మిర్చిమసాలా

ఇస్తే.. కాదంటానా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘2019 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుస్తుంది. ముఖ్యమంత్రి అయ్యేది నేనే’- అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల ప్రకటించి అందరి దృష్టిలో పడ్డారు. అసెంబ్లీ లాబీల్లో ఇదే విషయాన్ని ఆయన వద్ద మీడియా ప్రస్తావిస్తే, ‘నేనే ముఖ్యమంత్రి అని చెప్పలేదు, వాళ్లు అలా రాశారు, ఎ వరైనా అలా చెబుతారా? అక్కడున్న వాళ్ల అంతా ననే్న ముఖ్యమంత్రిగా ఉండమన్నారు..’ అని వివరించారు. ‘2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పాను, మనం అధికారంలోకి వస్తే మీరే సిఎం అని అక్కడున్న మా నాయకులంతా అన్నారు. నేను సరే అన్నాను..’ అని ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ మెజారిటీ సీట్లు సాధిస్తే నల్లగొండ ప్రాంతం నుంచే ఇప్పటి వరకు ఆ పార్టీలో సిఎం పదవికి ముగ్గురు బలమైన అభ్యర్థులు రేసులో ఉన్నారు.
- మురళి

అటు నుంచి వలసలు!
అన్ని రోజులూ ఒకేలా ఉండవంటారు. నిన్న మొన్నటి వరకు వైకాపా నుంచి ఎమ్మెల్యేలు టిడిపిలోకి చేరేందుకు క్యూ కట్టారు. డిసెంబర్ వచ్చేసరికి విచిత్రంగా కాంగ్రెస్, బిజెపి నేతలు వైకాపా బాట పడుతున్నారు. విజయవాడ మాజీ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్, తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కందుల దుర్గేష్, నర్సరావుపేటకు చెందిన మాజీ మంత్రి కుమారుడు మహేష్ రెడ్డి వైకాపాలో చేరారు. దీంతో వైకాపా శ్రేణుల్లో ఉత్సాహం పెల్లుబుకుతోంది. నర్సరావుపేటలో వైకాపా సభ విజయవంతం కావడంతో ఇన్నాళ్లూ డల్‌గా ఉన్న ‘్ఫ్యన్’ వేగం పుంజుకుంది. ఇదంతా చూసిన టిడిపి నేతలు- ‘జనవరిలో వైకాపా నుంచి మరి కొంత మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాం.. వేచిచూడండి..’- అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ అప్పుడే ఈ రాజకీయ వలసలు ఎందుకో..? - శైలేంద్ర

కుక్కలున్నాయ్..!
కొంతమంది గృహయజమానులు తమ ఇంట్లో శునకాలు లేకపోయనా, దొంగలను భయపెట్టేందుకు ‘కుక్కలున్నాయ్ జాగ్రత్త’ అని ఇంటిగేటుకు బోర్డు పెడుతుంటారు. ఇపుడు ఆదాయపు పన్ను (ఐటి) శాఖ అధి కారులు తమ ఇళ్లపై పడకుండా కొందరు కుక్కలను ఆశ్రయ స్తున్నారు. బెంగళూరులోని యశ్వంత్‌పూర్‌లో ఓ ఇంట్లో నల్లధనం ఉన్నట్లు సమాచారం అందుకున్న ఐటి అధికారులు అక్కడికి చేరుకుని గేటు తోసుకుని లోపలికి వెళ్ళబోతుండగా- ఆ ఇంటి యజమానురాలు విషయం గ్రహించి కుక్కలున్నాయ్.. అంటూ హెచ్చరించింది. అయినా వారు వినిపించుకోకుండా ముందుకు వెళ్ళడంతో- రెండు కుక్కలను ఆమె ఉసిగొల్పింది. దీంతో ఐటి అధికారులు పరుగు లంఘించారు. స్థానిక పోలీసుల సహాయంతో తిరిగి ఆ ఇంట్లోకి వెళ్ళిన ఐటి అధికారులు సోదాలు చేయడంతో 2.89 కోట్ల రూపాయలు లభ్యమయ్యాయి. అందులో 2.25 కోట్ల విలువైన కొత్త 2 వేల రూపాయల నోట్లు ఉన్నాయట! -వి.ఈశ్వర్ రెడ్డి

వి‘నాయక’ పూజ!
హిందూ సంప్రదాయం ప్రకారం ఏ వ్రతం చేసినా, ఏ శుభకార్యం జరిపినా ముందుగా వినాయక పూజ తప్పనిసరి. ఇటీవల ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఏ పూజలైనా, వేడుకలైనా నాయకులు వచ్చేదాకా ఆగాల్సిందే. ముఖ్యనేతలు నిర్ణీత సమయానికి హాజరు కానందున నిర్వాహకులు- వచ్చిన జనం ఇంటిముఖం పట్టకుండా ఇతర అతిథులతో అప్ప టికప్పుడు ప్రసంగాలు చేయించడం పరిపాటిగా మారింది. ఒక్కోసారి ము ఖ్యఅతిథి అసలు వ స్తాడో, రాడో కూడా తెలియని స్థితి. వందన సమర్పణ వేళకు ముఖ్య అతిథులు వచ్చినా హడావుడిగా అపుడు వారితో జ్యోతి ప్రజ్వలన చేయించడం, ప్రార్థనాగీతం పాడించడం షరామామూలైంది. తాజాగా ఎపి సిఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరైన ‘విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ సభ’లో సరిగ్గా ఇదే జరిగింది. ముఖ్యనేత ఆలస్యంగా వస్తే అంతా ఒక్కసారి లేచి నిలబడతారు. ఇదిచూసి, వెనక వరసలో ఉన్న వారు జాతీయ గీతం ఆ లపిస్తున్నారు కాబోలునని భ్రమ పడుతున్నారు!
- నిమ్మరాజు చలపతిరావు

ఒప్పుకున్నాక తప్పదు..
ఎదుటివారిని తప్పు పట్టడం చాలా తేలిక. తప్పు పట్టడమే కాదు.. విమర్శించడం కించిత్ ఇబ్బందికరమే, నేరుగా మన ముఖం మీదకు వచ్చి చేసిన తప్పులను విమర్శిస్తుంటే తట్టుకోవడం ఎవరికైనా కష్టమే. ఇంకొకరి తప్పుల్ని పట్టుకుని ఎవరైనా మనల్ని దులిపేసారనుకోండి... బిత్తరపోవడం మినహా మరేం చేయలేం. శాసనసభలో రోజూ జరిగేది అదే. ‘ఎంత దుర్మార్గం అధ్యక్షా.. ఇన్ని అబద్ధాలా అధ్యక్షా.. రౌడీయిజం చేస్తే ఎంత మాత్రం సహించం అధ్యక్షా...’-అంటూ మంత్రులు సహచర సభ్యులను చెడామడా క్లాసు తీసుకోవడం వరకూ ఓకే. కానీ- ఆ మాటలన్నీ స్పీకర్‌ను సంబోధిస్తూ చెప్పాల్సి ఉంటుంది. అలాంటపుడు మంచి మాటలు ఇంపుగా ఉన్నా, తప్పుడు మాటలు కొంచెం ఇబ్బందికరమే అంటూ మాజీ స్పీకర్‌లు చాలా సందర్భాల్లో చెప్పిందే. తాజాగా తెలంగాణ శాసనసభలో ఇదే తంతు జరుగుతోంది. - బి.వి ప్రసాద్