మిర్చిమసాలా

నాకేమీ తెలియదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్యాంగ్‌స్టర్ నరుూమ్ కిరాతకాలు ఒకవైపు బయటపడుతుంటే మరోవైపు వైపు నరుూమ్‌కు సంబంధం ఉన్న అధికారులు, రాజకీయ నాయకుల పేర్లు బయటకు వస్తున్నాయి. మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి తొలుత నాకేమీ సంబంధం లేదు అని చెబితే, తరువాత మాజీ డిజిపి దినేశ్‌రెడ్డి తాను డిజిపిగా ఉన్నప్పుడు నరుూమ్‌ను చూడలేదు అన్నారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్సీ రాజ్‌గోపాల్‌రెడ్డి మాత్రం మరో అడుగు ముందుకు వేసి శాసన మండలి ఎన్నికల్లో నరుూమ్ పోటీ నుంచి తనను తప్పుకోవాలని వార్నింగ్ ఇచ్చాడని చెప్పారు. సామాన్య ప్రజలు బెదిరింపులకు భయపడి వౌనంగా ఉంటే అర్థం చేసుకోవచ్చు కానీ ఘనత వహించిన ప్రజాప్రతినిధులు సైతం కిరాయి హంతకులు బెదిరిస్తే పోలీసులకు చెప్పకుండా వౌనంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది.
- మురళి

చంద్ర‘ద్వయం’
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు కలిస్తే..అది పెద్దన్యూస్ అయిపోతుంది కదా! ఈ ఇద్దరూ ఒకరిపై మరొకరు రాజకీయంగా తరచూ దుమ్మెత్తిపోసుకుంటుంటారు. విచిత్రం ఏమిటంటే విశేష కార్యక్రమాలకు ఒకరినొకరు ఆహ్వానించుకుంటారు. ఈ నెల 15 న రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇచ్చిన తేనీటి విందుకు ఇద్దరు సిఎంలు హాజరయ్యారు. గత ఏడాది ఏర్పాటు చేసిన ఇదేతరహా కార్యక్రమానికి చంద్రబాబు డుమ్మా కొట్టారు. ఇప్పుడు ఇద్దరు చంద్రులు రావడం వల్ల గవర్నర్ నరసింహన్ ముఖం లో కూడా ఆనందం కనిపించింది. గవర్నర్‌తో చంద్రద్వయం కలిసి ఉన్న క్షణాలను ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటోగ్రాఫర్లు టపటపా తమ కెమెరాల్లో బంధించారు. రెండు రాష్ట్రాల అభివృద్ధిలో కూడా ఇద్దరు సిఎంలు కలిసి నడిస్తే బాగుంటుందని ఇరు రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారు.
- పి.వి. రమణారావు

ఐదేళ్ల నాటికి నంబర్‌వన్
ఆంధ్రప్రదేశ్ మరో ఐదేళ్లలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా ఉంటుందని, మరో 10 ఏళ్ల తర్వాత దేశంలోనే అగ్రగామిగా మారుతుందని, 2050 నాటికి ప్రపంచంలోనే అగ్రగామి రాష్టమ్రవుతుందనే ఆశాభావాన్ని 2014 నుండి చంద్రబాబునాయుడు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదే పార్టీ నుండి చంద్రబాబు వైఖరి నచ్చని నేతలు మాత్రం ఈ దేశంలో, ప్రపంచంలోనే ఎందుకు భూమి మీద ఏకైక అగ్రగామి రాష్ట్రంగా కూడా ఆంధ్రాను మార్చగల సత్తా తమ నేతకు ఉందని, అది 3వేల సంవత్సరం నాటికి సాధించగలరని సెటైర్లు వేస్తున్నారు....దానికి కారణం లేకపోలేదు, ఆంధ్రా 15వేలు కోట్లు కావాలని అడిగితే కేంద్రం 150 కోట్లు ఇచ్చింది, తాజాగా 19వేల కోట్లు అడిగితే 1900 కోట్లు ఇచ్చింది, ఇలా సాయం చేస్తుంటే 3వేల నాటికైనా లక్ష్యాలు సాధించగలమా అనేది వారి ప్రశ్న
- బి వి ప్రసాద్

