మిర్చిమసాలా

నా చలవే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో సెల్‌ఫోన్‌ను పరిచయం చేసింది నేనే...ఐటి ఉద్యోగాలు ఇప్పించింది నేనే...బిల్‌గేట్స్‌ను రప్పించింది నేనే... హైటె క్ సిటీని కట్టింది నేనే...ఐటి ఉద్యోగాలు కల్పించింది నేనే... ఫలానా దేశ అధ్యక్షుడు వాళ్లమ్మాయికి పెళ్లిసంబంధాలు కూ డా చూడమన్నారు...ఇంత ఆత్మవిశ్వాసంగా చెప్పగలిగేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రమే. మొన్నటికి మొన్న ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో ఫైనల్స్‌కు సింథు చేరుకోగానే...ఇది నా చలువే... ఆనాడు నేను క్రీడలకు చేసిన కృషితోనే ఆ అమ్మాయి ఫైనల్స్‌కు చేరింది... అంటూ చంద్రబాబునాయుడు ఉపన్యసించిన కొద్ది గంటలకే భారత్‌కు పతకాన్ని సంపాదించి పెట్టినా, సింధు ఫైనల్స్‌లో తన ప్రతిభను చాటుకోలేకపోయింది. దాంతో ఇది కూడా వారి చలువేనా...అంటూ సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు వెల్లువెత్తాయి
- బి వి ప్రసాద్

అధిక ప్రసంగం!
ఎవరి మధ్యనైనా వాగ్వివాదం జరిగినప్పుడు ‘ఏమి టీ అధిక ప్రసంగం చేస్తున్నావ్..’ అంటూ కోపగించడం సహజం. కానీ బిజెపి జాతీయ నాయకుడు, కేం ద్ర పట్టణాభివృద్ధి, సమాచార శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు తనదైన శైలిలో అధిక ప్రసంగానికి నిర్వచనం చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు బిజెపి చేపట్టిన తిరంగా యాత్రలో భాగంగా ఇటీవల ఒక సభా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సభకు అధ్యక్షత వహించిన వెంకయ్య నాయుడు మాట్లాడుతూ వేదికపై ఉన్న వక్తలు ‘అధిక ప్రసంగం చేయరాదు..’ అని సూచించడంతో సభికులు పెద్దగా నవ్వారు. వక్తలు ఏమైనా అనుకుంటారేమోనని భావించిన వెంకయ్య నాయుడు తిరిగి మాట్లాడుతూ అధిక ప్రసంగం అంటే మరోలా భావించరాదని, తమ ప్రసంగాలను ‘అధికంగా’ కాకుండా క్లుప్తంగా వెల్లడించాలన్నది తన అభిప్రాయమని చెప్పడంతో సభికులు మరోసారి నవ్వాపుకోలేకపోయారు. అయినా ఆ తర్వాత ప్రసంగించిన ఒక వక్త కేంద్ర మంత్రిని పొగడడం ప్రారంభించారు. దీంతో వెంకయ్య నాయుడు కల్పించుకుని ‘అధిక ప్రసంగం అంటే ఇదే..’ అనడంతో సభికులు మరోసారి కడుపుబ్బ నవ్వారు.
- వి. ఈశ్వర్ రెడ్డి

ఆ ఒక్కటి తప్ప
గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్టత్రో ఒప్పందం తరువాత సిఎం కెసిఆర్ ఉద్యమ కాలం నాటి కెసిఆర్‌లా కాంగ్రెస్ నేతలను సన్నాసులు అంటూ విరుచుకు పడ్డారు. గతంలోనే మ హారాష్టత్రో ఒప్పందం జరిగిందని చెబుతున్న కాంగ్రెస్ నాయకులు ఒప్పంద పత్రాలు చూపిస్తే రాజీనామా చేస్తానని ముఖ్యమంత్రి సవాలు విసరడంతో కాంగ్రెస్ నేతల పరిస్థితి కుడితిలో పడ్డట్టు అయింది. నేను సైన్యంలో పని చేశాను భయపడను అం టూ పిసిసి అధ్యక్షుడు చెబుతుంటే ఆ పత్రాల గురించి పిసిసి అధ్యక్షుడికి తెలుసు, మాకు తెలియదు అని ఇతర నేతలు తప్పించుకుంటున్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒప్పంద పత్రాల సంగతి తప్ప అన్నీ మాట్లాడుతున్నారు. దాంతో అధికార పక్షం విపక్షంతో ఆడుకోవడానికి అవకాశం చేజేతులా ఇచ్చినట్టు అయింది. కెసిఆరా మజాకానా అంటున్నారు టిఆర్‌ఎస్ నాయకులు.
- మురళి

