మిర్చిమసాలా

ఎనె్నన్నో జన్మల బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పోటీ పడి విదేశీ పర్యటనలు చేస్తున్నారు. రష్యాలోని పలు రాష్ట్రాల్లో పర్యటించిన చంద్రబాబు ఆ రాష్ట్రాల నుంచి నవ్యాంధ్ర రాజధానికి నేరుగా విమాన సర్వీసులు నడుస్తాయని ప్రకటించారు. ఏ దేశంలో విమానయాన రంగం అయినా వ్యాపారమే. ప్రయాణికులు ఉంటారు లాభసాటిగా ఉంటుంది అంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా విమానాలు నడిపిస్తారు. అయితే బాబు పర్యటించిన అక్కడి రాష్ట్రాల్లో భారతీయులు ఎంత మంది. భారతీయుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ఎంత మంది, వారిలో రెగ్యులర్‌గా అమరావతికి వచ్చి వెళ్లే వారు ఎంత మంది అని అప్పుడే లెక్కలు వేస్తున్నారు. ఏదో మాట వరుసకు బాబు ఏ రాష్ట్రానికి వెళ్లినా ఆ రాష్ట్రంతో అనుబంధం గురించి మాట్లాడితే దీన్ని అంత సీరియస్‌గా తీసుకుని లెక్కలు వేయడం ఏమిటని టిడిపి నాయకులు ప్రశ్నిస్తున్నారు.
- మురళి

ఆధార్ ఉంటేనే ‘మందు’!
మద్యం తాగడానికి వెళ్తున్నారా? అయితే జేబులో డబ్బులు లేకపోయినా ఫర్వాలేదు కానీ ఆధార్ కార్డు లేకపోతే మాత్రం ఎవరు ఏమీ చేయలేరు. డబ్బులు లేకపోతే షాపు వాడు ఉద్దెర ఇవ్వవచ్చు, తెలిసిన వాడు అప్పు ఇవ్వవచ్చు కానీ ఆధార్ కార్డు లేకపోతే మాత్రం ఆ బ్రహ్మదేవుడు కూడా ఏమి చేయలేడు తస్మాత్ జాగ్రత్త!
బార్లు, వైన్స్ షాపుల్లో మద్యాన్ని 21 ఏళ్ళలోపు వయసు ఉన్న వారికి విక్రయించరాదని ప్రభుత్వం ఆదేశించటంతో ‘మందు బాబు’లు ఇక మీదట ఆధార్ కార్డు, ఎస్‌ఎస్‌సి సర్ట్ఫికెట్, ఓటరు గుర్తింపు కార్డు వీటిలో ఏదో ఒకటి తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. చదువుకున్న వారికైతే వయసు నిర్ధారణకు ఎస్‌ఎస్‌సి సర్ట్ఫికెట్ ఉంటుంది. మరి చదువుకోని నిరక్ష్యరాసులు మద్యం తాగాలంటే ఎలా? సందేహం ఎక్సైజు శాఖకు వచ్చింది. గ్యాస్ సబ్సిడీ వంటి సంక్షేమ పథకాల లబ్ధిపొందడానికి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు ఉంటుంది కావున అది చూపిస్తే సరిపోతుందని తేల్చింది. ఆధార్ కార్డులు తప్పనిసరిగా కలిగి ఉండాలని ప్రభుత్వం ఎన్నిమార్లు సూచించిన పెడచెవిన పెట్టిన వారు ఇక నుంచి మద్యం కోసమైనా ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాల్సిందే!
- వెల్జాల చంద్రశేఖర్

