మిర్చిమసాలా

లీక్.. లీక్.. లీక్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశ్నపత్రాల లీకేజీ.. బడ్జెట్ లీకేజీ.. తాజాగా 500, 1000 రూపాయల నోట్ల రద్దుతో మరోమారు లీకేజీ మాటలు స ర్వత్రా వినిపిస్తున్నాయి. పెద్దనోట్ల మార్పిడి, చిల్లర నోట్ల కోసం జనం తల్లడిల్లిపోతుంటే ప్రతిపక్ష నేతలు పెద్దనోట్ల రద్దు వ్యవహారం ముందుగానే లీకైందని ధ్వజమెత్తుతున్నారు. ఎపి సిఎం చంద్రబాబు, పలువురు మంత్రులు పెట్టుబడుల పేరిట విదేశాల్లో చక్కర్లు కొట్టి నోట్లకట్టలను మార్చుకుంటూ వచ్చారని, బాబు తన హెరిటేజ్ సంస్థలో వాటాలు విక్రయించారని విపక్ష నేతలు నిప్పులు చెరుగుతున్నారు. నోట్లరద్దు గురించి ప్రధాని ప్రకటన వెలువడేవరకు తమకు తెలియదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెపుతుంటే వినేవాళ్లు విస్తుపోతున్నారు. నిజానికి ఆరునెలల ముందునుంచే కొత్త నోట్ల ముద్రణ ప్రా రంభమైంది. ఆ ముద్రణాలయాల్లో పనిచేసే అధికారులు, సిబ్బందికి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఉండరా? ఏఒక్కరైనా నోటిమాటగా చెప్పకుండా ఉంటారా? అనేది మిలి యన్ డాలర్ల ప్రశ్న!.
-నిమ్మరాజు చలపతిరావు

క్యూలో క్యాషియర్!
బ్యాంకులకు వెళ్లి చాంతాడంత లైన్‌లో నిల్చుని, నగదు తీసుకోవడానికి తమ వంతు ఎపుడు వస్తుందా? అని ఎదురుచూస్తున్న జనానికి క్యూ కదలడం లేదనే అసహనం ఎక్కువైంది. ఏ బ్యాంకుకు వెళ్లినా జనం తిట్ల దండకాన్ని అందుకుంటున్నారు. ఓ బ్యాంకు కౌంటర్‌లో డబ్బులివ్వాల్సిన పెద్దమనిషి మాత్రం ఎవరికీ కనిపించ లేదు. కాసేపయ్యాక ఓపిక నశించి ఇదేమిటని ప్రశ్నించిన జనానికి దిమ్మదిరిగిపోయే సమాధానం వచ్చింది. ఇంతకీ జనాలను ఆశ్చర్యపరిచే ఆ సమాధానం ఏమంటే- క్యాషియర్ కూడా అతనికి వేరే బ్యాంకులో అకౌంట్ ఉండటంతో నోట్లు తీసుకోవడానికి అక్కడికి వెళ్లాడట ..! అక్కడ క్యూలో నిలబడ్డ క్యాషియర్ తిరిగి వస్తేనే- ఇక్కడ నగదు పంపిణీ..! ఇలాంటి జోకులు పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో జనం తెగపండిస్తున్నారు.
- బివి ప్రసాద్

రంగు పోతే మంచిదే..
ఆర్‌బిఐ కొత్తగా విడుదల చేసిన రెండు వేల రూపాయల నోటుపై జరిగినంత చర్చ బహుశా మరే నోటుపై మునుపెన్నడూ జరగలేదు. ఈ నోటులో చిప్ ఉంటుందని, దాని ఆధారంగా నోట్లను ఎక్కడ దాచినా శాటిలైట్ ద్వారా ఇన్‌కమ్‌టాక్స్ డిపార్టుమెంట్‌కు సమాచారం వెళ్తుందన్న పుకార్లు షికారు చేశాయ. అయితే, ఆ తర్వాత చిప్ లాంటిదేమీ లేదని ఆర్‌బిఐ స్పష్టం చేసింది. హై సెక్యూరిటీ నోటుగా దీనిని రూపొందించినట్టుగా ఆర్‌బిఐ ప్రకటించింది. ఆ ప్రకటన ఎంత మేరకు నిజమో తెలుసుకుందామని కొందరు ఔత్సాహికులు ఈ నోటు రంగును పరిశీలించారు. తడిగుడ్డతో తుడిచినా, నీళ్లలో వేసిన రంగు వెలిసి పోతుందని గుర్తించారు. దీంతో 2 వేల నోట్లు నకిలీవేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు. అయితే- రంగు వెలిస్తే అసలు నోటని, వెలియకపోతేనే నకిలీదని ఆర్‌బిఐ ప్రకటించింది. గుడ్డలు రంగు వెలిస్తే నాసిరకంగా భావించే మనకు ఆర్‌బిఐ విచిత్రంగా- రంగు వెలిస్తేనే ఒరిజనల్ అన్న కొత్త థియరీ చెప్పడం మరీ విడ్డూరం.
-వెల్జాల చంద్రశేఖర్

