిపి నేతలతో కీచులాటలు మొదలయ్యాయి. అనేక చోట్ల మినీ మహానాడులు జరిగాయి. ఈ సమావేశాలకు టిడిపిలోకి జంప్ చేసిన వైకాపా ఎమ్మెల్యేలను ఆహ్వానించలేదు. దీంతో ఫిరాయించిన వైకాపా ఎమ్మెల్యేలు ఖంగు తిన్నారంట. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే మూడేళ్లు ఎలా గెంటాలి, వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తారా అనే ఆందోళనలు వైకాపా ఎమ్మెల్యేలను చుట్టుముట్టాయని వారి వర్గీయులు మథనపడుతున్నారు.
-ఎస్.ఎల్.

నారాయణ కోచింగ్ సెంటర్‌లా...
గతంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అంటే ముందునుంచే ఎంతో హడావుడి. మూడు మాసాలకొకసారి జరిగే మంత్రివర్గ సమావేశాలకు మంత్రులు ఎంతో ఉత్సాహంగా తరలివస్తుండేవారు. అలాంటిది ప్రస్తుతం కేవలం ఒకటి, రెండు అంశాలపై కూడా కనీసం వారానికోసారి మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. అదికూడా ఉదయం నుంచి రాత్రి వరకు ఏకబిగిన సాగుతోంది. మధ్యలో నెలకోసారి కలెక్టర్‌ల సమావేశాలు రెండు రోజులపాటు మంత్రులు దిష్టిబొమ్మల్లా కూర్చోవాల్సిందే. ఇక మధ్య మధ్యలో తెల్లవారుజాము కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు లేదా రాత్రి వేళ కావచ్చు. ప్రభుత్వ శాఖల వారీగా సమీక్షలు... ఒక్కో మంత్రి ఐదారు శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఒకే మంత్రి ఐదారుసార్లు హాజరుకావాల్సి వస్తోంది. ఇక ఇవి చాలవన్నట్లు తరచూ విదేశీ కంపెనీల ప్రతినిధులతో భేటీలు... ఆపై ఎంవోయులు దీనికి కూడా సంబంధిత మంత్రులు హాజరుకావాల్సి వస్తున్నా తాము నోరుమెదపి మాట్లాడేది ఏమి ఉండదని మంత్రులే చెబుతుంటారు. వీటన్నింటితో కుటుంబ సభ్యులతో వ్యక్తిగత విహారయాత్రలు ఇతర శుభకార్యాలకు దేశ విదేశాలకు వెళ్లలేకపోతున్నామంటున్నారు. ఇలా సిఎం సమావేశ మందిరాలు, నారాయణ కోచింగ్ సెంటర్‌లా మారుతున్నాయి. తాము విద్యార్థుల్లా ఓర్పు ఓపిగ్గా ఆ క్షణాలు... గంటలు గడపాల్సి వస్తోందని.. పాపం అంతర్గతంగా చెప్పుకుంటూ బాధపడుతున్నారు.
- నిమ్మరాజు చలపతిరావు

అందుకేనా...
ఈ మధ్య మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావుకు జ్వరం వచ్చింది. ఆ జ్వరానికి కారణం చంద్రబాబు మందలించడమేనా అంటూ తెలుగు తమ్ముళ్లు రచ్చ రచ్చ చేయడం అందర్నీ ఆశ్చర్యపరించింది. అంతటితో ఊరుకోలేదు, గంటా ఇచ్చిన ఒక నివేదికను చంద్రబాబు విసిరేశారని (ఇలాంటివి నమ్మక్కర్లేదు), నివేదికలు కాదు, పని చేయండి అంటూ క్లాసు పీకారని జ్వరానికి ఒక కథనాన్ని తయారుచేశారు. అది ఇంటర్వెల్ మాత్రమే, దానికి క్లైమాక్స్‌గా మరో కథనం కూడా తెలుగు తమ్ముళ్లు వినిపిస్తున్నారు. బిఇడి కాలేజీలు, డిఇడి కాలేజీల అనుమతి వ్యవహారంలో గంటా అనుచరుల చేతివాటంపై కూడా సిఎం గుర్రుగా ఉన్నారంట, రామ్‌గోపాల్‌వర్మ లాంటి దర్శకుల స్క్రీన్‌ప్లేతో ఈ కథనం విజయవాడలోనే కాదు, సామాజిక మాధ్యమాల్లో షికార్లు కొడుతోంది, ఇంతకీ గంటాకు జ్వరం ఎపుడొచ్చింది? ఎపుడు తగ్గింది?
- బివి ప్రసాద్

99 సీట్లు!
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 99 సీట్లు మావే అని తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి చెబుతున్నారు. అసలే ఎమ్మెల్యేలు, నాయకులు ఒకరి తరువాత ఒకరు పార్టీ వీడి వెళుతున్నారు. ఉన్న ఒక్క ఎంపి సైతం సైకిల్ వదిలి కారు ఎక్కేశారు. కానీ రేవంత్‌రెడ్డి మాత్రం ఒక్కడినే ఉన్నా చాలు 99 సీట్లు గెలిచి చూపిస్తాను అని చెబుతున్నారు. పోనీ ఈ మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో టిడిపి పరిస్థితి మెరుగు పడిందా? అంటే అలా ఏమీ లేదు. పోటీ చేసిన డిపాజిట్లు కోల్పోయారు. పాలేరులో పోటీకి దూరంగా ఉండి డిపాజిట్ దక్కించుకున్నారు. మరీ 99 లెక్కేమిటీ? అంటే గ్రేటర్ హైదరాబాద్‌లో వంద స్థానాల్లో గెలుస్తాం అని కెటిఆర్ ముందుగానే చెప్పి 99 సీట్లు గెలిచారు కదా? దాన్ని దృష్టిలో పెట్టుకుని రేవంత్‌రెడ్డి 99 అంటూ ప్రచారం మొదలు పెట్టారని టిటిడిపి నాయకుడొకరు సమాధానం చెప్పారు.
- మురళి

కోనసీమంటే...
కోనసీమ స్పెషాలిటీ అంటే అదే. ఊరందరిదీ ఒక దారి అయితే ఉలిపిరి పిట్టదో ఒక దారి అంటారు. ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విభజన వల్ల ఆంధ్రాకు అన్యాయం జరిగిందని జూన్ 2ను నవనిర్మాణ దీక్షను ప్రకటించి విభజన నష్టాలను జనానికి వివరించారు. కాని తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో మాత్రం కొంత మంది స్ధానికులు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించి, తమ సంఘీభావాన్ని చాటారు. అమలాపురంలో కెసిఆర్ జన్మదినోత్సవ వేడుకలను గతంలో నిర్వహించారు. నిజంగా ఇది అభినందించదగిన విషయమే. ప్రాంతాలకు అతీతంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించి ఆహ్వానించడం ద్వారా కోనసీమ ప్రత్యేకతను చాటుకుంది.
- శైలేంద్ర