మిర్చిమసాలా

‘నలుపు’ వాన !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించగానే తెలంగాణ సిఎం కెసిఆర్ రాష్ట్రానికి తగ్గే ఆదాయంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై బిజెపి నేత కిషన్‌రెడ్డి స్పందిస్తూ, ‘ఇంతకాలం తెలంగాణ ప్రభుత్వం నల్లధనంతోనే నడిచిందా?’ అని ప్రశ్నించారు. దీనికి కెసిఆర్ ఇచ్చిన సమాధానంతో బిజెపి నాయకులు అవాక్కయ్యారు. ‘తెలంగాణ ప్రభుత్వమే కాదు, మోదీ ప్రభుత్వం కూడా ఇన్నాళ్లూ నల్లధనంతోనే నడిచింది, మా రాష్ట్రం మినహాయింపుఏమీ కాదు, దేశం మొత్తం నల్లధనంతోనే నడిచింది’ అంటూ కెసిఆర్ చెప్పుకొచ్చారు. దేశాన్ని నడిపిందే నల్లధనం అని ముఖ్యమంత్రి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడంతో బిజెపి నేతలకు నోట్లో వెలక్కాయ పడినట్టయ్యింది.
-మురళి

సిక్కోలులో ‘కుల’కలం!
నగరపాలక సంస్థగా ఆవిర్భవించిన శ్రీకాకుళంలో తొలి మేయర్ ఎవరన్న విషయమై ‘కులాల కుంపటి’ రాజుకుంది. తెలుగుతమ్ముళ్లు ‘అజాతశత్రువు’గా పిలుచుకునే మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణకే ‘తొలి మేయర్ చాన్స్’ అన్న ప్రచారానికి బ్రేక్ పడుతోంది. మాజీ మంత్రి, వైకాపా నేత ధర్మాన ప్రసాదరావు వేస్తున్న పాచికలకు విస్మయం చెందడం టిడిపి నేతల వంతయ్యింది. సిక్కోల్ రాజకీయాలు ‘వెలమ’ సామాజిక వర్గానికే పరిమితమా? అంటూ ప్రజాబలం కలిగిన ఓ వైద్యుడి నోట ‘్ధర్మాన’ తన మాటలు పలికించారు. ధర్మాన వ్యూహం ఫలితంగా మిగతా కులాల నేతల్లోనూ ‘మేయర్ కుర్చీ’పై ఆశలు చిగురించాయి. ‘్ధర్మాన’ వ్యూహంపై జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి అనుచరులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారట! విపక్షంలో ‘్ధర్మాన’ లాంటి ‘ప్రియమైన శత్రువు’ ఉండగా అచ్చెన్నకు వేరే మిత్రులెందుకు దండగ? అని టిడిపి కార్యకర్తలు వ్యా ఖ్యానిస్తున్నారు. ధర్మాన, అచ్చెన్న వెలమ కులస్థులే అయినా, మిగిలిన సామాజిక వర్గాల మెప్పు కోసం వ్యూహరచన చేస్తుండడంతో- ‘ఇవేం రాజకీయాలు? ఇవేం కులసమీకరణలు?’ అని సిక్కోలు ప్రజలు విస్తుపోతున్నారు.
-ఉరిటి శ్రీనివాస్

అతివలకూ ‘నోటు కష్టాలు’
‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చింద’న్న చందంగా పెద్దనోట్ల రద్దుతో మహిళలు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. పాల ప్యాకెట్లు, కూరగాయలు, పప్పులు, పండ్లు, పూలు వంటి రోజువారీ నిత్యవసరాల కొనుగోలుకు చిల్లర నోట్లు లేక సామాన్య, మధ్యతరగతి మహిళలు అల్లాడిపోతున్నారు. వంటింట్లో పోపు డబ్బాల్లో ఎప్పటి నుంచో దాచుకున్న చిల్లర నోట్లన్నింటినీ ఇపుడు వారు ఖర్చుచేయాల్సి వస్తోంది. కొందరు మహిళలు తమ పతిదేవుళ్లకు తెలియకుండా బీరువాల్లో దాచుకున్న పెద్దనోట్ల మార్పిడికి భారీ కసరత్తే చేయాల్సి వస్తోంది. ఒకవేళ తమ బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ చేస్తే అంత డబ్బు ఎక్కడదని మగడు ఎక్కడ నిలదీస్తాడోననే భయం వెంటాడుతోంది. మొదట్లో అయతే ఇరుగుపొరుగు వారిని వెంట బెట్టుకుని భర్త ఇంట్లో లేని సమయంలో బ్యాంక్‌లో క్యూలో నిలబడి అతికష్టంపై కొంతమేర పెద్దనోట్లను మార్చుకున్నారు. ప్రస్తుతం తమ ఇళ్లలో పనిచేసే వారి జనధన్ ఖాతాల్లో నోట్లను జమ చేయంచి, వెంటనే విత్ డ్రా చేయించుకుంటున్నారు. మొత్తానికి మోదీ నిర్ణయం అతివలకు సైతం అవస్థలు తెచ్చిపెట్టింది.
- నిమ్మరాజు చలపతిరావు

ఆచి తూచి అంటే..
బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉండే పెద్దలు ఆచి తూచి మాట్లాడాలంటారు. లేకపోతే అభాసుపాలవుతారు. మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన వెంటనే ఎపి సిఎం చంద్రబాబు స్వాగతించారు. పెద్దనోట్లను రద్దు చేయాలని తానెప్పుడో మోదీకి లేఖ రాసినట్లు ఆయన గొప్ప కబుర్లు చెప్పారు. నోట్లరద్దుతో చంద్రబాబు అనేక సార్లు మాటలు మార్చారు. ప్రజలు ఇక్కట్లు పడుతున్నారన్నారు. రెండు వేల రూపాయల నోట్లనూ రద్దు చేయాలన్నారు. నగదును సరిగా పంపిణీ చేయడం లేదంటూ బ్యాంకు ఉద్యోగులపై మండిపడ్డారు. కరెన్సీ కష్టాలపై ప్రతిరోజూ సమీక్షలు చేస్తూ సలహాలు ఇస్తున్నారు. చివరకు ఆయన ఏమి ఏమి మాట్లాడుతున్నారో తెలియడం లేదని అధికారులు అయోమయంలో పడుతున్నారు. బ్యాంకర్లపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై బ్యాంకు ఉద్యోగుల సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. కీలక పదవుల్లో ఉండేవారు ఆచితూచి మాట్లాడకుంటే అవస్థలు తప్పవు మరి.
-శైలేంద్ర

వాష్‌రూమ్‌కు వెళ్లొచ్చేలోగా..
నోట్ల మార్పిడి పెద్ద జోక్‌గా మారిందని ఎఐసిసి అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి మండిపడ్డారు. పెద్దనోట్ల రద్దు, వాటి మార్పిడిపై ఇప్పటి వరకు 105 సార్లు నిబంధనలు మార్చారని ఆయన విలేఖరుల సమావేశంలో గణాంకాలు ఏకరవు పెట్టారు. చివరకు ఇది ఎలా అయ్యిదంటే, ఎవరైనా బాత్రూమ్ (వాష్ రూమ్)కు వెళ్ళి వచ్చే సరికే నిర్ణయం మారిపోతున్నదని, బయటకు రాగానే నోట్ల మార్పిడిపై మళ్లీ రూల్స్ మారాయా? అని బయట ఉన్న వారిని అడిగే పరిస్థితి ఎదురైందని సింఘ్వి చెప్పడంతోనే విలేఖరులు గొల్లుమని నవ్వారు.
-వి.ఈశ్వర్ రెడ్డి