మిర్చిమసాలా

నిను వీడని నీడను..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి రెండు దశాబ్దాలుగా అధ్యక్షుడిగా కొనసాగుతున్నప్పటికీ, పదేళ్లపాటు అధికారానికి దూరంగా ఉండిపోయానన్న కసి, ఆవేదనతో ఆయనలో చాలా మర్పు కనిపిస్తోందని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. తాజాగా మూడురోజులపాటు ఎటూ కదలనీయకుండా కంప్యూటర్ల ముందు కూర్చోబెట్టి పార్టీ నేతలకు, ప్రజాప్రతినిధులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. అంతటితో ఆయన ఆగారా..? నాయకులకు వారి జాతకాలతో కూడిన సీల్డ్ కవర్లు అందజేశారు. అం దులో ప్రైవేట్ పంచాయతీలు, అవినీతి, అక్రమ దందాల గురించిన సమాచారం ఉందంటున్నారు. ఎమ్మెల్యేలు ఇళ్లల్లో లేదా వారి కార్యాలయాల్లో లేనప్పుడు అక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని చంద్రబాబు అనుకున్నారేమో కానీ- సిఐడి పోలీసులు మఫ్టీలో ఎంపిక చేసిన కొందరు ఎంపిలు, ఎమ్మెల్యేల ఇళ్లకు, కార్యాలయాలకు వచ్చి తనిఖీలు జరపటం చూస్తుంటే- ‘నిను వీడని నీడను నేనే’.. అనే పాత సినిమా పాట గుర్తుకొస్తూ వారిని బెంబేలెత్తిస్తోంది!
-నిమ్మరాజు చలపతిరావు

లక్కీ నెంబర్ ఎంత..?
ఇంతకూ తెలంగాణ సిఎం కెసిఆర్ లక్కీ నెంబర్ ఎంత? అనే ఆలోచనలో పడిపోయారు విపక్ష నాయకులు. కెసిఆర్ లక్కీ నెంబర్ ఆరు అని ప్రతిపక్ష నాయకులు ఇంత కాలం గట్టిగా నమ్మారు. అదే నమ్మకంతో కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో లక్కీ నెంబర్‌పైనే విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. తెరాస అధినేత లక్కీ నెంబర్ ఆరు కాబట్టి 24 జిల్లాలు ఏర్పాటు చేయనున్నారని తొలుత భావించారు. తీరా జిల్లాల సంఖ్య పెరుగుతుందని తెలియగానే లక్కీ నెంబర్ కోసం 33 జిల్లాలు అని విమర్శించారు. చివరకు తెలంగాణలో మొత్తం 31 జిల్లాలను ఏర్పాటు చేయడంతో కెసిఆర్ లక్కీ నంబర్ ఆరా? నాలుగా? అనే డైలమాలో పడిపోయారు విపక్ష నేతలు. లక్కీ నెంబర్‌కే పరిమితమై విమర్శలు చేసిన విపక్ష నాయకులు జిల్లాల సంఖ్య 31 కావడంతో అనవసరంగా లక్కీ నెంబర్‌ను నమ్ముకున్నామని నాలుక కరుచుకున్నారు.
-మురళి

చేస్తున్నాం.. చేస్తున్నాం..
ప్రభుత్వం ఏ పనిచేస్తున్నా రావాల్సిన ప్రచారానికి మించి ఎక్కువ ప్రచారం వచ్చేలా చూసుకోవడం సహజమే. చెప్పిన సమయానికి ఆ పని కాకపోతే దానిని ఎలా కప్పిపుచ్చాలో కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. స్కూలు ఫీజుల విషయంలో కూడా అదే జరుగుతోంది. భారీగా ఫీజులు వసూలుచేస్తున్న స్కూళ్లపై కొరడా.. ఉక్కుపాదం.. ఆకస్మిక తనిఖీలు.. ఇలా దొరికిన ప్రతిపదాన్ని ఉపయోగించి ప్రభుత్వం పనిచేస్తున్న ఎఫెక్ట్‌ని రెండేళ్ల క్రితం ఇ చ్చింది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో ఫీజులు తగ్గించకపోతే తోలు తీసేస్తాం.. అన్న చందంగా మరో మారు ప్రభుత్వం హూంకరించింది. తీరా స్కూళ్లు ప్రారంభించాక, ఇప్పుడే కదా ప్రారంభించారు.. ఎప్పుడైనా చర్యలు తీసుకుంటాం.. అని పేర్కొంది. సెప్టెంబర్ దాటి అక్టోబర్ వచ్చేసి మార్చి పరీక్షలకు ఫీజులు కట్టమని నోటీసులు కూడా వస్తుంటే.. విషయం కోర్టులో ఉంది కదా..! అని తప్పించుకున్న ప్రభుత్వం తీరా కోర్టు ఆదేశాలు వచ్చి కాపీలు కూడా చేతికి చేరాక.. వాటిని లోతుగా అధ్యయనం చేయాలి కదా అంటోంది.. చూద్దాం.. వచ్చే ఏడాదికైనా ..?!
-బివి ప్రసాద్