వస్తే కదా.. వాస్తు భయం!
చాలామందికి వాస్తు భయం ఉంటుంది. మీ ఇంట్లో వాస్తు దోషం ఉంది.. కాబట్టే అనారోగ్యానికి గురవుతున్నారనో, అన్నీ అనర్థాలే జరుగుతున్నాయనో ఎవరైనా అంటే వెంటనే ఓ మంచి వాస్తు పండితుడ్ని పిలిపించి వాస్తును సరి చేసేందుకు యత్నిస్తారు. సచివాలయం ఆవరణలో ప్రస్తుతం ఉన్న భవనాలు వాస్తు ప్రకారం లేనందుకే తరచూ ముఖ్యమంత్రులు మారారన్న ప్రచారం ఉంది. దీంతో తెలంగాణ సిఎం కెసిఆర్ ఇటీవల సచివాలయంలోని భవనాలను నేలమట్టం చేసి, తిరిగి కొత్తగా నిర్మించాలని సంకల్పించారు. అందుకు తెలంగాణ ఉద్యమ వేదిక నాయకులు చెరుకు సుధాకర్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ- అసలు సచివాలయానికే రాని సిఎం కెసిఆర్‌కు వాస్తు భయమేల? అని ప్రశ్నించారు. సిఎం తన క్యాంపు కార్యాలయం నుంచి లేదా ఎర్రవెల్లిలోని ఫాం హౌజ్ నుంచి పాలన చేస్తున్నప్పుడు సచివాలయం వాస్తు దోషాల గురించి చింతించడం ఎందుకని వారు అంటున్నారు.
-వి. ఈశ్వర్ రెడ్డి

తిరగబడ్డ ప్రచారం..
ఏం జరిగినా దాని వల్ల సాధ్యమైనంత ప్రచారం పొందాలని చూడడం చంద్రబాబు వీక్‌నెస్. ఇదే ఆయనకు వ్యతిరేక ప్రచారం కల్పించేందుకు ఉపయోగపడుంది. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు- వాజ్‌పాయి రాజధర్మం అని చెప్పగానే తొలగిస్తారనే ప్రచారం జరిగింది. అప్పట్లో- తన ఖాతాలో క్రెడిట్ వేసుకోవాలని బాబు అందరి కన్నా ముందు మోదీని తొలగించాలని డి మాండ్ చేశారు. ఆయన కోరినట్లు తొలగించలేదు స రికదా.. మోదీ ఇప్పుడు ఏకంగా ప్రధానమంత్రి అ య్యారు. 500, 1000 రూపాయల నోట్ల రద్దు కోసం బాబా రామ్ దేవ్, అన్నా హజారే లాంటి వాళ్లు డిమాండ్ చేయగానే ఆ డిమాండ్‌ను వారి కన్నా ఎక్కువగా బాబు వినిపించారు. పెద్దనోట్లపై ప్రధాని మోదీ ప్రకటన చేయగానే- అది నా ఘనతే అని బాబు ప్రకటించుకున్నారు. ఇప్పుడు అంతకన్నా పెద్దనోటు విడుదల చేయడం, పాతనోట్ల రద్దుతో జనం ఇబ్బందుల పాలవుతున్నారు. బాబు ఇంత హడావుడి చేయగా, మరోవైపు నోట్ల రద్దు పరిణామాలపై చర్చించేందుకు దిల్లీ రావాలని కెసిఆర్‌ను మోదీ పిలవడం విశేషం.
-మురళి