మిర్చిమసాలా

రేణుక సత్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వక పోతే ఆంధ్రప్రదేశ్ అంటే ఏమిటో ఆంధ్రుల సత్తా ఏమిటో కేంద్రానికి చూపిస్తామని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి కేంద్రాన్ని హెచ్చరించారు. రాజ్యసభ చర్చలో సైతం హెచ్చరికకు ఏ మాత్రం తగ్గకుండా ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని పట్టుపట్టారు. మిగిలిన నాయకులందరి కన్నా గట్టిగా మాట్లాడారు. ప్రైవేటు బిల్లు పెట్టిన కాంగ్రెస్ ఎంపి కెవిపి రామచంద్రరావు, ఇతర కాంగ్రెస్ నాయకుల కన్నా రేణుకా చౌదిరినే ఆంధ్రకు ప్రత్యేక హోదాపై గట్టిగా మాట్లాడారు. అయితే చిత్రంగా సభలో ప్రైవేటు బిల్లుపై సాగిన చర్చలో అంత గట్టిగా మాట్లాడిన రేణుకా చౌదరి తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు. ఎన్టీఆర్ హయాంలో టిడిపిలో, ఆ తర్వాత బయటకు వెళ్లి బాబు నాయకత్వంలో మళ్లీ టిడిపిలో చేరినా ఆమె స్వరంలో మార్పు లేదు. కాంగ్రెస్ నేతగా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహి స్తూ ఆంధ్రకు హోదా కోసం మాట్లాడిందీ అదే స్వరం.
- మురళి

లగడపాటి కహాఁ హై?
రాష్ట్ర రాజధాని కేంద్రం విజయవాడ నగరంలో కృష్ణా పుష్కరాల సందడి ఎలా ఉన్నప్పటికీ.. పలు వర్గాల్లో ఎక్కడ నలుగురు కలిసినా లగడపాటి కహాఁ హై?.. అంటూ ఒకరినొకరు ప్రశ్నించుకోవటం కన్పిస్తోంది. దీనికి కారణాలు లేకపోలేదు. ‘ఈ రాష్ట్రం విడిపోదు.. ఒకవేళ విడిపోతే నేను ఏకంగా రాజకీయ సన్యాసం చేస్తాను’.. అని ప్రకటించిన ఆయన అన్నంత పనీ చేశారు. రెండున్నరేళ్లుగా అజ్ఞాతవాసంలో గడుపుతున్నారు. అయితే బంధు మిత్రుల ఇళ్లలో వివాహాది శుభకార్యాలు ఏమైనా వుంటే మాత్రం లగడపాటి గప్‌చుప్‌గా హా జరవుతున్నారు. గతంలో ఆయన నిరంతరం ‘వార్తల్లో వ్యక్తి’గా నిలిచేవారు కదా! నగరం నడిబొడ్డున లగడపాటి దాదాపు రూ.30 లక్షల వెచ్చించి నెలకొల్పిన 12 అడుగుల వైఎస్ రాజశేఖరరెడ్డి కాంశ్య విగ్రహాన్ని తెలుగుదేశం ప్రభుత్వం తొలగించింది. దీనిపై అటు కాంగ్రెస్, ఇటు వైకాపా నేతలు, కార్యకర్తలు పార్టీలు, కులమతాలకు అతీతంగా వైఎస్ అభిమానులంతా నివ్వెరపోయారు. ఆందోళనలు చేశారు. ఇంతజరుగుతున్నా లగడపాటి మాత్రం నోరుమెదపలేదు. మరోవైపు దుర్గగుడి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆయన వ్యతిరేకం. దీన్ని తాము పుష్కరాల్లోపు వినియోగంలోకి తెస్తామని ప్రభుత్వం, టిడిపి శ్రేణులు ప్రగల్భాలు పలికారు. కానీ నేటివరకు పిల్లర్లు కూడా పూర్తిగా లేవలేదు. అన్నింటికీ మించి ముందుగా ఇది అవసరమంటూ ఎంపీగా లగడపాటి హయాంలో నిర్మాణం చేపట్టిన ఇన్నర్ రింగ్ రోడ్డే ప్రస్తుతం నగరానికి దిక్కయ్యింది!
- నిమ్మరాజు చలపతిరావు

