మిర్చిమసాలా

కలిసి రాని కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలం కలిసి రాక పోవడం అంటే ఇదేనేమో బాబుగారు ఏం మాట్లాడినా వివాదాస్పదం అవుతోంది. ఆయన ఉద్దేశం ఏంటో కానీ నేను అనుకుంటే ఒక్క ఓటుకు ఐదువేల రూపాయలు ఇవ్వగలను అంటూ నంద్యాలలో ఆయన ప్రకటన సంచలనం సృష్టించింది. అది సరిపోదు అన్నట్టు తమ ఊరికి రోడ్డు వేయాలని కోరుతూ కొందరు గ్రామస్తులు వినతిపత్రం ఇస్తే నేనిచ్చిన పెన్షన్లు తీసుకుంటున్నారు, నేను వేసిన రోడ్లపై నడుస్తున్నారు నాకు ఓటు వేయనప్పుడు మీకు ఎందుకు వేయాలి. ఓటు వేయనప్పుడు పెన్షన్ తీసుకోకండి అంటూ బాబు అన్న మాటలు జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించాయి. బాబుకు ఏమైంది అని అభిమానులే కాదు వ్యతిరేకులు సైతం ఆలోచనలో పడ్డారు.
- మురళి

స్వానుభవంతో..
చట్టాల్లో నియమ నిబంధనలు లేనప్పటికీ కొన్ని సందర్భాల్లో స్వానుభవాలు కూడా బాధితుల పక్షాన మెరుగైన తీర్పులు వెలువరించగలవని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ అంటారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని చెప్పకనే చెప్పారు. ఆయన ఐదారేళ్ల వయస్సులో ఉండగా నాగార్జునసాగర్ డ్యాం నిర్మాణ సమయంలో ప్రభుత్వం ఎలాంటి నోటీసు, పరిహారం కూడా చెల్లించకుండా కంచికచర్లలోని వారి 11 ఎకరాల భూమిని స్వాధీనపరచుకుంది. దీనిపై జస్టిస్ నూతలపాటి తండ్రి ఎన్నో వ్యయప్రయాసాలతో కోర్టుల చుట్టూ తిరగ్గా ఆయన మరణానంతరం తగిన పరిహారం చెల్లించాలంటూ తీర్పు వెలువడింది. కొసమెరుపు ఏమంటే.. ఈ తీర్పు భావితరాలకు ఆదర్శం కావాలంటూ పరిహారాన్ని మాత్రం తిరిగి ప్రభుత్వానికే అప్పగించారట!
- నిమ్మరాజు చలపతిరావు

‘సిట్’ అంటే..
‘సిట్’ అంటే ఏమిటీ? అయ్యో! ఆ మాత్రం తెలియదా? ‘సిట్’ అంటే కూర్చోమని, ‘స్టాండప్’ అంటే నిలుచోమని చదువుకున్న వారే కాదు నిరక్షరాస్యులూ ఇట్టే చెప్పేయగలరు. కాగా, ఇది ఆ ‘సిట్’ కాదు. ‘ఎస్‌ఐటి’- స్పె షల్ ఇనె్వస్టిగేషన్ టీం. మియాపూర్ భూ కుంభకోణాలపై రాష్ట్ర ప్రభుత్వం ‘సిట్’తో దర్యాప్తు చేయిస్తున్నందున వాస్తవాలు వెలుగులోకి రావు కాబట్టి ‘సిబిఐ’ విచారణ జరిపించాలని కాంగ్రెస్ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ‘సిట్’ రాష్ట్ర ప్రభుత్వం కూర్చోమంటే కూర్చుంటుందని, స్టాండ్ అంటే నిలబడుతుందని పొన్నం గాంధీ భవన్‌లో వ్యాఖ్యానించడంతో అక్కడున్న వారంతా గొల్లుమని నవ్వారు.
- వి ఈశ్వర్ రెడ్డి
బర్త్‌డే..
ఆఫీసులో సెలవుకావాలంటే భార్య బర్త్‌డే ఉందనో...పిల్లల బర్త్‌డే ఉందనో చెప్పడం మామూలే, కొంత మంది అధికారులు బర్త్‌డే పేరుతో అందర్నీ ఆకట్టుకోవడం కూడా తెలిసిన విషయమే. ఒక్కోసారి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడితే కూడా బర్త్‌డే పేరుతో తప్పించుకోవడం ఎపుడూ జరిగేదే. ఇలాంటి పనే తనూ చేసి, ఈసారి తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడిందని మంత్రి కెటిఆర్ అసలు సీక్రెట్ చెప్పేశారు. మారథాన్ పోటీల లోగోను ఆవిష్కరించడానికి వచ్చిన కెటిఆర్, 2014లో ఐదు కిలోమీటర్లే కదా అని మారథాన్‌లో పాల్గొన్నా, సగం దూరం వెళ్లేసరికి నా పని అయిపోయింది, దాంతో తర్వాత ఎపుడు మారథాన్ పోటీలు వచ్చినా భార్య బర్త్ డే అంటూ తప్పించుకుంటున్నా, కాని ఈసారి మారథాన్ పోటీల తేదీ మార్చడంతో తప్పించుకునేలా లేదు..అని చెప్పేసరికి నవ్వులు విరిశాయి.
- బి వి ప్రసాద్

మైనార్టీల కోసమే..
బిజెపి దాని ఎన్డీయే పక్షాలు బలపరచిన రాష్టప్రతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు టిఆర్‌ఎస్ మద్దతు ఇవ్వడం పట్ల కాంగ్రెస్, టిడిపి, మజ్లీస్, వామపక్షాలు తప్పు పట్టాయి. మతతత్వ బిజెపికి టిఆర్‌ఎస్ బలపరచడంతో కెసిఆర్ అసలు రంగు బయటపడిందని ఈ పార్టీలు దుయ్యబట్టాయి. టిఆర్‌ఎస్ నైజాన్ని ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని కూడా కొన్ని పార్టీలు మైనార్టీలకు పిలుపునిచ్చాయి. బిజెపితో దోస్తి టిఆర్‌ఎస్‌కు ఇబ్బందికరమేనని ఆ పార్టీలో ఇతర నాయకులు ఆందోళన చెందుతుండగా, ఆ పార్టీ మైనార్టీ నాయకుడు ఒకరు కొత్త కోణాన్ని వెల్లడించారు. బిజెపితో కెసిఆర్ సఖ్యంగా ఉంటున్నది మైనార్టీలకు పెంచబోయే రిజర్వేషన్ల పెంపునకు ప్రధాని నరేంద్ర మోదీ మద్దతు కోసమేనట!. మైనార్టీలకే ఇలాంటి అభిప్రాయం ఉన్నప్పుడు కాంగ్రెస్, టిడిపి, మజ్లీస్, వామపక్షాలు ఏమంటే మాత్రం ఏమవుతుంది?
- వెల్జాల చంద్రశేఖర్