మిర్చిమసాలా

పాపం లక్ష్మణ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్ష్మణ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా నరేంద్ర మోదీతో బిజెపి బహిరంగ సభ. తెలంగాణలో ప్రజాస్వామ్యం మంటగలిసింది, ఈ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదు, కెసిఆర్‌పై భ్రమలు తొలిగిపోయాయి అంటూ నిప్పులు చెరిగారు. అంత వరకు బాగానే ఉంది కానీ లక్ష్మణ్ కెసిఆర్‌పై భ్రమలు తొలిగిపోయాయి అని ప్రసంగిస్తే, అంతకు ముందే గజ్వేల్‌లో జరిగిన సభలో నరేం ద్ర మోదీనేమో తెలంగాణ అభివృద్ధి కోసం కెసిఆర్ ఏ విధంగా తపిస్తున్నారో వివరించారు. తనను ఎప్పుడు కలిసినా తెలంగాణ అభివృద్ధి కోసం, ప్రాజెక్టుల కోసం కెసిఆర్ ఎంత తపన పడుతున్నారో మోదీ వివరించారు. మోదీకేమో కెసిఆర్‌లో బంగారు తెలంగాణ సాకారం చేసే నాయకుడు కనిపిస్తే, లక్ష్మ ణ్ భ్రమలు తొలిగిపోయాయి అని చెప్పడంతో ప్రధాని, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఇద్దరిలో ఎవరి మాటలు పరిగణలోకి తీసుకోవాలో బిజెపి నాయకులకు అర్ధం కాని పరిస్థితి.
- మురళి
ఆ ఒక్కటీ అడక్కు...
మాజీ నక్సలైట్ నరుూమ్ ఎన్‌కౌంటర్ తర్వాత ఆయన నేర సామ్రాజ్యంపై పుంఖాలు పుంఖాలుగా వార్తాకథనాలు వెలు గు చూస్తున్న విషయం తెలిసిందే. నరుూమ్ విద్యార్థి జీవితం నుంచి ఎన్‌కౌంటర్ వరకు జరిగిన ప్రస్తావనంతో పాటు ఆయన కూడబెట్టిన ఆస్తులు, డబ్బుల కుప్పల, వరకు పూసగుచ్చినట్టు పోలీసు అధికారులు మీడియాకు వెల్లడించారు. అయితే నరుూమ్‌ను దాదాపు మూడు దశాబ్దాల నుంచి కం టికి రెప్పలా కాపాడుతూ వచ్చిన పోలీసు ఉన్నతాధికారులు ఎవరు? ఇప్పటికీ అతనితో సంబంధాలు ఉన్న సదరు అధికార్ల పేర్లు ఏమిటి? అనే విషయాలు మాత్రం విచారణాధికారులు బయటికి పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. సెల్ ఫోన్ కాల్స్ సిగ్నల్స్ ఆధారంగా టవర్‌ను గుర్తించి ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులకు నరుూమ్ సెల్‌ఫోన్‌కు వచ్చిన పోలీస్ అధికారుల నంబర్లను మాత్రం గుర్తించలేక పోవడం ఏమిటని అడిగితే ఆ ఒక్కటీ అడక్కు...అంటున్నారు.
- వెల్జాల చంద్రశేఖర్

