మిర్చిమసాలా

తాతను మించిన మనవడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రబాబు కుమారుడు లోకేశ్‌బాబు తమ కుటుంబ సభ్యుల ఆస్తులను వెల్లడించారు. తాత చంద్రబాబు కన్నా మనవడు దేవాన్‌ష ఆస్తి ఎక్కువ ఉండడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. గతంలో తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా, రెండున్నర ఏళ్ల నుంచి నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఆస్తి అప్పుల మధ్య సమతూకం కనిపించగా, మాటలు ఇంకా రాని మనవడికి అప్పుడే కోట్ల రూపాయల ఆస్తి ఉంది. ఏదో పాలు, కూరగాయలు అమ్మి ఆస్తులు సంపాదించామని లోకేశ్ చెప్పుకొచ్చారు. మార్కెట్‌లో ధర బాగుంటే బెంగళూరు మిర్చి సాగుచేస్తే ఎకరానికి కోటి రూపాయల ఆదాయం వసుందని కెసిఆర్ చెబితే తీవ్రంగా విమర్శించిన వారు పాలు, కూరగాయల్లో కోట్లు ఎలా సంపాదించారబ్బా..! అని కొందరి అనుమానం. -మురళి

సంస్కరణలకు చెల్లు!
మండల వ్యవస్థకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టినప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి పట్వారీ వరకు అంతా వ్యతిరేకించారు. అయినప్పటికీ సాహసోపేతంగా అప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయంతో ప్రజలకు పాలన మరింత దగ్గరైంది. మండల వ్యవస్థ కోసం జరిగిన అధ్యయనంలో తాను కూడా భాగస్వామ్యం అయినట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ జిల్లాల విభజన సందర్భంగా చెప్పిన విషయం తెలిసిందే. పటేల్, పట్వారీ వంటి రాచరిక పాలనకు స్వస్తి పలికి మండల వ్యవస్థ వంటి సంస్కరణలకు శ్రీకారానికి అభ్యుదయ భావాలతో కృషి చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్, ప్రస్తుతం తిరిగి నిజాం కాలం నాటి తహిశీల్దార్, నాయబ్ తహిశీల్దార్, గిర్దవార్ వంటి హోదాలను పునరుద్దరించడం, సంస్కరణలను తోసిరాజనడం ఎంత వరకు సమంజసమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -వెల్జాల చంద్రశేఖర్

జిల్లాలకు పేర్లు సిద్ధం..
పుణ్యక్షేత్రాల పేర్లను కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలకు పెట్టి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల మనసును అలరించారు. ఇప్పట్లో కొత్త జిల్లాల ఏర్పాటు లేదని, రెవెన్యూలోటు ఉందని చెప్పిన ఆంధ్ర సిఎం చంద్రబాబు భవిష్యత్తులో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే పుణ్య క్షేత్రాల పేర్లకు వెతుక్కోవాల్సిన పనిలేదు. తిరుపతి కేంద్రంగా బాలాజీ జిల్లా, ఆదోని కేంద్రంగా మంత్రాలయం జిల్లా, నంద్యాల కేంద్రంగా శ్రీశైలం జిల్లా, నర్సరావుపేట కేంద్రంగా కోటప్పకొండ జిల్లా, బెజవాడ కేంద్రంగా కనకదుర్గ జిల్లా, అనకాపల్లి కేంద్రంగా సింహాద్రి అప్పన్న జిల్లా, హిందూపురం ల కేంద్రంగా లేపాక్షి జిల్లాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న వ్యాఖ్యనాలు వినిపిస్తున్నాయ. ఎపిలో చంద్రబాబు కొత్తజిల్లాలు ఏర్పాటు చేస్తే జిల్లా కేంద్రాలకు పుణ్యక్షేత్రాల పేర్లు పెట్టేందుకు కొదవ లేదు. -శైలేంద్ర

సెల్‌ఫోన్ తీసుకోండి..
ఒకప్పుడు ఓటు వేస్తే చాలు- వంద నోటు మందు బ్యాటిల్ అనే నినాదం జనంలో ఉండేది. రోజులు మారిపోయాయి. అది కాస్తా 500 నోటు , స్కాచ్ బోటల్ వరకూ వెళ్లింది. నేడు దానితోనూ ఓటరు సంతృప్తి చెందడం లేదు, తమిళనాడు లాంటి రాష్ట్రంలో లారీల కొద్దీ చీరలు పంచుతూ నేతలు దొరికిపోయినపుడు, క్రికెట్ బ్యాట్లు పంపిణీ చేస్తూ దొరికిపోయినపుడు కూడా అంతా ముక్కున వేలేసుకున్నారు- చివరికి ఇవీ ఎన్నికల తాయిలాల జాబితాలో చేరిపోయాయా? అని. కానీ, ఇపుడు అంతా ఆధునిక కాలం కదా... ఆ జాబితాలోకి సెల్‌ఫోన్లు చేరిపోయాయి. అన్నట్టు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో శాసనమండలి ఎన్నికల సందడి మొదలైంది. ఇపుడు ఓటు వేసిన వారికే కాదు, ఓటు నమోదు చేయించుకుంటే చాలట... ఓ సెల్‌ఫోన్ బహుమానం... అన్నట్టు ఆ జాబితాలో మీరు ఉన్నరా..?
-బివి ప్రసాద్

వెంకయ్య సలహా..
వచ్చీరాని వయసులో ఉన్నవారికి ఘాటు ప్రేమ ఎంతటి ప్రమాదకరమో.. నిద్రపోయేవారిని సైతం రెచ్చగొట్టే ఆకర్షణీయ నినాదాలు అంతే ప్రమాదకరమని అంటున్నారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. తాను తెలిసీ తెలియని వయసులో హిందీ భాషా వ్యతిరేకోద్యమంలో పాల్గొని పోస్ట్ఫాస్, రైల్వే స్టేషన్‌లకు వెళ్లి హిందీ అక్షరాలపై నల్లతారు పూసి ఆయన ఎంతో సంబరపడ్డారట. రాజకీయాల్లో జాతీయ స్థాయికి ఎదిగిన తరువాత రాజభాష హిందీ ఆవశ్యకతను గుర్తించి నాడు నేనెంత పొరబడ్డాను కదా!.. అంటూ తనలో తాను పశ్చాత్తాపపడ్డారట. ‘ఆరోజు హిందీ భాషా బోర్డులపై కాదు, నా ముఖాన నేను తారు రాసుకున్నానని బాధపడ్డాను. ఎవరైనా మాతృభాషను గౌరవిస్తున్న ఈ దేశంలో ముందుగా హిందీ భాషను ప్రేమిస్తూ మాట్లాడటం అలవర్చుకుంటే పరమపద సోపాన పటంలో వలే నిచ్చెనలు ఎక్కుతూ పైస్థాయికి చేరుకోవచ్చు’ అంటూ వెంకయ్య నేటితరానికి ఓ ఉచిత సలహా పారేశారు!
-నిమ్మరాజు చలపతిరావు