మిర్చిమసాలా

ప్రాణ హాని ఎవరికి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి తనకు ముప్పుందని ఒకరు.. తెలంగాణ ఉద్యమ నేతకు రక్షణ కల్పించాలంటూ మరొకరు.. కాగా హైకోర్టును ఆశ్రయించడం, ప్రభుత్వానికి విన్నవించే సంఘటనలు విస్మయాన్ని కల్గిస్తున్నాయి. టిఆర్‌ఎస్ ప్రభుత్వం నుంచి తనకు ముప్పు ఉందంటూ కేంద్ర భద్రత కల్పించాలని ప్రతిపక్ష టిడిపి నేత రేవంత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధనకు ముందున్న రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్‌కు రక్షణ కల్పించాలని నిరుద్యోగ జెఎసి డిమాండ్ చేసింది. ఒకరిది భద్రత, మరొకరికి ప్రాణహాని..ఏదైతే నేం, వీరిద్దరిది ఒకే దారి. ప్రొఫెసర్ కోదండరాంపై అధికార టిఆర్‌ఎస్ ముప్పేట దాడికి దిగింది. టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కోదండరాం వ్యాఖ్యలపై టిఆర్‌ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ఒకరిద్దరు మినహా కేబినెట్ మంత్రులంతా కోదండరాంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీంతో ఆయనకు భద్రత కల్పించాలంటూ నిరుద్యోగ జెఎసి ప్రభుత్వాన్ని విన్నవించింది. ప్రభుత్వం నుంచే తనకు ముప్పు ఉందని కేంద్రం భద్రత కల్పించాలని కోర్టుకు వెళ్లిన రేవంత్ రెడ్డికి రక్షణ కల్పించడానికి అడ్డంకులేమిటో? తెలపాలని కేంద్రానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే అసలు ప్రాణ హాని ఎవరికి ఉందనే మీమాంస టిఆర్‌ఎస్, టిడిపి శ్రేణులను వెంటాడుతోంది.
-గౌస్‌పాషా

సెంటిమెంట్‌తో జిల్లా బోనస్సు
కొత్త జిల్లాలపై కలెక్టర్లతో జరిపిన కసరత్తులో కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు వచ్చాయి. ప్రస్తుతం ఉన్న 10 జిల్లాలను కలిపితే రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 23కు చేరుకుంటుంది. అయితే ముఖ్యమంత్రి లక్కీ నంబర్ 6కు చేరుకోవాలంటే జిల్లాల సంఖ్య 24 కావాల్సి ఉంది. ఈ రెండు సంఖ్యలను కలిపితే ముఖ్యమంత్రి లక్కీ నంబర్ 6 అవుతుంది. దీంతో జిల్లాల సంఖ్య 23 కాకుండా 24 జిల్లాలు ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో అదనంగా మరో జిల్లాను చేర్చాల్సిందిగా ముఖ్యమంత్రి సూచించడంతో కరీంనగర్ జిల్లా సిరిసిల్లను జిల్లా చేయాలన్న ప్రతిపాదనను అధికారులు తెరపైకి తీసుకొచ్చినట్టు సమాచారం. సిఎం తనయుడు, మంత్రి కెటిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లను జిల్లా చేయడం వల్ల సిఎంకు లక్కీ నంబర్ కలిసి వచ్చినట్టు అవుతుందని అంటున్నారు.
- వెల్జాల చంద్రశేఖర్

రూ.5కే భోజనం
అసెంబ్లీ ఆవరణలోని సిఎల్‌పి కార్యాలయంలో మధ్యా హ్నం కొంత మంది విలేఖరులు భోజనం చేస్తున్న సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే టి. జీవన్ రెడ్డి వచ్చారు. ఈ సమయంలో 5 రూపాయలకే భోజనం పథకం ప్రస్తావనకు వచ్చిం ది. కానీ మేము 5 రూపాయల భోజనం చేయడం లేదని విలేఖరులు అన్నారు. అందుకు జీవన్‌రెడ్డి స్పందిస్తూ 5 రూపాయలకు భోజనం మంచిదే కానీ మా సిఎల్‌పి నేత జానారెడ్డి ఆ పథకం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టినట్లు చెప్పలేదని చెప్పారు. కాబట్టే మాకు మసాలా వార్త అయ్యిందని ఓ విలేఖరి అనడంతో అందరూ ఒక్కసారిగా నవ్వారు.
- వి. ఈశ్వర్ రెడ్డి

చిన్నబోయిన సచివాలయం
ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, అటు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర సచివాలయానికి రావడం దాదాపు మానివేశారు. పున్నమికో, అమావాస్యకో అన్నట్టు అత్యంత అర్జంటు పనిఉంటే తప్ప రావడం లేదు. దాంతో సచివాలయం బోసిపోతోంది. చంద్రబాబు అమరావతిపై దృష్టిపెట్టి రావడం లేదు. కెసిఆర్ వాస్తు వగైరాల కారణంగా రావడం లేదు. ఇద్దరు చంద్రులు రాకపోవడంతో సచివాలయానికి కాపలాగా ఉండే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది ఊపిరిపీల్చుకుంటున్నారు. ముఖ్యమంత్రులు సచివాలయానికి వస్తే..వచ్చినప్పటి నుండి వారు తిరిగి వెళ్లిపోయేదాకా..ఈ సిబ్బందికి టెన్షనే! సిఎంతో అవసరం ఉన్న వారు సిఎం క్యాంపు ఆఫీసుకు వెళ్లాల్సి వస్తోంది.
- పి.వి. రమణారావు

మారిన డైలాగులు!
తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ తన పేరులోని రెడ్డిని ఎప్పుడో తొలగించారు. కోదండరామ్ అనే చెప్పుకుంటారు. తెలంగాణ ఉద్యమ కాలంలో టిడిపి నాయకులు ప్రత్యేకంగా కోదండరామ్‌రెడ్డి అంటూ రెడ్డి అని వత్తి పలుకుతూ ఆయన్ని విమర్శించే వారు. తెలంగాణ ఉద్యమం జరిగినన్ని రోజులు ఎన్టీఆర్ భవన్‌లో తెలంగాణ నేతలు తమ ప్రసంగాల్లో రెడ్డి అనే చెప్పేవారు. తెలంగాణ ఏర్పడిన రెండేళ్ల తరువాత అదే ఎన్టీఆర్ భవన్‌లో టిటిడిపి నేతలు కోదండరామ్‌ను ఆకాశానికి ఎత్తితే టిఆర్‌ఎస్ మంత్రులు, ఎంపిలు, నాయకులు మాత్రం కోదండరామ్‌రెడ్డి అంటూ విమర్శలు చేస్తున్నారు. రెండేళ్ల టిఆర్‌ఎస్ పాలనపై కోదండరామ్ తీవ్రంగా విమర్శించడంతో టిఆర్‌ఎస్, టిడిపి నేతలు తమ డైలాగులను మార్చేశారు.
- మురళి