మిర్చిమసాలా

టెక్ నరుూమ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరుూమ్ ఒక కరుడు గట్టిన మాఫియా డాన్ మాత్రమే కాదు, ఆయనకున్న మరో కోణం కూడా వెలుగు చూసింది. ఆధునీక టెక్నాలజీతో పౌర సేవలను సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మకమైన డిజిటల్ ఇండియా ప్రవేశపెట్టింది. ఈ స్ఫూర్తిని రాష్ట్రాలు ఎంత మేర వినియోగించుకున్నాయో కానీ విప్లవ పార్టీ నుంచి మాఫియా డాన్‌గా మారిన నరుూమ్ మాత్రం అక్షరాల వినియోగించుకున్నట్టు సిట్ దర్యాప్తులో బయటపడింది. నరుూమ్ తన డెన్‌ను పూర్తిగా కంప్యూటరైజ్ చేసుకోవడం దర్యాప్తు అధికారులను ఆశ్చర్యానికి గురి చేసినట్టు సమాచారం. తన మొబైల్‌కు వచ్చే ఫోన్ కాల్స్ ఏ టవర్ నుంచి వస్తున్నాయో తెలుసుకోవడం దగ్గర్నుంచి, తాను చేసే కాల్ సిగ్నల్స్‌ను ఏ టవర్ క్యాచ్ చేయని సాంకేతిక పరిజ్ఞానాన్ని నరుూమ్ ఉపయోగించినట్టు దర్యాప్తులో బయటపడింది. పోలీస్ నిఘా వర్గాలు సైతం ఇంత వరకు ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించలేదట. అలాగే తనకు వచ్చే ఫోన్ కాల్స్‌ను రికార్డు చేయడంతో పాటు తనను కలుసుకోవడానికి వచ్చిన వారి సిసి టీవీల పుటేజీల లైబ్రరీ కూడా ఆయన డెన్‌లో దొరికినట్టు సమాచారం. మావోయిస్టు పార్టీకి తన పూర్వాశ్రమంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించిన ‘టెక్ మధు’నే నరుూమ్ డెన్‌ను కంప్యూటరైజేషన్ చేసినట్టు దర్యాప్తులో బయటపడింది.
- వెల్జాల చంద్రశేఖర్

అప్రమత్తం!
ఏదైనా జరిగితే చాలు అప్రమత్తం కావడంలో పోలీసులు ముందుంటారు. ఒకప్పుడు పోలీసులు అంటే దొంగలను పట్టుకునేవారు మాత్రమే అన్నట్టు చూసేవారు, కాని దేశంలో రోజురోజుకూ పోలీసుల విధులు పెరిగిపోతున్నాయి, దానికి తగ్గట్టే సవాళ్లు హెచ్చుమీరాయి. తమను తాము కాపాడుకుంటూ ప్రజలను కాపాడటం ప్రధాన విధిగా మారిపోయింది. బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు, వాటర్ కేనర్లు, రబ్బరుబుల్లెట్లు, చివరికి ఆయుధాలు ఉపయోగిస్తుంటారు. ఈ మధ్య మదనపల్లిలో వేలాది మంది ఒకేమారు పోలీసుస్టేషన్ మీదకు రావడంతో ఉలిక్కిపడ్డ పోలీసులు ఆత్మ రక్షణలో పడిపోయారు, కొంత మంది ఇళ్లపైకి ఎక్కి మరీ పోలీసు స్టేషన్ వైపు చూడటంతో ఏం జరగబోతోందోననే ఆందోళనతో పోలీసులు దూసుకు వస్తున్న ప్రజలను నిలదీసి అడిగితే వారు చెప్పిన సమాధానానికి పోలీసులు విస్తుపోయారు..ఇంతకీ ఆ సమాధానం ఏమంటే పోలీసు స్టేషన్లో వ్యభిచారం కేసులో దొరికిపోయిన వారి ముఖాలు చూడటానికట....
-బి.వి.ప్రసాద్

సచివాలయం అచ్చిరావట్లేదా?
ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు, అటు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాష్ట్ర సచివాలయం అచ్చిరాలేదా? రెండేళ్లపాటు భాగ్యనగరం నుండి పాలన కొనసాగించిన చంద్రబాబు, రెండేళ్లకాలంలో సచివాలయానికి వచ్చిన రోజులు వేళ్లపైలెక్కపెట్టవచ్చు. ఇప్పుడు ఆయన అమరావతి వెళ్లిపోయారు. కెసిఆర్ ఎక్కువగా బేగంపేటలోని క్యాంప్ ఆఫీస్ నుండే అధికార కార్యకలాపాలు సాగిస్తున్నారు. అప్పుడప్పుడు ఫాంహౌజ్‌కు వెళుతుంటారు. మూడునెలలకో ఆరునెలలకో ఒక పర్యాయం సచివాలయం వస్తుంటారు. గతంలో ముఖ్యమంత్రులు హైదరాబాద్‌లో ఉంటే రాష్ట్ర సచివాలయానికి తప్పనిసరిగా వచ్చేవాళ్లు. పరిపాలనకు రాష్ట్ర సచివాలయమే గుండెలాంటిది కదా! సిఎం మంత్రులు రెగ్యులర్‌గా వస్తుంటే ఉద్యోగులకు భయం ఉంటుందని అంతాభావిస్తున్నారు.
- పి.వి.రమణారావు
ఎరక్కపోయి..
గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో సిఎం చంద్రబాబు సహా టిడిపి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసిపి ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజాపై స్పీకర్ ఏడాది కాలం పాటు సస్పెన్షన్ విధించారు. తన సస్పెన్షన్ ఎత్తివేయించుకునేందుకు రోజా చేసిన ఏ ఒక్క ప్రయత్నం కూడా ఫలించలేదు. దీంతో ఇటీవల ఆమె అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌కు క్షమాపణలు కోరుతూ లేఖ రాశారు. ఈ క్రమంలో ఆమె అసెంబ్లీకి హాజరవుతారా? లేదా? అనే విషయం చర్చనీయాంశమైంది. ఇటీవల వైసిఎల్పీ భేటీ ముగిసిన అనంతరం లోటస్ పాండ్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘‘అసెంబ్లీకి వెళ్లి తీరుతా.. కోర్టు అనుమతి ఇచ్చింద’’ని ప్రకటించారు. అసెంబ్లీ కార్యాలయం వరకు వెళ్లేందుకు తనకు కోర్టు అనుమతి ఇచ్చిందని చెప్పిన రోజా ప్రకటనకు టిడిపి అధినేతలు గానీ, స్పీకర్ గానీ స్పందించలేదు. స్పీకర్ అనుమతి లేనిదే..అసెంబ్లీలోకి వెళ్లడం సాధ్యం కాదని.. విషయం ఎరుగక చేసిన ఆ ప్రకటన ఇరుకున పెట్టినట్టయిందని అధికార పక్ష నాయకులు వ్యాఖ్యానించడం గమనార్హం.
- సయ్యద్ గౌస్‌పాషా