చుట్టాలొచ్చేస్తున్నారు!
కృష్ణా పుష్కరాల సందర్భంగా ఒక్క విజయవాడ నగరంలోనే దాదాపు మూడు కోట్ల మంది యాత్రికులు పుష్కర స్నానమాచరించగలరని అధికారుల అంచనా. అయితే తీరా నగరంలోని అతి పెద్ద స్టార్ హోటళ్ల నుంచి చిన్న చిన్న లాడ్జీల వరకు అన్నింటా కలిసి మూడు వేలకు మించి గదులు లేవు. ఇందులో 20 శాతం అంటే 600 గదులను ప్రభుత్వం ముందుగానే స్వాధీనం చేసుకుంది. ఈ స్థితిలో సుదూర ప్రాంతంలోని బంధుమిత్రుల నుంచి స్థానికులకు కుటుంబ సమేతంగా ఇది గో వచ్చేస్తున్నాం... అదిగో వచ్చేస్తున్నామంటూ సెల్‌ఫోన్‌ల ద్వారా ముందస్తు సమాచారం వస్తుంటే ప్రతి ఒక్కరూ హడలిపోతున్నారు. పుష్కర స్నానాలకు వచ్చిన వారు వెంటనే వెళతారా అంటే అలా కన్పించడంలేదు. పనిలోపనిగా పరిసరాల్లోకి పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలు చూసి వెళతామని కూడా చెబుతుంటే ఎవరు ఎన్ని రోజులు తమతమ ఇళ్లల్లో మకాం చేయనున్నారో అంతుబట్టటం లేదు. అందుకే కొం దరు తెలివిగా తమ పిల్లలకు సెలవులు ఇచ్చేసారు. ఊరు వెళతున్నామంటూ ముందుగానే ప్రచారం చేసుకుంటున్నారు. నగరంలో ఏ నలుగురు కలిసినా ‘చుట్టాలొస్తున్నారు జాగ్రత్త సు మా’... అంటూ ఒకరినొగరు హెచ్చరించుకుంటున్నారు.
- నిమ్మరాజు చలపతిరావు

డైరీల బూచి..!
నరుూం ఎవరనేది ఈ ప్రపంచానికి ఐపిఎస్ అధికారి వ్యాస్‌ను హత్యచేసిన దగ్గరినుంచి అంతా తెలుసు, ఆయను పెంచి పోషించిందెవరో కూడా ప్రభుత్వం వద్ద రికార్డులున్నా యి, ఆయన ఆగడాలపై ఇంటిలిజెన్స్ నివేదికలు ఉండనే ఉన్నాయి, ఎన్నో ఘటనలు, ఎన్‌కౌంటర్లు జరుగుతున్నా ని మ్మకు నీరెత్తినట్టున్న ప్రభుత్వం నరుూం ఎన్‌కౌంటర్ తర్వాత డైరీల బూచి చూపి లీకులు ఇస్తోంది. అందులో ఐపిఎస్, ఐఎఎస్, ప్రజాప్రతినిధులు, చివరికి మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారని చెబుతోంది. ఈ జాబితాలో ఒక మాజీ మంత్రి ఉన్నారనే లీకుతో నల్గొండ జిల్లాకు చెందిన ఉమా మాధవరెడ్డి తీవ్రంగా స్పందించారు. మీ పేరు రాలేదు కదా ఎందుకు అంతలా స్పందిస్తున్నారన్న మీడియా ప్రశ్నలకు మీరే కదా ఫోన్లు చేసి ఏదొ ఒకటి చెప్పండి అంటున్నారు, దాంతో ఒక మంత్రి అంటే నేనేనేమో అని స్పందించా అని ఆమె చెప్పడంతో నివ్వెరపోవడం మీడియా వంతైంది.
- బి. వి. ప్రసాద్

స్నానాల పోటీ
పుష్కరాలే కాదు, ఎక్కడైనా పాపులారిటీ వస్తుందంటే రాజకీయ నేతలు పోటీపడడం రివాజు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా నది పుష్కరాల సందర్భంగా ఆగస్టు 12వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు మహబూబ్‌నగర్ జిల్లా గొందిమళ్ల వద్ద పుణ్య పుష్కర స్నానాలు చేశారు. గత ఏడాది కూడా వీరు గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించడమే కాకుండా స్నానాలు చేశారు. చంద్రబాబు ఒక అడుగు ముందుకేసి అంత ప్రాధాన్యతలేని గోదావరి నది అంత్యపుష్కరాలకు రాజమహేంద్రవరం కార్యక్రమానికి హాజరయ్యారు. తాజాగా ఏపి అసెంబ్లీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎకాఎకిన హోదాను కోరుకుంటూ ఉత్తరాదిన గంగానదిలో స్నానం చేశారు. ఈ నెల 18వ తేదీన విజయవాడలో పుష్కర స్నానం చేస్తున్నట్లు ప్రకటించారు. పుష్కర స్నానాలకు వామపక్ష పార్టీలు మినహాయించి మిగతా పార్టీల నేతలు క్యూ కడుతున్నారు.
- శైలేంద్ర