వీళ్లు బాగుపడరు..!
పనిలేని దర్జీలు కొత్తగుడ్డలను కత్తిరించుకుంటూ కూర్చున్నారట! అలా ఉంది ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీల సంగతి. దసరా పండగ రోజు అయినా ఒకరి నొకరు పలుకరించుకోకపోయినా, కనీసం తిట్టుకోకుండా ఉండాలి. పండగ రోజున- ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రం ప్రవేశపెట్టిన ‘స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం’ కింద తెలుగు రాష్ట్రాల్లో ఓ ప్రముఖుడు పదివేల కోట్ల రూపాయల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారని, ఆ వివరాలు తనకు తెలిసినట్లు చెప్పారు. వెంటనే వైకాపా నేతలు ఇంతెత్తున లేచి చంద్రబాబు బినామీనే ఇంత పెద్ద మొత్తంలో బ్లాక్‌మనీని ‘వైట్’గా మార్చుకున్నారని అభియోగం మోపారు. జగన్ ఒక అడుగు ముందుకేసి ‘స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం’ కింద పేర్లను బయటపెట్టాలని ప్రధాని మోదీకి లేఖ రాశారు. సంక్షేమం, ఆరోగ్యం, విద్య వంటి వౌలిక అంశాలను గాలికొదిలేసి, పాపులర్ లీడర్లు ఇలా మాటల యుద్ధానికి దిగితే వారు ప్రజల దృష్టిలో చులకన కారా? తెలంగాణలో అలయ్ బలయ్ పేరుతో పండగ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీల నేతలు ఎంచక్కా కలిసి భోజనం చేస్తే, ఆంధ్రలో మాత్రం నేతాశ్రీలు పరస్పరం దూషించుకోవడం విచారకరం. -శైలేంద్ర

మొదటికే మోసం..
ఎపి పోలీసు శాఖ తొలిసారిగా బయోమెట్రిక్ విధానం ద్వారా రిక్రూట్‌మెంట్ చేపడుతోంది. అయినా, అభ్యర్థులు మోసానికి పాల్పడుతూనే ఉన్నారు. కొద్దిరోజుల క్రితం కాకినాడలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరిగింది. ఎలాగైనా ఉద్యోగం పొందాలని ఓ అభ్యర్థి దేహదారుఢ్య పరీక్షకు తన తరఫున సోదరుడిని పంపించి అడ్డంగా దొరికిపోయాడు. బయోమెట్రిక్ విధానంతో అభ్యర్థి చేసిన మోసం బట్టబయలైంది. ఆ అభ్యర్థిపై శాశ్వత అనర్హత వేటు పడింది. సైనికుడిగా చేరాలనుకున్న ఆ అభ్యర్థి పరుగు పం దెం, ఫుల్ అప్స్, జిగ్‌జాగ్, 9 అడుగుల డి చ్ వంటి వాటిలో పాల్గొన్నాడు. రెండో దఫా జరిగిన శారీరక కొలతల్లో అర్హత సాధించలేనని భావించిన తనకు బదులుగా సోదరుడిని పంపాడు. ఛాతీపై వేసిన నెంబర్ చెరగని ఇంక్‌తో వేసినప్పటికీ, బయోమెట్రిక్‌లో వేలిముద్రలు అతడ్ని పట్టించాయి. బయోమెట్రిక్ ఉందనే విషయాన్ని గ్రహించండి.. శాశ్వత అనర్హత వేటు పడకుండా చూసుకోండంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక, ఉద్యోగ నియామకాలన్నీ బయోమెట్రిక్ ద్వా రానే జరుగుతాయి గనుక అతితెలివి చూపితే మొదటికే మోసం తప్పదు. -సయ్యద్ గౌస్‌పాషా