మిర్చిమసాలా

కళ తప్పింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ ఒకప్పుడు కళకళలాడుతూ ఉండేది. నాయకులకు దుస్తులు అమ్మే వాళ్లు అక్కడ అరడజను మంది ఉండేవాళ్లు. పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్నపుడు సైతం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ కళ తప్పకుండా నేతలు జాగ్రత్త పడ్డారు. ఏపిలో తెదేపా అధికారంలోకి వచ్చినా తెలంగాణలో చిక్కిశల్యం కావడంతో ఎన్టీఆర్ భవన్‌పైనా ఆ ప్రభావం పడింది. తెలంగాణ రాష్ట్రాన్ని బొందల గడ్డగా మార్చేశారని టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి విమర్శిస్తే, ఎన్టీఆర్ భవన్‌లో నైరాశ్యపూరిత వాతావరణం చూసి రేవంత్‌కు అలా అనిపిస్తుందేమోనని తెరాస నేతలు కౌంటర్లు వేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు, చంద్రబాబు ఆంధ్రకు వెళ్లడం, టిడిపి ఎమ్మెల్యేలు 12 మంది టిఆర్‌ఎస్‌లో చేరడంతో ఎన్టీఆర్ భవన్ కళ తప్పింది. మిగిలిన కొద్ది మంది- ఆ రోజుల్లో అయతే.. అంటూ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు.

- మురళి

తెరాసలో ఇదో గ్రూపు!
తెలంగాణ సిఎం కెసిఆర్ జన్మదిన వేడుకలు మునుపెన్నడూ లేని రీతిలో ఈ సారి ఘనంగా నిర్వహించారు. జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టులు బారులు తీరారు. టి-టిడిపి నుంచి టిఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేల బృందం విడిగా వచ్చి శుభాకాంక్షలు తెలిపింది. టిఆర్‌ఎస్ పార్టీ నేతలతో కలిసి వెళితే తమకు ప్రత్యేక గుర్తింపు ఉండదనుకున్నారో ఏమో టి-టిడిపి ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రకాశ్‌గౌడ్, మాగంటి గోపినాథ్ తదితరులంతా ప్రత్యేకంగా సిఎంను కలిశారు. వీరి వాలకం చూస్తే శాసనసభ ఆవరణలో టిఆర్‌ఎస్ శాసనసభా పక్షానికి కార్యాలయం కేటాయించినట్టుగానే టిఆర్‌ఎస్ (టి-టిడిపి) పక్షానికి ప్రత్యేకంగా గది కేటాయించాలని కోరేటట్టు ఉన్నారు!
-వెల్జాల చంద్రశేఖర్

స్ట్రోక్‌ల కాలం
సన్ స్ట్రోక్, సన్ ఇన్ లా స్ట్రోక్‌లు రాజకీయాల్లో చాలా చూశాం. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు సన్ ఇన్ లా స్ట్రోక్‌ను అప్పట్లో చంద్రబాబు ఇచ్చారు. యుపి సిఎం అఖిలేష్ యాదవ్ తన తండ్రి ములాయంకు సన్‌స్ట్రోక్ చూపించారు. ఈ ఘటనలు తమకు పునరావృతమవుతాయేమోనన్న భయం రాజకీయనేతలకు ఏర్పడింది. తెలంగాణలో మంత్రి కెటిఆర్‌కు తన తండ్రి, ముఖ్యమంత్రి కెసిఆర్ అంటే ఎనలేని అనురాగం, భయం. స్ట్రోక్‌లు ఇచ్చేంతటి పరిస్థితి తెలంగాణలో లేదు. పంజాబ్‌లో ప్రకాశ్ సింగ్ బాదల్ తన తనయుడిని ఐదేళ్లపాటు డిప్యూటీ సిఎంను చేశారు. ఏపిలో తన కుమారుడు లోకేష్‌కు మంత్రిపదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదించినట్లు సమాచారం. కుమారుడికి మంత్రి పదవి ఇవ్వడంతో పాటు, అఖిలేష్ మాదిరిగా స్ట్రోక్ ఇవ్వకుండా జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం.
-శైలేంద్ర

నేరగాళ్లకు ఇబ్బందే
నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ చేపడుతున్న చర్యలకు దీటుగానే నేరస్థులు కూడా కొత్త విధానాలతోనే చోరీలకు పాల్పడుతున్నారు. నేరస్థులను కనిపెట్టే కొత్త టెక్నాలజీకి మార్కెట్ విస్తరిస్తోంది. క్రైమ్ సీన్‌తోపాటు, నేరస్తులను పట్టుకోవచ్చని పోలీస్ శాఖ డ్రోన్ హెలికాప్టర్ కొనుగోలుపై దృష్టి సారించింది. ఇప్పటి వరకు పోలీసులు దొంగలను పట్టుకునేందుకు వాహనాలు వాడేవారు. వాహనాలు, మైక్రోసెట్టు, ఫోన్లు మొరాయిస్తుండగా దొంగలు యథేచ్ఛగానే చోరీలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త వాహనాలు కొనుగోలుకు, పాతవాటికి మరమ్మతులు చేయాల్సి ఉండగా కొత్తగా డ్రోన్ హెలికాప్టర్ల కొనుగోళ్లపై జనం ముక్కున వేలేసుకుంటున్నారు.
-సయ్యద్ గౌస్‌పాషా

నిప్పులేని మంట
నిప్పు లేకుండానే మంట వస్తుందా..? ఇదే టిడిపి కార్యకర్తలు వేస్తున్న ప్రశ్న. ఉద్యోగుల పనితీరుపై సిఎం చంద్రబాబు ఆగ్రహం అంటూ ఇపుడు పత్రికల్లో వార్తలు రావడం పరిపాటైంది. ఒకప్పుడు చంద్రబాబు ఆగ్రహానికి గురైన ఉద్యోగులు ఆగ్రహించడంతో ఆయన పదవే పోయింది. ఆ విషయం తెలిసే ‘మీరే కదా గత సారి నన్ను ఓడించింది’ అని ఆయన ఉద్యోగులతో అనేశారు కూడా. బాబు ఆగ్రహించారన్న వార్తలకు అప్పట్లో విలువ ఉండేదని, ఇపుడు లేకుండా పోయిందని టిడిపి కార్యకర్తలు వాపోతున్నారు. ‘్ఫలానా ఎమ్మెల్యేపై ఆగ్రహం, ఫలానా మంత్రిపై ఆగ్రహం’ అంటూ వార్తలను సిఎం ఆఫీసు వాళ్లు లీక్ చేస్తున్నా ‘పచ్చ’ పార్టీ నాయకులు, కార్యకర్తలు పట్టించుకోవడం మానేసారట. మహిళా ఎమ్మార్వోపై ఎమ్మెల్యే దాడి, ఒక మంత్రి నుంచి తనకు ప్రాణభయం ఉందని జడ్పీ చైర్‌పర్సన్ ఫి ర్యాదు, స్పీకర్ కో డెల కోడలి ఉ దం తం, బాలకృష్ణ పిఎ వ్యవహారం.... ఇ లాంటి ఘటనలు ఎక్కువవడంతో బాబు ఆగ్రహం ఎంత వరకూ వెళ్తుందో చూడాలని కార్యకర్తలు అంటున్నారు.
- బి.వి.ప్రసాద్