మిర్చిమసాలా

విజిటింగ్ సీఎంలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అటు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబులకు సచివాలయం అంటే పెద్దగా పడటం లేదు. వీరు రాష్ట్ర సచివాలయానికి వస్తున్నారంటే హంగు, ఆర్భాటం భారీగా ఉంటోంది. గతంలో సిఎంలుగా పనిచేసిన వారు నెలలో కనీసం పదిపదిహేను రోజులైనా సచివాలయానికి వచ్చేవారు. నేటి సిఎం మిత్రద్వయం నెలకు ఒక పర్యాయం రావడం కూడా గగనమైంది. పరిపాలనా అధికారాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు అప్పచెప్పి, ‘జనంలో మనం’ అంటూ కెసిఆర్, బాబుగార్లు ప్రజల మధ్య తిరుగుతున్నారు. ఇదీ మంచిదే కదా!
- పి.వి. రమణారావు

భీమవరం కోళ్లు
ఆంధ్రాలో సంక్రాంతి పండుగ జరిగేంత సంబరంగా మరే పండుగా జరగదంటే ఆశ్చర్యం లేదు, నాయకులకు,వస్తవ్య్రాపారులకు, బంగారం వ్యాపారులకు నిజంగానే అది సంక్రాం తి. సంక్రాంతి సెంటిమెంట్‌తో వచ్చే సినిమాలు అన్నీ సూపర్‌డూపర్ హిట్‌లే, ఆ సెంటిమెంట్‌నే కేటీఆర్ కూడా వాడుకున్నారు. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్‌లో నివసించే ఆంధ్రుల మనసు దోచేలా వ్యాఖ్యలు చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయన ప్రచారం చేస్తూ త్వరలో టిఆర్‌ఎస్ పేరును తెలుగు రాష్ట్ర సమితిగా మార్చడమేగాక, ఆంధ్రా లో కూడా పోటీ చేస్తామని అందుకు వీలుగా తాను భీమవరం నియోజకవర్గాన్ని ఎంచుకున్నానని, అక్కడ తాను తప్పకుండా గెలుస్తానని కూడా తేల్చి చెప్పారు. ఎలా అని ఆశ్చర్యపోతున్నారా...అక్కడ కోడిపందాలకు తమ ప్రభుత్వం అనుమతిస్తుంది అంటే చాలట గెలుపు ఖాయం అని కేటీఆర్ భవిష్యవాణి చెప్పారు.
- బి.వి. ప్రసాద్

జనం నమ్మరు
కొన్ని ప్రకటనలను జనం నమ్మడం మానేశారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు ప్రతి పార్టీ ప్రజా సమస్యలపై కసరత్తు చేస్తున్నాం, అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం అంటూ ప్రకటనలు చేస్తుంటుంది. ఇదంతా నిజమే అనుకుని జనం బోలెడు ఆశలు పెట్టుకుంటారు. తీరా అసెంబ్లీ సమావేశాలు వచ్చే సరికి జనం ఆశలను వమ్ము చేసే విధంగా అధికార, విపక్ష పార్టీలు వ్యవహరిస్తుంటాయి. ఒక్క రోజంటే ఒక్క రోజు అసెంబ్లీని జరగనివ్వరు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం రద్దవుతుంది. మిగతా అంశాలపై అర్ధవంతమైన చర్చ కంటే గతంలో జరిగిన ఉదంతాలపై ఒకరిని ఒకరు వ్యక్తిగతంగా దుమ్మెత్తపోసుకుంటారు. వివాదలు, రగడ మధ్య మర్నాడుకు అసెంబ్లీ వాయిదా పడుతుంది. అసెంబ్లీ ఐదు రోజులు పెట్టినా, 20 రోజులు పెట్టినా ఇదే తంతు. వచ్చే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లోనైనా రాజకీయ పార్టీలు వివేకంగా వ్యవహరించి సమావేశాలు సజావుగా జరిగేందుకు పరస్పరం సహకరించుకుంటే మంచిదే. ఇప్పటికే జనం అసెంబ్లీ సమావేశాల్లో చర్చలు జరుగుతాయంటే నమ్మడం మానివేశారు.
- శైలేంద్ర

ఇద్దరే ఇద్దరు
దేశంలోకెల్లా అతి పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్. తెలంగాణ కన్నా ఐదింతలు పెద్ద రాష్ట్రం. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను ఐటి శాఖ మంత్రి కెటిఆర్ కలిశారు. అనంతరం ఇద్దరు కలిసి మీడియాతో మాట్లాడేందుకు బయటకు వచ్చారు. తెలంగాణలో 50 టీవీలు వస్తాయి, ఇక్కడ అంత కన్నా ఎక్కువ వస్తారేమో అని ఆలోచిస్తూ బయటకు వచ్చిన కెటిఆర్‌కు ఇద్దరే ఇద్దరు జర్నలిస్టులు కనిపించారు. ఇదేంటని కెటిఆర్ ఆశ్చర్యపోతే ఇక్కడ అంతే అని అఖిలేష్ యాదవ్ చెప్పుకొచ్చారు. ఇద్దరు నాయకులు ఇద్దరు జర్నలిస్టులతో చెప్పాల్సింది చెప్పి వెళ్లిపోయారు. ఆ సంఘటన మాత్రం కెటిఆర్‌ను ఇంకా మరిచిపోలేకపోతున్నారు. డజన్ల కొద్ది కెమెరాలు కనిపించగానే ఆ సంగతి చెబుతున్నారు.
- మురళి

దొంగ నిజాయితీ..!
మాజీ ముఖ్యమంత్రి, దివంగత నందమూరి తారక రామారావు నటించిన నేరం నాది కాదు ఆకలిది అనే సినిమా ఒకప్పుడు బాగా హిట్టయ్యింది. తాజాగా చెన్నైలోని పుదక్కొట్టయ్ పెరియార్ నగర్‌కు చెందిన రాజమాణిక్యం నివాసంలో ఓ దొంగ 5 లక్షల రూపాయల దొంగతనం చేశాడు. కొంత కాలం తర్వాత సదరు దొంగ రాజమాణిక్యం నివాసానికి వచ్చి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లి వైద్య ఖర్చుల నిమిత్తం దొంగతనం చేశానని, దురదృష్టవశాత్తు తల్లి మరణించినందున 4.5 లక్షల డబ్బు ముట్టజెబుతున్నానని, 50 వేలు ఖర్చు చేసినందున తన బైక్‌ను ఇస్తున్నట్లు చెప్పి, అక్కడి నుంచి పరారైయ్యేందుకు ప్రయత్నించగా, చుట్టుపక్కల వాళ్ళు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిజాయితీగా రాజమాణిక్యం నివాసానికి వచ్చినా, చేసింది దొంగతనమే కదా!. తీరా పోలీసులు విచారణ జరపగా, సదరు దొంగ పాలిటెక్నిక్ విద్యార్థి అని తేలింది.
- వి. ఈశ్వర్ రెడ్డి