భలే చాన్స్ మిస్!
తెలుగుదేశం అధికారంలోకి రావడం, ఆ పార్టీ శాసనసభ్యులకే ప్రభుత్వం అన్నింటా పెద్దపీట వేస్తుండటంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన జలీల్ ఖాన్ అధికార పార్టీలోకి ఫిరాయించారు. అప్పటి నుంచి నగరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ కార్యక్రమంలో పాల్గొంటున్నా తాను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం పరిధి కాకపోయినప్పటికీ జలీల్ ఖాన్ ముందువరుసలో నిలబడుతున్నారు. ఈనేపథ్యంలో ఎంతో పవిత్రంగా జరిగే కృష్ణా పుష్కరాలు వచ్చేశాయి. తొలిరోజు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నా యుడు పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని దుర్గాఘాట్‌లో కుటుంబ సమేతంగా పుణ్యస్నానం ఆచరించి పుష్కర స్నానాలను లాంఛనంగా ప్రారంభించారు. ఆయన దాదాపు రెండు గంటల సేపు అక్కడే గడిపారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం స్వాగతం పలకాల్సిన ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ ఏ కారణం వల్లనో ఈ కార్యక్రమానికి మిస్సయ్యారు. ఆతర్వాత ఎంపి కేశినేని శ్రీనివాస్ (నాని) ఇదే విషయాన్ని అందరి ఎదుట జలీల్ ఖాన్ వద్ద ప్రస్తావిస్తూ.. ‘ఎంతటి మహదావకాశం కోల్పోయావ య్యా!’ అంటూ ఏదో డౌట్ పెట్టారు. ‘అరెరె.. మీరు నా గురు వు గారు. ఇక నుంచి నన్ను ముందుగా అప్రమత్తం చేస్తుండండి’ అని జలీల్ నానిని కోరారు. కొసమెరుపు ఏమంటే.. కేవలం కొద్దిరోజుల క్రితమే పార్టీ ఫిరాయించిన జలీల్ ఖాన్‌కు ఎంపి కేశినేని నాని ఎలా, ఎందులో గురువో కార్యకర్తలకు తెలియాల్సి వుంది!
- నిమ్మరాజు చలపతిరావు

హ్యాక్..కానీ ‘హాక్ ఐ’యాప్..
నగరంలో జరిగే నేరాలను ఇకపై యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు కొత్తగా ‘హాక్ ఐ’ యాప్‌ను ప్రారంభించారు. కానీ బ్యాంక్ అకౌంట్లు, ఎటిఎం పిన్ నెంబర్ల ‘హ్యాక్’ నియంత్రణకు టెక్నాలజీని ప్రవేశపెట్టక పోవడం విచారకరమని వినియోగదారులు విమర్శిస్తున్నారు. ప్రతి రోజూ ఏదో ఒక ప్రాంతంలో బ్యాంక్ అకౌంట్లు, ఎటిఎం పిన్ నెంబర్లద్వారా హ్యాకింగ్ జరుగుతోంది. బ్యాంక్ ఖాతాదారుల అకౌంట్ల నుంచి డబ్బులు విత్ డ్రా అవుతూనే ఉన్నాయి. సైబర్ నేరాల నియంత్రణకు పోలీసులు ఎంత టెక్నాలజీ వినియోగిస్తున్నా..ఎన్ని ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపుతున్నా.. సైబర్ నేరాలు మాత్రం యధేచ్ఛగానే కొనసాగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. అయితే పోలీసులు కొత్తగా ప్రవేశపదెట్టిన ‘హాక్ ఐ’ యాప్, హ్యాక్ కాదనే గ్యారంటీ ఏమిటి? ఈ ‘హాక్ ఐ’ యాప్ ఫిర్యాదుల స్వీకరణకే పరిమితమా? అనే మీమాంస కలుగుతోంది.
-సయ్యద్ గౌస్‌పాషా