మిర్చిమసాలా

అంతా మంచికే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్ర విభజన సమయంలో పరస్పరం విమర్శించుకున్న ఆంధ్ర, తెలంగాణ ప్రజలు ఈరోజు సఖ్యతగా ఉండేందుకు నేతలు తీసుకుంటున్న చొరవ పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తెలంగాణ సిఎం కెసిఆర్, మంత్రుల బృందం తిరుమల వెంకన్న సన్నిధిలో మొక్కులు చెల్లించారు. తిరుమలలో మర్యాదల పట్ల కెసిఆర్ సంతృప్తి చెందారు. ఉమ్మడి గవర్నర్ సమక్షంలో ఆస్తుల పంపకంపై చర్చలు ఆశాజనకంగా సాగుతున్నాయి. విద్వేషాలకు దూరంగా ఉభయ రాష్ట్రాలు అభివృద్ధిలో నడవాలంటే నాయకుల మధ్య సఖ్యత ఉండాలి. ఎపి సిఎం చంద్రబాబు కూడా చర్చలకు సిద్ధమంటున్నారు. ఇదంతా చూస్తుంటే అంతా మన మంచికే అనిపిస్తుంది.
- శైలేంద్ర

మాంసంపై స్వచ్ఛంద నిషేధం
జాతీయ పర్వదినాలు, శివరాత్రి వంటి మతపరమైన పర్వదినాల్లో జంతువధపై నిషేధం ఉన్నా అది అమలవుతున్న దాఖలాలు తక్కువే. ఇక, గ్రామాల్లో తిరునాళ్ల సమయంలో రికార్డింగ్ డ్యాన్స్‌లు, మందు, మాంసం ఉండాల్సిందే. అయితే, కృష్ణాజిల్లా యనమలకుదురు ప్రజలు మాత్రం ఇందుకు విరుద్ధం. శివరాత్రి రోజున అక్కడ కులమతాలకతీతంగా జంతువధ, మాంసం విక్రయాలు ఉండవు. కొండపై కొలువుదీరిన శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో కల్యాణం సందర్భంగా రెండోరోజున, మూడోరోజు వసంతోత్సవం నాడు సైతం ఏ ఒక్కరూ మాంసం ముట్టరు. అక్కడి ముస్లిం మహిళలు బురఖాలు ధరించి స్వామి వారి కల్యాణాన్ని తిలకించడం మతసామరస్యానికి నిదర్శనం.
- నిమ్మరాజు చలపతిరావు

సవాలక్ష ఆటంకాలు
తెలంగాణ సిఎం కెసిఆర్ కుమారుడు కెటిఆర్ పురపాలక మంత్రిగా పేరు తెచ్చుకుంటుండగా, విదేశాల్లో చదువుకున్న తన పుత్రరత్నం లోకేష్‌ను ఏపి సిఎం చంద్రబాబు ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకువస్తున్నారు. లోకేష్‌కు మంత్రి పదవి ఇద్దామని బాబు భావిస్తుండగా ఏదో ఒక ఆటంకం వస్తోంది. వైకాపా నుంచి టిడిపిలో ఒకరిద్దరు నేతలతో పాటు లోకేష్‌ను మంత్రిని చేయాలని చూస్తే ఈసారి గవర్నర్ రూపంలో ఆటంకం ఎదురైంది. పార్టీ ఫిరాయించిన వారు ఎన్నికల్లో గెలిచాకే వారిని మంత్రి పదవుల్లోకి తీసుకోవాలే తప్ప, నేరుగా తీసుకోవడం నైతికత కాదంటూ గవర్నర్ కార్యాలయం సూచించడంతో మరో మారు చంద్రబాబు తన ప్రయత్నాలను సమీక్షించుకోవల్సి వచ్చిందని టిడిపి కోటరీ చెబుతోంది. - బివి ప్రసాద్

మళ్లీ ఎందుకిలా?
తెలంగాణ ఆవిర్భావం ఓ చీకటి రోజు అంటూ చంద్రబాబు మాట్లాడడం పట్ల తెలంగాణ నాయకులు గుర్రుగా ఉన్నారు. ఒక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని చీకటి రోజు అని అనడం భా వ్యమా? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కోసం ఎంతో చేశానని చెప్పుకుంటున్న బాబు, ఇప్పుడు ఆంధ్రలో చేసిందేమీ లేదని, అందుకు విభజనే కారణం అంటూ మళ్లీ పాత డైలాగులు అందుకున్నారని తెలంగాణ మంత్రులు విమర్శిస్తున్నారు. గ్రాఫిక్స్‌తో కాలం గడుపుతున్న బాబు పాలనపై దృష్టిసారించడం మంచిదని సూచిస్తున్నారు. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య మంచి సంబంధాలు ఏర్పడిన తరువాత ఇలా విద్వేషాలు రగల్చడం తగదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు. - మురళి

చట్టానికి చుట్టం..!
పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి (కాంగ్రెస్) ఇంటికి స్థానిక లైన్‌మెన్ కరంట్ కట్ చేశాడు. విద్యుత్ బిల్లు బకాయిపడిన వ్యక్తి ఎమ్మెల్యే అయినా మరెవ్వరైనా కనక్షన్ కట్ చేయడం తమ విధి అని లైన్‌మెన్ నిక్కచ్చిగా వ్యవహరించాడు. నా ఇంటికే కరంట్ కట్ చేస్తావా?.. అని సదరు లైన్‌మెన్‌ను బండబూతులు తిట్టిన సంఘటన సోషల్ మీడియాలో సంచలనం రేపింది. చట్టం ముందు అందరూ సమానమేనని లైన్‌మెన్‌కున్న ఇంగితజ్ఞానం పోలీసులకు లేకుండా పోయింది. లైన్‌మెన్‌ను దూషించిన ఎమ్మెల్యేను వదిలిపెట్టి ఆయన పిఏపై పోలీసులు కేసు పెట్టారు. చట్టం ముందు అందు సమానమే కానీ,ఎమ్మెల్యేలు కొంచెం తక్కువ సమానమని పోలీసులు కొత్త భాష్యం చెప్పారు.
- వెల్జాల చంద్రశేఖర్