మిర్చిమసాలా

డియర్ అంటే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మతి ఇరానీకి కోపం వచ్చింది. మహిళా మంత్రినైన నన్ను డియర్ అంటారా? అని బిహార్ విద్యా శాఖ మంత్రి అశోక్ చహన్‌పై కస్సుమన్నారు. డియర్ (ప్రియమైన) అనే పదం సాధారణంగా వాడుతూనే ఉంటారు. ముఖ్యంగా వినతి పత్రాల్లో తప్పని సరి. గౌరవప్రదంగా రాశానని సదరు విద్యా మంత్రి చెప్పినా, ఆమె వినిపించుకోలేదు. ‘ఆదరణీయ’ అనే పదానే్న వాడుతుంటానని ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు. లోగడ అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు స్పీకర్‌గా ఉన్న ప్రతిభా భారతిని ‘అమ్మా’ అని సంభోధించడంతో అప్పుడు అధికారంలో ఉన్న టిడిపి సభ్యులు తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. గౌరవ స్పీకర్‌ను అమ్మా అంటారా? అని వారు ప్రశ్నించారు. అమ్మా అనడంలో తప్పేమి ఉందో అప్పటి ప్రతిపక్షాల సభ్యులెవ్వరికీ అర్థం కాలేదు. ఏదైనా సంభోదించేప్పుడు జాగ్రత్త సుమా!.
- వి. ఈశ్వర్ రెడ్డి

ఆ..ఈ ‘నాయుడు’ వేరయా!
ఆ ‘నాయుడు’, ఈ ‘నాయుడు’ ఒక్కరే అన్నది జనం వాఖ్య! అది సరికాదు.. ఆ నాయుడు వేరు, ఈ నాయుడు వేరేనంటూ పదేపదే చెప్పుకునే కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్య నాయుడు అవకాశం చిక్కినపుడల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై పదునైన అస్త్రాలు సంధిస్తూ తన వ్యాఖ్యలకు జనంలో స్పందన లభించేలా తనవంతు ప్రయ త్నం చేస్తూనే వున్నారు. విజయవాడ కేంద్రంగా వైకాపా శాసనసభ్యులు ఒకరి వెంట మరొకరుగా చంద్రబాబు సమక్షంలో పచ్చకండువాలు కప్పుకుంటున్న నేపథ్యంలో ‘పార్టీ మారిన మరుక్షణమే తద్వారా వచ్చిన పదవులన్నింటికీ రాజీనామా చేయాలి. లేకపోతే ప్రజాస్వామ్యం మంట కలుస్తుందం’టూ వెంకయ్య పౌరుషంగానే ప్రకటించి విపక్షాలకు బాబుపై విమర్శనాయుధాలను అందించారు. అలాగే గతంలో చంద్రబాబు తన తనయుడు లోకేష్‌కు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టినప్పుడు కూడా వెంకయ్య ఇలానే వ్యాఖ్యానించారు. ‘రాజకీయాల్లో కావాల్సింది వారసత్వం కాదు.. జవసత్వం.. ఇందిరాగాంధీ కుటుంబ వారసత్వ రాజకీయాలను చూశారు.. ప్రజాస్వామ్యాన్ని ఆమె మంట కలిపారు. అందుకే నా వెనుక రాజకీయ వారసత్వం లేదు. జవసత్వంతో పైకి వచ్చాను. అలానే నా కుమార్తె, కుమారులు, కోడళ్లు, అల్లుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచుతూ వచ్చాన’ని వెంకయ్య ఘాటుగానే వ్యాఖ్యానించినప్పుడు కూడా విపక్షాలకు బాబు పై విమర్శనాయుధాలు లభించినట్లయ్యింది. దటీజ్ వెంకయ్య నాయుడన్న మాట. మారి ఆ ‘నాయుడు’, ఈ ‘నాయుడు’ వేరుకదూ! కాదంటారా?!
- నిమ్మరాజు చలపతిరావు

