మిర్చిమసాలా

సొరకాయనా? ఆన్యపు కాయనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సొరకాయ అయినా అన్యపు కాయ అయినా ఒక్కటే. పేర్లు వేరైనా కాయ ఒక్కటే. రెండు పేర్లకు కూడా సమాన అవకాశం ఇస్తున్నామంటూ తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రావాళ్లు సొరకాయ అంటారని, తెలంగాణ వాళ్లు ఆన్యపు కాయ అంటారన్న విషయాన్ని ఉద్యమ సమయంలో కెసిఆర్ ప్రస్తావించిన విషయం ఇప్పుడు చర్చకు వచ్చింది. సిధారెడ్డి మీడియాతో ఇష్టాగోష్ఠిగా ఒక సందర్భంలో మాట్లాడుతూ, ప్రపంచ తెలుగు మహాసభలు సొరకాయనా? అన్యపు కాయనా అంటూ విపక్ష నాయకులు చేసిన విమర్శలకు తనదైన శైలిలో జవాబిచ్చారు. ఇప్పుడు అందరికీ సమానమైన గౌరవం ఇస్తున్నామన్నారు. -పి.వి.రమణారావు
అమరావతి ఇంకెంతకాలం?
ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం ఎప్పుడెప్పుడా ఆని ఐదు కోట్ల ఆంధ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తుంటే, ఇంకా నమూనాలతో చంద్రబాబు ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది. ఇప్పటికీ చాలా సార్లు నమూనాలను మార్చారు. రకరకాల ఆర్కిటెక్ట్‌లను రంగంలోకి దింపారు. కొంత మంది థర్మల్ ప్లాంట్‌లా రాజధాని నమూనా ఉందన్నారు. దీంతో మళ్లీ మొదటికి వచ్చింది. తాజాగా మళ్లీ నమూనా రాజధాని డిజైన్‌ను పబ్లిక్ డొమైన్‌లో పెట్టారు. ఏవో విమర్శలు వస్తూనే ఉంటాయి. విమర్శలుచేసే వాళ్లు చేస్తూనే ఉంటారు. రాజకీయాధికారంలో ఉండేవాళ్లు ఇటువంటి విషయాల్లో ఒక నిర్ణయం తీసుకుని ముందుకు పోవాలి. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడచినా తమకంటూ ఒక రాజధాని లేక, ఉన్న రాజధానులను పొగొట్టుకుని క్రాస్‌రోడ్డులో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక మంచి రాజధాని భవనాల నిర్మాణాన్ని వెంటనే చేపడితే బాగుంటుందని, ఇక జాప్యం పనికిరాదని జనం మనోగతం. ఇక ఆలస్యం చేస్తే 2019 వస్తుంది. వచ్చే బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే ఎన్నికల జ్వరం పట్టుకుంటుంది. ఈ నమూనాలను ఎంతకాలమని చూపిస్తారని జనానికి ఆగ్రహం కూడా వస్తుంది. -శైలేంద్ర
తెలంగాణ తల్లే!
ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో కొందరు తెలంగాణవాదులు తెలుగు తల్లి ఉత్సవాలేంటీ?, తెలంగాణ ఉద్యమ సమయంలో ‘తెలుగుతల్లి’ని ఎవనికి తల్లి, ఎవరి తల్లి అని ఆనాడు ఉద్యమ నేతగా, ప్రస్తుత సిఎం కెసిఆర్ ప్రశ్నించిన విషయాన్ని గుర్తు చేస్తూ తప్పుపట్టారు. అప్పుడేమో తెలుగు తల్లిని దూషించి ఇప్పుడేమో అదే తల్లి పేరిట ఉత్సవాలు నిర్వహిస్తారా? అని వారు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో మహాసభల్లో తెలుగుతల్లి, తెలంగాణ తల్లి ఎవరికి పూలమాల సమర్పిస్తారోనని అందరూ ఆసక్తిగా చూసారు. అయితే విమర్శకులు ఉహించని విధంగా ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవంలో తెలంగాణ తల్లి విగ్రహానికే పుష్పాంజలి సమర్పించడంతో విమర్శకుల నోళ్లు మూతపడ్డాయి.
-సిఎస్‌వి
ఎక్కడ ఉన్నా... ఏమైపోయినా...!
ప్రపంచ తెలుగు మహాసభలకు తోటి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కూడా ఆహ్వానిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. సిఎం కెసిఆర్ ఔదార్యాన్ని మీడియా హైలెట్ చేసింది. కానీ తీరా ఆయన్ను ఆహ్వానించకుండానే ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగిపోయింది. ఇదే విషయాన్ని ‘ఏం సార్ తెలుగు మహాసభలకు వెళ్లలేదేంటీ? ఆహ్వానం రాలేదా?’ అని చంద్రబాబును మీడియా ప్రశ్నించింది. ‘పిలువకపోయినా ఫర్వాలేదు, ఎక్కడ ఉన్నా తెలుగు వారంతా ఒకటిగా ఉండాలనీ, తెలుగు భాషను అందరూ ఆదరించాలి’ అని ధీనంగా బాధపడుతూ చెప్పారు. ఆ సమయంలో ఆయన ఫేస్‌లో ఫీలింగ్స్ గమనిస్తే ‘ఎక్కడ ఉన్నా, నేనేమైపోయినా...నీ సుఖమే కోరుకున్నా...’ మనసు కవి ఆత్రేయ గీతం గుర్తుకొచ్చింది, ఏమంటారు?!.
-వెల్జాల చంద్రశేఖర్
కార్యకర్తలా మజాకా
కార్యకర్తల్లో ఉన్న వేడి వాడి నిజానికి నాయకుల్లో ఉండదనడం అతిశయోక్తికాదు. అగ్రనాయకులు కలిసేంత తేలికగా కార్యకర్తలు కలవలేరు, పెద్ద పార్టీలు కేంద్రస్థాయిలో ఎన్నికల సయోధ్య కుదుర్చుకున్నా గ్రామస్థాయిలో కార్యకర్తల మధ్య గిల్లికజ్జాలు నడుస్తునే ఉంటాయి. ఈ మధ్య పవన్‌కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉండగా, ఏ పార్టీతో ఎలాంటి ఆబ్లిగేషన్ లేదని, ఏ నాయకుడితోనైనా పోరాటానికి సిద్ధమేనని పవన్ అంటూ అవసరమైతే ప్రధాని మోదీతోనైనా పోట్లాడతా అని చెప్పగానే కార్యకర్తలు మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు ప్రారంభించారు. దాంతో వెంటనే అర్ధం చేసుకున్న పవన్ నినాదాలు చేయమని తాను చెప్పలేదని, ఎవరికీ వ్యతిరేకంగా నినాదాలు చేయవద్దని అనగానే రాజకీయ మంత్రాంగం తెలుసుకున్న కార్యకర్తలు వౌనం పాటించారు. ఇంతకీ పవన్ రాజకీయం ఏమిటో ఎవరికైనా అర్ధం అయిందా...?
-బి.వి.ప్రసాద్