మిర్చిమసాలా

క్రమశిక్షణ తప్పదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరు ఎప్పుడు ఏ పార్టీలోకి వలస వెళతారో తెలియక, రాజకీయాలంటేనే ప్రజల్లో ఇప్పుడు ఏహ్యభావం నెలకొంది. అయితే, అధికారంలో ఉన్నా లేకున్నా కేంద్రమంత్రి వెంకయ్య మాత్రం క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తున్నారు. ఆయన ఏ సభలో పాల్గొన్నా వేదికపై ఉన్నవారు, సభికులు నిశ్శబ్దంగా ఉండాల్సిందే. ముఖ్య వ్య క్తులైనా, ఇతరులైనా అటూ ఇటూ కదలడానికి కూడా అవకాశం ఉండదు. ఇష్టం లేని వారు బయటకు వెళ్లిపోవాలంటూ వెం కయ్య నిర్మోహమాటంగా చెబుతా రు. ముందుగా ఆయన- ‘అందరూ సెల్‌ఫోన్లను స్విచ్ ఆఫ్ చేయాలి లేదా సైలెంట్‌లో ఉంచుకోవాలి. చేతకాని వారు పక్కనున్న వారి సహాయం తీసుకోవాల’ని సలహా ఇస్తారు. అంతా పద్ధతి ప్రకారం సాగాలన్నదే ఆయన క్రమశిక్షణ.
- నిమ్మరాజు చలపతిరావు

‘కోదండ’ చలవే!
ప్రభుత్వ ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేయాలని టిజెఎసి చైర్మన్ కోదండరామ్ చేపట్టిన ఆందోళనతో కొందరికి మాత్రం ఆగమేఘాల మీద నామినేటెడ్ పోస్టులు వరిస్తున్నాయి. వీరు సిఎం కెసిఆర్‌కు బదులుగా కోదండరామ్‌కు కృతజ్ఞతలు చెప్పుకోవాలేమో! తమకు గుర్తింపు రాలేదన్న అసంతృప్తితో ఉన్న కొందరు ఉద్యమనేతలు కోదండతో ఎక్కడ చేతులు కలపుతారేమోనని కెసిఆర్ సర్కారు నామినేటెడ్ పోస్టులతో సంతృప్తి పరుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ టిజెఎసి చైర్మన్‌గా పనిచేసిన ఆయాచితం శ్రీ్ధర్‌ను రాష్ట్ర గ్రంధాలయ చైర్మన్‌గా, వి.ప్రకాశ్‌ను స్టేట్ వాటర్ రిసోర్స్ డెవలప్‌మెంట్ చైర్మన్‌గా నియమించారు. కోదండతో విభేదించే మరి కొందరికి పదవులు ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం కొన్ని కొత్త పోస్టులను సిద్ధం చేస్తున్నట్టు వినికిడి.
- వెల్జాల చంద్రశేఖర్

ఎమ్మెల్యే వైద్యసేవలు
డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయ్యామని కొందరు సినీనటులు చెబుతుంటారు. డాక్టర్ అయ్యాక రాజకీయాల్లో చేరి స్థిరపడిన వారూ ఉన్నారు. తాజాగా మిజోరం రాష్ట్రానికి చెందిన ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గానికి చెందిన ఓ మహిళకు స్వయంగా ఆపరేషన్ నిర్వహించి ‘శభాష్’ అనిపించుకున్నారు. కడుపునొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చిన 35 ఏళ్ల మహిళను చూసిన ఎమ్మెల్యే డాక్టర్ కె. బిచ్‌హువా హృదయం ద్రవించింది. వెంటనే ఆమెను ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్ళి శస్తచ్రికిత్స చేశారు. ఆసుపత్రిని సందర్శించేందుకు వెళ్ళిన సదరు ఎమ్మెల్యే డాక్టరుగా వైద్యసేవ చేశారు. నిస్వార్థ ప్రజాప్రతినిధులు ఇలా డాక్టర్లో, అడ్వకేట్లో అయితే ఓటర్లకు ఉచిత సేవలే..
- వి.ఈశ్వర్ రెడ్డి

‘గ్రాఫిక్స్ బాబు’!
ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ని మీడియా మి త్రులు ‘హైటెక్ సిఎం’ అనే వారు. మొదట్లో వామపక్షాలు సైతం అంతే అభిమానం చూ పేవి. విభజన త ర్వాత ఆయన ఇప్పుడు ‘గ్రా ఫిక్స్ బాబు’ అ య్యారని సిపిఎం నేత బివి రాఘవులు వ్యంగ్యోక్తు లు విసురుతున్నారు. ‘రాజధాని నగరాన్ని ఇ లా నిర్మిస్తాం, అలా నిర్మిస్తాం అం టూ ప్రజలకు అద్భుతమైన గ్రాఫిక్స్ లోకం చూపుతున్నారు. బాహుబలి, ఈగ సినిమాలకు మించిన గ్రాఫిక్స్ చూపుతున్నార’ని ఆయన చమత్కరించారు. ‘ప్రజలకు బొమ్మల గ్రాఫిక్స్, విదేశీ అతిథులకు అంకెల గ్రాఫిక్స్ చూపుతున్నారు. అంకెలు నిజం కావు, బొమ్మలు నిజం కావు’ అని రాఘవులు విమర్శించారు.
- మురళి

అది కాదు.. ఇదంట..
అంగరంగ వైభవంగా మహిళా పార్లమెంటు సదస్సు నిర్వహించిన ఏపి ప్రభుత్వానికి వచ్చిన లాభం కంటే నష్టమే ఎక్కువగా కనిపించింది. స్పీకర్ కోడెల చేసిన వ్యాఖ్యలు ఒక ఎత్తయితే, ఎమ్మెల్యే రోజా అరెస్టు కూడా ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆహ్వానించి మరీ రోజాను అరెస్టు చేయడం వివాదాస్పదమైంది. తనకు జరిగిన అవమానాన్ని నిరసిస్తూ డిజిపి మీద రోజా విరుచుకుపడటంతో ఏపి పోలీస్ ఆఫీసర్ల సంఘం అసలు విషయం చెప్పేసింది. తమపై కూడా కొన్ని ఒత్తిళ్లు ఉంటాయని ఆ సంఘ నేతలు చెప్పుకొచ్చారు. ‘ఒత్తిళ్లు’ అని చెప్పాక కూడా, వాటి వెనుక ఉన్న నేతల గురించి కూడా ఇంకా వివరించాలా..?
-బివి ప్రసాద్