ఏది సంసారం.. ఏది వ్యభిచారం..?
పార్టీ ఫిరాయించిన వెంటనే చట్టసభ సభ్యత్వం రద్దయ్యేలా ఉండాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చేసిన ప్రకటనను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సమర్థించారు. అంతేకాకుండా తక్షణమే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పార్లమెంట్‌లో సవరణ చేయాలని కూడా సూచించారు. అయితే గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. అప్పుడు కాంగ్రెస్ చేస్తే సంసారం..మేము చేస్తే వ్యభిచారమా..? అని టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ఒకానొక సందర్భంలో అన్నారని, నాడు వాళ్లు (కాంగ్రెస్) చేసింది రాజకీయ వ్యభిచారమైతే, ఇప్పుడు (టిఆర్‌ఎస్) చేస్తున్నది హోల్ సేల్ రాజకీయ వ్యభిచారం కాదా? అని చాడ అనడం టిఆర్‌ఎస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. సిపిఐకి చెందిన ఎమ్మెల్యే రవీంద్రకుమార్, టిఆర్‌ఎస్‌లోకి ఎందుకు చేరారని ప్రశ్నించగా, ఏ ప్రలోభాలకు లొంగాడో తెలియదన్నారు. రవీంద్రకుమార్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చాడ వెల్లడించారు. అయితే సిపిఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ను తాను రమ్మనలేదని, ఆయనే టిఆర్‌ఎస్‌లో చేరారని కెసిఆర్ అనడం.. సిపిఐ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది.
- గౌస్ పాషా

జెండా తెచ్చిన తంటా!
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావన దినోత్సవాన్ని పురస్కరించుకుని సంజీవయ్య పార్క్‌లో దేశంలోనే అతి పెద్ద జాతీయ జెండాను ముఖ్యమంత్రి కెసిఆర్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. హుస్సేన్ సాగర్ తీరాన రెపరెప లాడుతున్న జెండాను చూడటానికి జనం పోటెత్తారు. కానీ ప్రతి విజయం వెనుక వ్యధ ఉన్నట్టుగానే అతి పెద్ద జాతీయ జెండా వెనుక కూడా బోల్డెంత ఖర్చు ఉందంటే కాస్త ఆశ్చర్యకరమైందే. అతి పొడువైన ఈ జెండాకు హుస్సేన్‌సాగర్‌పై నుంచి వీచే హోరుగాలి దాటికి ఇప్పటికే మూడు సార్లు చిరిగిపోయింది. రాత్రికి రాత్రే కొత్త జెండాను ఏర్పాటు చేయడానికి లక్షన్నర చొప్పున ఇప్పటికే నాలుగున్నర లక్షలు ఖర్చు చేస్తే తప్ప జెండా రెపరెపలాడని పరిస్థితి ఏర్పడింది. పోనీ బోల్డెంత ఖర్చు అవుతుందని చిరిగిపోయిన జెండా స్థానంలో కొత్త జెండా ఏర్పాటు చేయకపోతే మున్నాళ్ల ముచ్చటేనా అనే విమర్శ వస్తుందని ప్రభుత్వం జంకుతున్నది.
- వెల్జాల చంద్రశేఖర్

వంద సీట్లు
2019 ఎన్నికల్లో తెలంగాణలో వంద సీట్లు గెలిచేస్తామని టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాజకీయ పార్టీ అన్నాక ఆ మాత్రం ఆత్మవిశ్వాసం ఉండాల్సిందే. వంద సీట్లు గెలుస్తాం, మెరికల్లాంటి యువ నాయకులను తయారు చేస్తాం అంటూ ప్రకటించి రెండు వారాలు గడవక ముందే మహాకూటమి ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చేస్తాం అని ప్రకటించారు. రోజులు గడుస్తుంటే వాళ్లే వాస్తవంలోకి వస్తారు అని టిఆర్‌ఎస్ నాయకులు చమత్కరిస్తున్నారు. పాలేరు, అచ్చం పేటలో ఇప్పటికే మహాకూటమి ప్రయోగాలు విఫలం అయ్యాయి. అచ్చం పేటలో టిఆర్‌ఎస్ మినహా అన్ని పార్టీలు కలిపి మహాకూటమిగా ఏర్పడి పోటీ చేస్తే ఒక్కటంటే ఒక్క స్థానం దక్కలేదు. పాలేరులో అన్ని పార్టీలు కలిపి కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటిస్తే డిపాజిట్ దక్కింది. ఒంటరిగా పోటీ చేసినా, మహాకూటమి ఏర్పాటు చేసినా కాలం కలిసిరాకపోతే అంతే.
- మురళి