‘త్రీ ఇన్ వన్’ పుణ్యస్నానం!
సాధారణంగా మార్కెట్లో వ్యాపారుల నుంచి ఒకటి కొంటే మరొకటి ఫ్రీ.. అనే ఆఫర్లు వినవస్తుంటాయి. అది వ్యాపార లక్షణం. దేశంలో ఎంతో పవిత్రంగా ఏడాదికో పుణ్యనదిలో జరిగే పుష్కరాలు ఈదఫా కృష్ణానదికి జరుగబోతున్నాయి. కృష్ణా పుష్కరాలు ఎప్పుడు వస్తాయా అని గత 12ఏళ్లుగా కోట్లాది మంది ప్రజానీకం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం కుడికాలువ నుంచి కృష్ణా నదిలోకి గోదావరి జలాలను తరలించే కార్యక్రమానికి శాస్త్రోక్తంగా పూజాదికాలతో శ్రీకారం చుట్టారు. సాగర్ నుంచి నీటి విడుదల లేక ఇప్పటికే ప్రకాశం బ్యారేజీ పరిసరాల్లో కృష్ణాజలాలు అడుగంటాయి. ఉన్న ఆ కొద్దిపాటి నీరు కూడా గోదావరి పరీవాహక ప్రదేశాల వాగులు, వంకల నుంచి వచ్చి చేరినదే. పట్టిసీమ ద్వారా వచ్చే నీటితో జలాలమయమైతే కృష్ణా పుష్కరాల్లో పుణ్యస్నానాలు ఎలా చేస్తామంటూ పండితులు తీవ్ర అభ్యంతరాలు చెబుతున్నారు. ఇదేమని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును ప్రశ్నిస్తే ఆయనేమి చెబుతున్నారంటే.. ‘్భక్తులకు ఇదొక అద్భుత అవకాశం. ‘త్రీ ఇన్ వన్’లా కృష్ణానదిలో, గోదావరి నీటిలో, పైగా ఇబ్రహీంపట్నం సమీపంలోని ఫెర్రిలో రెండు నదుల నీరు కలిసే ‘పవిత్ర సంగమం’లో స్నానం చేసినట్లు అవుతుంద’న్నారు. భక్తులకు ఇది అరుదైన అవకాశమే కదా మరి!
- నిమ్మరాజు చలపతిరావు

కృష్ణలో గోదావరి స్నానం
కృష్ణలో గోదావరి స్నానం తప్పదా? ఈసారి కూడా శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల జలాశయాలు అడుగంటాయ. కర్నాటకలో ప్రాజెక్టులు నిండితే కాని దిగువున ఉన్న ప్రాజెక్టుల్లోకి నీళ్లు రావు. ఇదంతా చూస్తుంటే ఆంధ్ర, తెలంగాణలో కృష్ణ పుష్కరాల్లో నది ఒడ్డున బోరు నీళ్లతో స్నానం చేసి పుష్కర స్నానం చేశామనే తృప్తితో సంతోషపడక తప్పదు. ఇక ప్రకాశం బ్యారేజీ ఎగువున పోలవరం కుడికాల్వ ద్వారా గోదావరి జలాలను తరలిస్తున్నారు. దీంతో విజయవాడలో స్నానమంటే కృష్ణా, గోదావరి నదీ జలాల పుష్కర స్నానం చేసే తృప్తి మిగులుతుంది. సకాలంలో వర్షాలుపడక పోవడం, ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులను ఎడాపెడా కట్టడం వల్ల కష్ణా నది పుష్కరాల్లో కృష్ణ పుష్కర సంపూర్ణ స్నాన భాగ్యం లభించడం కష్టమే.
- శైలేంద్ర

కథలు చెప్పడం..
హిట్ అవుతుందనే సినిమా తీస్తాం...్ఫ్లప్ అవుతుందని ఈ ప్రపంచంలో ఏ డైరెక్టరూ సినిమాలు తీయడు అనేది రామ్‌గోపాల్ వర్మ బ్రాడెండ్ స్టేట్‌మెంట్...అంతే కదా..అంతా తెలిస్తే అలా ఎందుకు చేస్తాం అని ఎవరైనా అనడం సబబే, కాని అంతా తెలిసి కూడా ఎవరైనా ఏదైనా చేస్తే దానర్థం వారికే కాదు, ఎవరికీ అంతుచిక్కదు...ఈ మధ్య చంద్రబాబు బృందం రష్యా పర్యటనకు వెళ్లింది. రష్యాలో రెండు మూడు ప్రావిన్స్‌లను సందర్శించింది. ఈ సందర్భంగా చంద్రబాబు బృందం చూపించిన సినిమాకు అక్కడి ఒక గవర్నర్ బిత్తెరపోయారు...చంద్రబాబు బృందాన్ని ప్రసంశల్లో ముంచెత్తారు. ‘బాబు గారూ మీరు ఎలా చేస్తున్నారో మాకూ నేర్పించండి...మేమూ నేర్చుకుంటాం...’ అనగానే ఇంకేముంది...ఇరు ప్రాంతాల ప్రతినిధులతో ఒక కమిటీని వేసుకుందాం...అంటూ బాబు గారు హామీ ఇచ్చారు. కథలు చెప్పడం మనకెందుకు రాదు....అని ఒక రాష్ట్ర గవర్నర్ అడిగితే మీకు పనిచేయడం వచ్చు కనుక ...అని ఆయన సహాయకుడు చెప్పిన జోకు బాగా నవ్వించింది.
-బి.వి.ప్రసాద్