భార్యా బాధితులు..!
సాధారణంగా భర్తలు వేధిస్తున్నారంటూ భార్యలు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడం లేక చివరకు విసిగిపోయి విడాకులు తీసుకోవడమో జరుగుతుంది. కానీ భర్తలను వేధించే భార్యల గురించి విన్నారా? వేధించడమంటే మామూలుగా కాదు, భర్తలను బెల్టులతో చితక బాదేస్తున్నారట. ఇది మన దేశంలో కాదు. ఈజిప్ట్‌లోని కుటుంబ న్యాయస్థానం తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ ఆసక్తికర అంశాలను పేర్కొంది. ఈజిప్ట్‌లో భార్యల చేతిలో దెబ్బలు తింటూ, ఆ వేధింపులు భరించలేక విడాకులు తీసుకుంటున్నారట. భర్తలను హింసిం చే మహిళలు ఉన్న దేశంగా ఈజిప్ట్ కీర్తికెక్కింది. అక్కడ ఆడవారికి రక్షణ కల్పించే విషయంలో ఉన్న చట్టాలు మగవారిని శిక్షిస్తే అంత కఠినంగా లేవట. అందుకేనేమో భార్యామణుల చేతుల్లో భర్తలు బలవుతున్నారు.
- వి. ఈశ్వర్ రెడ్డి

దురాశ ఫలితం..
ఆన్‌లైన్ మోసాలు తరచూ వెలుగుచూస్తున్నా యువతీ, యువకులు మాత్రం మేలుకోవడం లేదు. ఇటీవల వరంగల్ జిల్లాలో అచ్చంగా అదే జరిగింది. పాలకుర్తి మండలానికి చెందిన ఓ యువతికి సమాజ సేవ చేయడం ఇష్టం. తాను చేసిన కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. వీటిని గమనించిన టోని మార్క్ అనే వ్యక్తి తనకు తాను అమెరికన్‌గా పరిచయం చేసుకున్నాడు. ఉద్యోగ రీత్యా లండన్‌లో ఉంటానని, తనకు పదేళ్ల కొడుకు విలియమ్ ఉన్నాడని, భార్య అనారోగ్యంతో చనిపోయిందని చెప్పాడు. ఆమెను ప్రశంసలతో ముంచెత్తడమే కాకుండా దేవుడి పేరుతో ఆమె చేస్తున్న కార్యక్రమాలకు తన వంతుగా సహకారం అందిస్తానని నమ్మ బలికాడు. దీంతో సదరు యువతి టోని మాయలో పడిపోయింది. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన టోని ఓ రోజు సమాజ సేవకు తన వంతుగా రూ. 50 లక్షలు పంపిస్తున్నానని చెప్పాడు. నేరుగా బ్యాంక్ అకౌంట్‌కు పంపడం సాంకేతిక పరంగా కుదరదని, ఓ గిఫ్ట్ ప్యాక్‌లో డబ్బులను ప్యాక్ చేసి కొరియర్ ద్వారా పంపిస్తున్నానని చెప్పాడు. అయితే ఇండియాలో కొరియర్ బిల్లుకోసం రూ. 49వేలు చెల్లించాలన్నాడు. దీంతో ఆ యువతి టోని చెప్పిన ఎస్‌బిఐ అకౌంట్‌లో జమ చేసింది. తరువాత ఢిల్లీలో అధికారులు పట్టుకున్నారని, విడిపించుకునేందుకు డబ్బులు కావాలంటూ మరో రూ. 6.25 లక్షలు లాగేశాడు. చివరకు తానే ఓ రోజు హైదరాబాద్ వస్తున్నానని నమ్మించాడు. దీంతో ఆ యువతి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రోజంతా వేచి చూసింది. స్వాగతం పలకడానికి ఏర్పాట్లు కూడా చేసుకుంది. అతడు రాకపోవడంతో మోసపోయానంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాజ సేవ చేయాలనుకున్న ఆ యువతి దురాశ దుఃఖానికి చేటైంది.
- సయ్యద్ గౌస్‌పాషా

ర్యాంకుల గోల
తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ ఎమ్సెట్ రద్దయినందుకు చాలా మంది విద్యార్ధులు సంతోషంగా ఉన్నారు, దానికి కారణం వారికి ఎమ్సెట్-2లో మంచి ర్యాంకులు రాకపోవడమే, ఒకే ఏడాది ఎమ్సెట్ మెడికల్‌లో మూడు అవకాశాలు దక్కడం తక్కువ తెలివి తేటలున్న విద్యార్ధులకు వరంగా పరిణమించగా, తెలివైన విద్యార్థులకు శాపంగా మారింది. తెలివైన విద్యార్ధులు మంచి ర్యాంకులు సాధించిన వారు, మరోమారు ఎమ్సెట్ జరిగితే తమకు గతంలో వచ్చిన ర్యాంకు వస్తుందో రాదోననే ఆందోళనలో ఉండగా, పోలీసు నిఘా పెరగడంతో టాప్ ర్యాంకర్లు బిక్కుబిక్కు మంటున్నారు. పెద్ద పెద్ద ర్యాంకులు వచ్చిన వారు మాత్రం ధైర్యంగా మూడో పరీక్షకు సిద్ధమవుతున్నారు. చూడాలి జాక్‌పాట్ ఎవరికి అనుకూలమో...
-బి. వి. ప్రసాద్