మిర్చిమసాలా

బారు-బీరు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నీరు-మీరు’ పథకంలా ‘బా రు-బీరు’ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెడుతుందన్న భయాన్ని సినీనటి, వైకాపా ఎమ్మెల్యే ఆర్‌కె రోజా వ్యక్తం చేశారు. ఎపి ఎక్సైజ్ మంత్రి కెఎస్ జవహర్- ‘బీరును ప్రమోట్ చేస్తామని, అది ఓ హెల్తీ డ్రింక్’ అంటున్నారని ఆమె మండిపడ్డారు. బీరును మద్యం దుకాణాల్లోనే కాకుండా మెడికల్ షాపుల్లో, హెరిటేజ్ మాల్స్‌లో విక్రయిస్తారా? మధ్యాహ్న భో జన పథకంలోనూ ప్రవేశ పెడతారా? అని రోజా ప్రశ్నించారు. ఈ హెల్తీ డ్రింక్‌ను యువమంత్రి లోకేష్ అతిగా సేవించినందుకేమో జయంతికి, వర్ధంతికి తేడా తెలియకుండా మాట్లాడారని రోజా వ్యాఖ్యానించడంతో వైకాపా కార్యాలయంలో నవ్వుల జల్లు కురిసింది.
-వి. ఈశ్వర్ రెడ్డి

తిట్టే నోరు..!
కాంగ్రెస్ నేతలు లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్‌కుమార్ పదేళ్ల పాటు ఎంపీలుగా పనిచేసి, సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో సొంత పార్టీకి గుడ్‌బై చెప్పారు. రాజకీయ సన్యాసం తీసుకున్నానని లగడపాటి ఇపుడు నోరు విప్పడం లేదు. ఇక, ఉండవల్లి నోరుతెరిస్తే రాజకీయ విమర్శలు అందునా చంద్రబాబుపై వెల్లువెత్తుతుంటాయి. 60 ఏళ్లు దాటినందున యువత కోసం తాను ఇక ఎన్నికల్లో పోటీ చేయనని, తనకు తగిన రాజకీయ పార్టీ నేడు ఏదీ లేదని ఆయన అంటున్నారు. కానీ, లగడపాటిలా ‘రాజకీయ సన్యాసం’ మాట పొరబాటున కూడా ఆయన ఎత్తడం లేదు. నచ్చనివారిని తిట్టాలంటే మరి రాజకీయాల్లో ఉండాలిగా.. దటీజ్ ఉండవలి..!
- నిమ్మరాజు చలపతిరావు

వ్యూహకర్తలు..
ఒకప్పుడు ఎన్నికల్లో గెలవాలనుకునే రాజకీయ పార్టీల అధ్యక్షులు తమ పొలిట్ బ్యూరో లేదా అత్యున్నత కమిటీలతో సమావేశమై ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహరచన చేసేవారు. పార్టీ పెద్దలతో చర్చించి ఎన్నికల ప్రణాళికలను ప్రకటించేవారు. కా నీ, రోజులు మారాయి. ప్రతి ఎన్నికల్లో అన్ని సా మాజిక వర్గాల, గ్రూపుల ఓట్లు కీలకమయ్యాయి. ఓటర్లు ఎప్పుడెలా స్పందిస్తారనే దానిపై అంచనా వేసేందుకు రాజకీయ వ్యూహకర్తలు వచ్చేశారు. వీరు నడిపే కనె్సల్టెన్సీలకు పెద్ద మొత్తంలో ఫీ జులు ఇవ్వాల్సిందే. వీరు తమ సంస్థల్లోని జూనియర్ వ్యూహకర్తలతో కలిసి జిల్లాల్లో పర్యటించి అధికార, ప్రతిపక్ష పార్టీలకు ప్రజల్లో ఉన్న పట్టును, మూడ్‌ను పసిగడతాయి. విజయానికి, ఓటమికి దారితీసే కారణాలతో జాబితాలు ఇస్తాయి. ఇపుడు వైకాపా అధ్యక్షుడు జగన్ ‘విక్టరీ’ వ్యూహకర్తగా పేరుపొందిన ప్రశాంత్ కిశోర్‌కు ఈ పని అప్పగించారట! వ్యూహకర్తల అంచనాలు 2019లో ఫలిస్తాయా లేదో చూడాల్సిందే. - శైలేంద్ర

ప్రతి ఒక్కరికీ ఒక రోజు...
ప్రైవేటు విద్యాసంస్థల ఫీజులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తల్లిదండ్రులకు ‘డ్రగ్స్’ వ్యవహారం బాగానే ఉపయోగపడినట్టుంది. భారీగా ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థల పేర్లను ప్రచారంలోకి తీసుకురావడానికి, వారికి సామాజిక మాధ్యమాల్లో శాస్తి చేయడానికి ‘డ్రగ్స్’తో జవాబు చెబుతున్నారు. పోలీసు శాఖ సైతం కాలేజీల పేర్లను వెల్లడించడమేగాక, తల్లిదండ్రులు, విద్యార్ధి సంఘాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు. కాలేజీల్లో డ్రగ్స్ తీసుకుంటున్న విద్యార్ధులున్నారని నిర్ధారిస్తుండటంతో యాజమాన్యాలు ఉలిక్కిపడ్డాయి. ఒక పాఠశాలలో ఒక విద్యార్థి మాత్రమే డ్రగ్స్ తీసుకున్నట్టు తేలినా 5వేలమంది చదువుతున్న పాఠశాలను బజారుకు ఈడ్చేశారంటూ యాజమాన్యాలు వాపోతున్నాయి. ప్రతి ఒక్కరికీ ఒక రోజు ఉంటుందంటే ఇదేనేమో..!
- బివి ప్రసాద్