మిర్చిమసాలా

రామ బాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలమూరు, డిండి ప్రాజెక్టులు కొత్తవి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక సార్లు కేంద్రానికి ఫిర్యాదు చేసింది. చివరకు కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ వాదన ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ ముందుగానే ఒక అంచనాకు వచ్చి మీడియా వార్తలపై ఆధారపడి దానికి సమాధానం చెప్పేందుకు సిద్ధమైంది. అయితే ఎవరూ ఊహించని విధంగా తమ వాదనకు మద్దతుగా చివరకు మోదీ ప్రసంగానే్న కెసిఆర్ ఉపయోగించుకోవడంతో అంతా విస్తుపోయారు. సాధారణ ఎన్నికల సమయంలో నిజామాబాద్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వాదనలో చివరకు మోదీ ప్రసంగం రామబాణంలా ఉపయోగపడిందని మంత్రులు అంటున్నారు.
- మురళి

ఏకాభిప్రాయం
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకే అంశంపై మాట్లాడితే పరస్పర విరుద్ధంగా ఉంటాయి. ఆరుతడి పంటల విషయంలో ఇద్దరికీ ఏకాభిప్రాయం కుదిరినట్టుంది. బావులు, బోర్‌బావులు, జలాశయాల కింద ఆరుతడి పంటలే వేయాలంటూ ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు ఎపి ప్రభుత్వం రైతులకు విజ్ఞప్తి చేశాయి. వరివేయవద్దని దానివల్ల నీటి వినియోగం ఎక్కువగా ఉంటుందని, అందువల్ల తక్కువనీరు అవసరమయ్యే జొన్న, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, సోయాబీన్ తదితర పంటలు వేయాలంటూ రెండు రాష్ట్రప్రభుత్వాలు ప్రచారం మొదలు పెట్టాయి. రైతుల విషయంలో రెండు ప్రభుత్వాల వైఖరి ఒకే విధంగా ఉందనడానికి రుణమాఫీ, ప్రాజెక్టుల నిర్మాణం తదితర అంశాలను పేర్కొనవచ్చు. తాజాగా ఆరుతడిపంటలు ఇదే కోవలోకి వస్తాయి.
- పి.వి. రమణారావు

వానర సైన్యం
కేంద్రంలో కొనసాగుతున్న రావణుని పాలనను అంతమొందించాలని ఎఐసిసి నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ తరఫున ఎన్నికైన స్థానిక ప్రజాప్రతినిధులకు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం శిక్షణా తరగతులు నిర్వహించింది. ఎప్పు డూ వివాదస్పద వ్యాఖ్యలు చేసే మణిశంకర్ అయ్యర్ కేంద్రం లో రావణుని పాలన కొనసాగుతున్నదని చేసిన వ్యాఖ్యలపై బిజెపి నాయకులు మండిపడ్డారు. అయితే మణిశంకర్ అయ్య ర్ కాంగ్రెస్ శ్రేణులను వానర సేనతో పోల్చి మంచి పనే చేశారని, వానర సేన ఎంత అల్లరి చేస్తుందో అందరికీ తెలిసిందేనని ఛలోక్తిగా అన్నారు.
- వి. ఈశ్వర్ రెడ్డి

కలిసి చాయ్ తాగండి!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొనడానికి కేంద్ర మంత్రి ఉమా భారతి కొన్ని చిట్కాలు సూచించారు. ఢిల్లీలో జరిగిన అపెక్స్ కమిటీ సమావేశం సందర్భంగా ఎపి సిఎం చంద్రబాబు, తెలంగాణ మంత్రి హరీశ్‌రావు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. దీంతో వీరి సమావేశానికి అధ్యక్షత వహించిన ఉమా భారతి కలుగ జేసుకుంటూ ‘ఎంత పెద్ద సమస్య అయినా కలిసి కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది’ అని సలహా ఇచ్చారు. ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలు మరింత బలపడాలంటే ‘అప్పుడప్పుడు కలిసి కూర్చొని చాయ్ తాగండి’ అని ఆమె సూచించారు. ఇరు రాష్ట్రాలకు మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే మండేలా ఉన్న పరిస్థితులలో కలిసి కూర్చొని చాయ్ కాదు కదా, కలిసి కూర్చొని ‘మందు’ తాగినా సత్ససంబంధాలు నెలకొనేలా లేవన్న సంగతి కేంద్ర మంత్రికి తెలియదు కాబోలు!
- వెల్జాల చంద్రశేఖర్

నెహ్రూ సింహమైతే మరి బాబు?!
సిఎం చంద్రబాబు కంటే ముందు తెలుగుదేశం పార్టీలో చేరి ఓటమి ఎరుగక వరుసగా నాలుగు దఫాలు, ఆపై కాంగ్రెస్ పార్టీలో రెండు దశాబ్దాల కాలంలో నాలుగుసార్లు పోటీచేసి ఒకసారి శాసనసభకు గెలుపొందిన మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) రాజకీయాల్లోనే విలక్షణమైన నేత. ఎవరికీ తలవంచరు, అంతకుమించి భయపడరు! వైకాపా శాసనసభ్యుల నుంచి కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నేతలు ఆనం సోదరుల వరకు వేర్వేరు సమయాల్లో చంద్రబాబు సమక్షంలో పచ్చకొండువాలు కప్పుకున్నారు. ఈసందర్భంగా పోస్టర్లు, ప్లెక్సీలపై ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్ ఫొటోలతో పాటు వారి జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీల ఫొటోలు కూడా దర్శనమిచ్చాయి. ఇక నెహ్రూ, ఆయన తనయుడు అవినాష్, ముఖ్య అనుచరుడు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కడియాల బుచ్చిబాబు అనుయాయులతో సహా ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే చంద్రబాబు, లోకేష్ ఫొటోలు మినహా మరొకరి ఫొటో వీరు ముద్రించిన ప్లెక్సీల్లో కన్పించలేదు. పైగా ‘ది లెజెండ్ బ్యాక్ ‘చరిత్ర పురుషుడు వెనక్కి’, ది లయన్ బ్యాక్ ‘సింహం వెనక్కి’ అనే నినాదాలు ఎటుచూసినా దర్శనమిచ్చాయి. దీనిపై జిల్లా మంత్రులు, ఎంపీలు అవాక్కయినా నెహ్రూ సింహం అయితే మరి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమిటనేది వెయ్యి డాలర్ల ప్రశ్నగా మిగిలింది!
- నిమ్మరాజు చలపతిరావు