మిర్చిమసాలా

ఎమ్మెల్యేకో పదవి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ ఉద్యమం సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఇంటికో ఉద్యోగం హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన కెసిఆర్ ఇంటికో ఉద్యోగం మాట మార్చి..ఎమ్మెల్యేకో పదవి ఇచ్చే నైజాన్ని ప్రదర్శించారు. బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఇటీవల నగరంలో జరిగిన ఒక సభలో చేసిన ఈ వ్యాఖ్య పలువురిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఎట్టకేలకు ఉద్యోగాల భర్తీకి పూనుకున్న సిఎం కెసిఆర్ ఎమ్మెల్యేకో పదవిని కేటాయించడంలో తలపట్టుకుంటున్నట్టున్నారు. ఈ నేపథ్యంలో టిఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలు పదవినే ఉద్యోగంగా భావిస్తున్నట్టున్నారంటూ చమత్కరించడంతో సభికులు ఒక్కసారి నవ్వుకున్నారు.
- ఎండి గౌస్
పేరులోనే ఉంది!
పేరులో ఏ ముంది అంటాం కానీ టిడిపి నాయకులు మాత్రం అంతా పేరులోనే ఉంది అంటున్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అని పిలవడం వల్లనే తెలంగాణలో టిడిపి ఘోరంగా దెబ్బతింటోందట! ఇకపై అలా పిలువకుండా తెలుగుదేశం తెలంగాణ అని పిలవాలట! దీంతో ఇక పార్టీ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని తేల్చారు. ఎన్టీఆర్ టిడిపి, అన్నా టిడిపి అంటూ టిడిపికి ముందు గతంలో పదాల్ని చేర్చినప్పుడు జనం ఆదరించలేదని, ఇప్పుడూ అలానే టిడిపికి ముందు తెలంగాణ అని చేర్చడం ప్రజలకు నచ్చలేదని తేల్చారు. తెలంగాణ టిడిపి నాయకులు రేవంత్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మల్లారెడ్డి తదితరులు సమావేశం అయి ఈ మేరకు నిర్ణయించారు. తెలంగాణలో టిడిపిని తెలంగాణ టిడిపి అని సంబోధిస్తూ, ఆంధ్రలో మాత్రం ఆంధ్ర టిడిపి అని కాకుండా టిడిపి అనే సంబంధిస్తున్నారు ఇలా ఎందుకో ఆ పార్టీ నేతలు చెప్పడం లేదు. బహుశా అంధ్ర టిడిపి అని పిలిస్తే ఆంధ్రలోనూ ప్రమాదంలో పడతారనేమో!
- మురళి

భలే భలే..!
గెలిచినందుకు కాదు, డిపాజిట్ వచ్చినందుకు కాంగ్రెస్ వారు ఆనందపడుతున్నారు. వరుసగా డిపాజిట్ల కోల్పోయి ఘోరపరాజయం చవి చూస్తున్న తెలంగాణ కాంగ్రెస్‌కు నారాయణ్‌ఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నిక కొంత ఊరట కలిగించింది. ఓటమి ఎదురైనా 39 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. డిపాజిట్లు దక్కాయి. వరంగల్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతైంది. గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్ధలో కేవలం రెండే రెండు సీట్లు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ నేతలు ఉపశమనం పొందారు. ఈ ఉప ఎన్నికలలో భారీ పోలింగ్ జరగడంతో తమకు డిపాజిట్లు గల్లంతవుతాయోమోనని కాంగ్రెస్ నేతలకు భయం పట్టుకుంది. కాని 16వ తేదీ ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత కాంగ్రెస్ నేతలు హమ్మయ్య అనుకున్నారు. గులాబీ ప్రభంజనంలో కాంగ్రెస్ నిలదొక్కుకోవడం నిజంగా గ్రేటే
- శైలేంద్ర

హరీశ్‌రావుకు దక్కని నజరానా
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్న మంత్రి కెటిఆర్‌కు నజరానాగా ఆయనకు తన వద్ద ఉన్న మున్సిపల్‌శాఖను ముఖ్యమంత్రి బహుకరించారు. ఈ లెక్కన గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పుడు ఉప ఎన్నికలు జరిగినా పార్టీ బాధ్యతలను భుజాన వేసుకుని పార్టీకి విజయాన్ని చేకూరుస్తున్న మరో మంత్రి హరీశ్‌రావుకు కూడా నజరానాగా ముఖ్యమంత్రి మరో శాఖను అప్పగిస్తారని భావించారు. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో, అలాగే నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో పార్టీకి ఘన విజయాన్ని సాధించిపెట్టడానికి అమితంగా కృషి చేసిన హరీశ్‌రావుకు ప్రస్తుతానికి అదనంగా మరే శాఖను ముఖ్యమంత్రి ఇవ్వలేదు. పట్టణ ప్రాంతాల్లో పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్న మంత్రి కెటిఆర్‌కు సంబంధిత మున్సిపల్ శాఖను అప్పగించినట్టుగానే, గ్రామీణ ప్రాంతంలో పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్న మంత్రి హరీశ్‌రావుకు గ్రామీణాభివృద్ధి శాఖను కేటాయించవ్చని రాజకీయ విశే్లషకులు అంచన వేశారు. అయితే గ్రామీణాభివృద్ధిశాఖను హరీశ్‌రావుకు ఇవ్వాలంటే, ముందుగా ఆ శాఖను నిర్వహిస్తున్న కెటిఆర్ నుంచి దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కారణంగానే హరీశ్‌రావుకు నజరానా దక్కలేదేమో?
- వెల్జాల చంద్రశేఖర్

‘గీత’తో రాత మారేనా
హక్కుల కోసం, డిమాండ్ల సాధనకు ఉద్యమాలు ప్రజాస్వామ్యంలో పరిపాటిగా మారింది. గత పక్షం కాపులను బిసి జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఆ వర్గానికి చెందిన వారంతా ఉద్యమించడంతో రాష్ట్రం అట్టుడికిపోయింది. ఉద్యమంతో అది ఆగలేదు, అటుగా వెళ్తున్న రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను ఉద్యమకారులు దగ్ధం చేశారు. ఇది తొలిసారి కాదు, గతంలో జరిగిన అనేక ఉద్యమాల్లో రైళ్లను దగ్ధం చేయడం, బస్సులను దగ్ధం చేయడం, ప్రభుత్వ ఆస్తులను తగులబెట్టడం మామూలే, అయితే ప్రశాంతంగా ఉన్న గోదావరి జిల్లాల్లో రైలు దగ్ధం అందర్నీ కలచివేసింది. దీంతో ఆలోచనలో పడిన ప్రభుత్వం హింసకు అడ్డుకట్టవేయాలని నిర్ణయించింది. అంతే పాఠ్యపుస్తకాల్లో భగవద్గీత బోధన చేపడితే మంచి ఫలితాలు ఉంటాయని నిర్ణయించింది. రాష్ట్రప్రభుత్వం పాఠ్యాంశాల సంస్కరణకు నియమించిన చాగంటి కోటేశ్వరరావు కమిటీ విద్యార్ధులు అందరికీ గీతాబోధనతో సత్ఫలితాలు ఇస్తాయని పేర్కొంది. ఇంతకీ ‘గీత’తో రాష్ట్రం రాత మారేనా అనేదే మీమాంస
- బి.వి.ప్రసాద్