మిర్చిమసాలా

నోరు జారితే ఇబ్బందే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొంతమంది వాక్చాతుర్యం ఇతరులను ఇట్టే దిగ్భ్రమకు గురిచేస్తుంది. కాంగ్రెస్ నేత జానారెడ్డి ‘ఏదైతే ఉందో..’ అంటూ మొదలు పెట్టి, సుదీర్ఘంగా మాట్లాడినా ఆ యన ఉపన్యాసం ఏదైతో ఉందో ఎవరికీ అర్థం కాదు. ‘ఇంత దారుణమా?’ అని ఆశ్చర్యపోయేవాళ్లకు ఆయన మాటతీరే అంత అన్పిస్తుంది. ఇలాగే, కాస్త నోరుజారి వెంటనే మాట మార్చిన ఏపి స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై బిజేపి నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. ‘మహిళా పార్లమెంట్’ సంబరంలో- ‘స్ర్తిలు బయటకు రావడం వల్లే సమస్యలు వస్తున్నాయని మొదలు పెట్టి, తానేం మాట్లాడుతున్నానో అర్థం చేసుకుని వెంటనే సరిదిద్దుకున్నా, విమర్శించడానికి పాము చెవులు పెట్టి వింటున్న నేతలు ఉండనే ఉన్నారు కదా..!
- బివి ప్రసాద్

‘విడిది’ యజమానే సిఎం!
తమిళనాడులో ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్న విషయమై ఇపుడు సర్వత్రా చర్చ సాగుతోంది. సిఎం పీఠం పన్నీరు సెల్వానిదేనని కొందరు, ఎమ్మెల్యేలంతా శశికళ క్యాంపులో ఉన్నారు కాబట్టి ఆమెకే ఛాన్స్ అని ఇంకొందరు వాదిస్తున్నారు. 130 మంది ఎమ్మెల్యేలు రిసార్ట్స్‌లో ఉన్నారు కాబట్టి ఆ రిసార్ట్స్ యజమానే కాబోయే సిఎం అని సామాజిక మాధ్యమాల్లో ఒకటే ప్రచారం. ఈ వాదన కరక్టయితే- 1995లో చంద్రబాబుకు బదులు వైస్రాయ్ హోటల్ అధిపతి ప్రభాకర్‌రెడ్డి సిఎం అయ్యేవారని ఒక జోకు. 1995లో తెలుగునాట జరిగిన సంఘటనలను తమిళ ‘శిబిరాలు’ గుర్తు చేస్తున్నాయి. ఇక్కడ అప్పుడు ఏం జరిగిందో తమిళనాట ఇప్పుడు అదే జరుగుతుందని కొందరి వాదన.
- మురళి

‘అనాథ శాఖల’కు అభయం
తెలంగాణ క్యాబినెట్‌లో మహిళలకు ప్రాతినిధ్యం లేనట్టుగానే, సమచారశాఖకు నాథుడే లేకుండా పోయాడు. ఎవరికీ ఇవ్వని శాఖలు సిఎం వద్దే ఉంటాయి. కానీ, సమాచార శాఖపై సిఎం కెసిఆర్ అయిష్టంగా ఉన్నట్టున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రెండేళ్ల వరకూ ఏపి పేరుతో ఉన్న అక్రిడిటేషన్లనే మీడియాకు జారీ చేస్తూ వచ్చారు. తెలంగాణ పేరిట అక్రిడిటేషన్లు జారీ చేస్తే ఆత్మగౌరవం ఉంటుందని మీడియా సంఘాలు మంత్రి కెటిఆర్‌తో వాపోయాయి. ఆయన చొరవతో ఈ ఏడాది తెలంగాణ ప్రభుత్వం పేరిట జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు జారీ అయ్యాయి. మంత్రులు లేని శాఖలకు ముఖ్యమంత్రి తనయుడే దిక్కన్నట్టు ఉంది పరిస్థితి.
- వెల్జాల చంద్రశేఖర్

‘అనుకున్న’ తనిఖీలు!
చెప్పకుండా చేసేవి ‘ఆకస్మిక’ తనిఖీలు. ముందే చెప్పి చేసేవి ‘అనుకున్న’ తనిఖీలు. ఈ రెండో బాపతు తనిఖీలే ఇప్పుడు ఏపిలో జరుగుతున్నాయి. ఒకప్పుడు సిఎం చంద్రబాబు ఉదయానే్న మీ డియా ప్రతినిధులను కేకేసి, ‘బ్రదర్ ఎటు వెళ్దాం?’ అని అడిగేవారు. సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలిసిన జర్నలిస్టులు సిఎంను నేరుగా అక్కడికే తీసుకువెళ్లేవారు. ఆకస్మిక తనిఖీల్లో అధికారులను చంద్రబాబు మందలించి సమస్యల పరిష్కారానికి ఆదేశాలిచ్చేవారు. నేడు తనిఖీల తీరే మారింది. తాజాగా కేంద్రమంత్రి వెంకయ్య విజయవాడలో అక్రమ కట్టడాలు, అపరిశుభ్రత ఘోరంగా ఉన్నట్లు ఆగ్రహం చెందారు. ఈ నేపథ్యంలో పురపాలక మంత్రి నారాయణ తనతో పాటు తనిఖీలకు వెంకయ్యను తీసుకువెళ్లారు. ఎక్కడెక్కడ తాము తనిఖీలు చేస్తామో ముందుగానే అధికారులకు చెప్పి నారాయణ జాగ్రత్తపడ్డారు. అధ్వానంగా ఉన్న డ్రేనేజీలు వెం కయ్య కంటపడకుండా, తనిఖీల తంతు పూర్తయిందనిపించారు.
- నిమ్మరాజు చలపతిరావు

రోజా వస్తే గొడవని..
రాజకీయ నేతలు అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. ప్రజలను నమ్మించేందుకు ఎన్ని నీతికబుర్లయినా చెబుతారు. ఆచరణలో విలువలను గాలికొదిలేస్తారు. విజయవాడలో ‘మహిళా పార్లమెంటు’ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సదస్సును నిర్వహించేందుకు సిఎం చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాద రావు చాలా కష్టపడ్డారు. అరకొర వసతి సదుపాయాలు ఉన్న విజయవాడలో అంతర్జాతీయ సదస్సు అంటే ఆషామాషీ కాదు. వైకాపా ఎమ్మెల్యే ‘ఫైర్‌బ్రాండ్’ రోజా వస్తే గొడవ తప్పదని ముందే ఊహించుకుని ఆమెను నిర్బంధించి జాతీయ రహదారులపై పోలీసు బలగాలు తిప్పడం ఒకటే మచ్చగా మిగిలింది. మేధా పాట్కర్, బృందాకారత్ లాంటి సామాజిక ఉద్యమకారిణులను ఆహ్వానించి ఉంటే మరింత వనె్న వచ్చి ఉండేది.
- శైలేంద్ర