మిర్చిమసాలా

లేకుండా చేస్తా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెరాస అధికారం చేపట్టాక- ప్రజా సంఘాలు, విపక్ష నేతలు నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేసే అవకాశమే లేకుండా చేస్తానని ముఖ్యమంత్రి కెసిఆర్ గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు అర్థం ఇదేనా! అని విస్తుపోవాల్సిన పరిస్థితి నెలకొందని టి.జెఎసి చైర్మన్ కోదండరామ్ వ్యాఖ్యానించారు. తెరాస ప్రభుత్వంలో సమస్యలే ఉండవనీ, దీంతో ధర్నాలు, దీక్షలు, నిరసన ప్రదర్శనలు చేయాల్సిన పనే ఉండదని అనుకున్నామన్నారు. ఇందిరా పార్కు వద్ద ఉన్న ధర్నాచౌక్ లేకుండా చేస్తామని ఇప్పుడు అర్థమైందని ఆయన అనడంతోనే సభికులు కరతాళ ధ్వనులు చేశారు.
- వి.ఈశ్వర్ రెడ్డి
వౌనమేలనోయి..
చెప్పుకోవాలి కాని సాకులకు కొదవ, వినేవాడుంటే ఏదో ఒకటి చెప్పడం మరీ తేలిక. తెరాస నేతలు చేస్తున్నది ఇదే. ఉస్మానియా యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాల్లో సిఎం కెసిఆర్ ఎందుకు మాట్లాడలేదని అంటే- వైఎస్‌ఆర్ జమానాలోని సంఘటనలను నేతలు ప్రస్తావిస్తున్నారు. ఆ నాటి ఆహ్వాన పత్రం లో వైఎస్‌ఆర్ మాట్లాడతారని పేర్కొనలేదు. ఇటీవలి ఉస్మానియా యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాలకు రంగురంగుల్లో అందమైన ఆ హ్వాన పత్రాన్ని ప్రచురించారు. రాష్టప్రతి ప్ర ణబ్‌ముఖర్జీ సహా సిఎం, ఉప ముఖ్యమంత్రి, ఎంపి కేశవరావు తదితరులు మాట్లాడే సమయాలను ముద్రించారు. ఆఖరి నిమిషంలో అందరి ప్రసంగాలు రద్దు చేశారు. అంతవరకూ ఓకే. దీనికి కారణాలు మాత్రం ఒకొక్కరూ ఒక్కోలా చెప్పడమే అందర్నీ అయోమయానికి గురిచేస్తోంది. సిఎం ఎప్పుడు యూనివర్శిటీలకు వెళ్లినా మాట్లాడటం లేదు కదా అని టిఆర్‌ఎస్ నేతలు, రాష్టప్రతి కార్యాలయమే ఉపన్యాసాలు రద్దు చేసిందని వర్శిటీ అధికారులు చెబుతున్నారు.
- బి.వి. ప్రసాద్

సెల్‌ఫోన్ చూస్తే భయమట!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సెల్‌ఫోన్‌ను సామాన్యుడికి సైతం చేరువ చేసింది తానేనంటూ పదేపదే చెప్పుకునే నవ్యాంధ్ర సిఎం చంద్రబాబు నాయుడు నేడు అదే సెల్‌ఫోన్‌ను చూసి భయపడుతున్నారట! పాలనలో టెక్నాలజీని పరిచయం చేస్తున్నప్పటికీ, అది పెడదారి పట్టడం చూస్తుంటే భయమేస్తోందని ఇ టీవల ఓ సభలో బా బు చెప్పారు. సోషల్ మీడియాలో తన పట్ల కూడా అసత్య ప్రచారం జరుగుతోందన్నారు. ‘సమావేశాల్లో సెల్‌ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకోవాలి.. వీలైతే వాటిని బయటే పెట్టి రా వాలి.. ఎందుకంటే ఏ క్షణాన ఏమి రికార్డు చేస్తారోనన్న భయం..’ అంటూ ముఖ్యమంత్రి చెప్పటంతో సభికులు కంగుతిన్నారు.

- నిమ్మరాజు చలపతిరావు

మాదే అధికారం..
పల్లె నుంచి దిల్లీ వరకూ ఎక్కడా అధికారం లేకపోవడంతో కాంగ్రెస్ నాయకుల బాధలు వర్ణనాతీతం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రతిపక్షంగా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తోంది. ఏపి అసెంబ్లీలో ఒక్క సీటూ దక్కలేదు. కాంగ్రెస్ ఇప్పట్లో అధికారంపై ఆశలు పెట్టుకోవడం వృథా అని తేలిపోయింది. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపి మల్లు రవి మాత్రం 2019లో కేంద్రంలో, తెలంగాణలో, ఆంధ్రలో అధికారంలోకి వచ్చేస్తాం.. అని జోస్యం చెప్పారు. ఇది జోస్యమా? జోకా? అని ఆయన మాటలు విన్నవారు చమత్కరిస్తున్నారు.
- మురళి

వీరికెందుకు భయం?
కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకన్నట్లు ఆంధ్ర రాజకీయాలు మారాయి. విపక్షనేత, వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కలిసి రాష్టప్రతి ఎన్నికల్లో ఎ న్‌డిఎ అభ్యర్థికి మ ద్దతు ఇస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ గనుక వి పక్షాల అభ్యర్ధిని నిలబెడితే జగన్ మ ద్దతు ఇస్తారని కలలో కూడా ఎవరూ ఊహించరు. అదే జరిగితే, వైకాపాకు రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్లే. బిజెపికి జగన్ మద్దతు ఇస్తే ‘కమలనాథుల’ను వ్యితిరేకించే వర్గాలు వైకాపాకు దూరమయ్యేంతటి సమీకరణలు ఏపిలో లేవు. టిడిపి మాత్రం బిజెపికి జగన్ మద్దతు ఇవ్వడంపై ఎడాపెడా ప్రకటనలు చేయడం చూస్తుంటే జనానికి మతిపోతోంది. బిజెపికి మద్దతు ఇస్తే తన ఓటు బ్యాంకు పోతుందనే భయం జగన్‌కు ఉండాలి. కానీ, టిడిపికి ఎందుకు ఆందోళన అన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

- శైలేంద్ర