భిన్నత్వంలో ఏకత్వం
కృష్ణా పుష్కరాలు రెండు తెలుగురాష్ట్రాల మధ్య ఉన్న అగాధాలను, మనస్పర్ధలను భర్తీ చేశాయి. హైదరాబాద్‌లో స్ధిరపడిన పెద్ద సంఖ్యలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బీచ్‌పల్లి, అలంపూర్, సోమశిలకు వెళ్లి స్నానాలు చేసి తరించారు. అలా గే ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన ప్రజలు విజయవాడ, అమరావతికి వెళ్లి పుష్కర స్నానాలు చేసి పుణ్యాన్ని మూటగట్టుకున్నారు. సినీనటుడు, టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ మహబూబ్‌నగర్ జిల్లా సోమశిలకు వెళ్లి పుష్కర స్నానం చేసి పిండ ప్రదానం చేశారు. విశ్వ యోగా గురుగా పేరు తెచ్చుకున్న రవి శంకర్ విజయవాడలో స్నానమాచరించారు. రాయలసీమ ప్రజలు స్వరాష్ట్రంలోని శ్రీశైలం, తెలంగాణలో బీచ్‌పల్లి, అలంపూర్, కృష్ణ గ్రామానికి వెళ్లి పుష్కర స్నానాలు చేశారు. భారతీయ సంస్కృతిలో భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదే.
- శైలేంద్ర

వివిఐపీలకు దర్శనమెలా ‘బాబూ’..!
1980లో జరిగిన కృష్ణా పుష్కరాల సమయంలో నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి అమరావతిలో అమరేశ్వరస్వామిని దర్శించుకున్న మరుక్షణంలో కారణాలేమైనా పదవీచ్యుతులైన చేదు అనుభవం పాలకుల్ని ఇంకా వెంటాడుతూనే వుంది. అప్పటి నుంచి ప్రతి ముఖ్యమంత్రీ, పలువురు మంత్రులూ వేర్వేరు కార్యక్రమాల్లో అమరావతిలో పర్యటించినప్పటికీ అమరేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టకపోవటం స్థానికులను ఎప్పటికప్పుడు నిరాశపరుస్తూనే ఉంది. ఇక రాష్ట్ర విభజన అనంతరం ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవ్యాంధ్ర రాష్ట్ర రాజధానికి అమరావతి పేరుపెట్టి దేశ, విదేశాల్లో విస్తృతం ప్రచా రం చేస్తున్నారు. ఇంత చేస్తున్నా ఆయన కనీసం పుష్కరాల సమయంలోనైనా అమరేశ్వరస్వామిని దర్శించుకుని తమ ‘ఇలవేల్పు’ పై కొసాగుతున్న అపవాదును తొలగిస్తారని స్థానికులు ఎంతగానో ఆశించారు. పుష్కరాల సందర్భంగా చంద్రబాబు విజయవాడలో శ్రీ దుర్గమ్మను, స్వరాజ్య మైదానంలో ఏర్పాటైన టిటిడి నమూనా ఆలయంలో శ్రీవారిని, కర్నూలు జిల్లాలో శ్రీశైలం మల్లఖార్జునుడిని దర్శించుకున్నారు. కానీ అమరావతిలోని అమరేశ్వరస్వామిని ఆయన దర్శించుకోకపోవటం చర్చనీయాంశంగా మారింది.
కొసమెరుపు: అమరావతి పేరును నిత్యం స్మరించే చంద్రబాబు అక్కడ స్వామిని దర్శించుకోకపోతే భవిష్యత్‌లో రాజధానికి వచ్చే దేశ, విదేశీ వివిఐపిలు ఎలా దర్శించుకుంటారనేది వెయ్యిడాలర్ల ప్రశ్న
- నిమ్మరాజు చలపతిరావు