మిర్చిమసాలా

చంద్రబాబును చూసి నేర్చుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నదుల అనుసంధానమంటే చంద్రబాబు గుర్తుకొస్తారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సంగతి పక్కనపెడితే పట్టిసీమ నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్మించిన కుడికాల్వ ద్వారా వంద టిఎంసి నీటిని కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను తరలించి రికార్డు సృష్టించారు. ఎవరు అవునన్నా, కాదన్నా, చంద్రబాబుకు ఈ క్రెడిట్ దక్కుతుంది. గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం చేసేశారు. కేంద్రం మాత్రం రకరకాల ప్లాన్లతో కాలక్షేపం చేస్తోంది. వాజపేయి ప్రధానిగా ఉండగా నదుల అనుసంధానమంటూ ఎన్డీఏ ప్రభుత్వం చాలా హడావుడి చేసింది. ఇది 17 ఏళ్ల కిందటి మాట. ప్రస్తుతం నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లయింది. తాజాగా తెలంగాణ ద్వారా గోదావరి-కృష్ణా-పెన్నా-కావేరి నదుల అనుసంధానమంటోంది. ఇది మంచి ప్రణాళికనే. కాని ఆచరణ శూన్యం. పదేళ్లకోసారి అద్భుతమైన, ప్రజలను ఆకట్టుకునే నదుల అనుసంధానం ప్లాన్లను తెరపైకి తెచ్చి ఆ తర్వాత నిధుల కొరత పేరుతో గాలికి వదిలేయడం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలకు అలవాటైంది. ఇప్పుడు కేంద్రం ప్రతిపాదించిన కొత్త ప్లాన్ అయినా అమలవుతుందా ? ఈ విషయంలో చంద్రబాబే మేలు.
-శైలేంద్ర
ఎంకి పెళ్లి సుబ్బి చావుకి..!
ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చిన చందంగా.. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ నగరంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఇటీవల తరచూ నగర వీధుల్లో ఆకస్మిక పర్యటనలు సాగించటం ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. అలాగే నగర సుందరీకరణ పేరిట ప్రభుత్వ, ప్రైవేట్ ప్రహరీ గోడలన్నింటినీ రంగురంగుల డిజైన్లతో తీర్చిదిద్దుతున్నారు. ముందస్తు అనుమతులు లేకుండా ప్రధాన రహదారుల్లోని విద్యుత్ స్తంభాలపై జెండాలు, ఫ్లెక్సీలను అధికారులు అనుమతించడం లేదు. నగరంలో తరచూ జరిగే సభలు, సమావేశాల సందర్భంగా విస్తృత ప్రచారం కోసం పోస్టర్లు అంటించుకోటానికి, గోడలపై రాతలు రాయడానికి, ఫ్లెక్సీలు తగిలించుకోటానికి సాధ్యపడక రాజకీయ పక్షాలు.. ముఖ్యంగా వామపక్ష విద్యార్థి, కార్మిక సంఘాల నేతలు తల్లడిల్లిపోతున్నారు.
-నిమ్మరాజు చలపతిరావు
గరికపాటికి షాక్!
ప్రపంచ తెలుగు మహాసభలకు తమ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆహ్వానించక పోవడంతో తాను రావడం సమంజసం కాదని నిరాకరించినట్టు ప్రముఖ అవధాని గరికపాటి నరసింహారావు నిర్వాహకులకు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ మరుసటి రోజు నిర్వహించిన సినీ విభావరికి చంద్రబాబు నాయుడికి స్వయాన బావమరిది, టిడిపి ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ హాజరు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తమ ముఖ్యమంత్రిపై సాహితీవేత్తకున్నపాటి అభిమానం సొంత బావమరిదికి లేకపోవడం చర్చనీయాంశమైంది. కవులు, కళాకారుల మనస్తత్వాలు వేరు, సినిమా వాళ్ల మనస్తత్వాలు వేరని ఈ ఉదంతం నిరూపించింది. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి తెలంగాణ ప్రభుత్వం స్థలం కేటాయింపు, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు వినోద పన్ను మినహాయింపు వంటి లబ్ధిపొందిన బాలకృష్ణ తెలంగా ప్రభుత్వం ఆహ్వానిస్తే రాకుండా ఎలా ఉంటారనేది అసలు ప్రశ్న.
-వెల్జాల చంద్రశేఖర్

రూలింగ్? ట్రేడింగ్??
ఏ ప్రభుత్వమైనా చేయాల్సింది చూడాల్సింది ప్రజాసంక్షేమమే, తర్వాతే మిగిలిన పరిపాలనా అంశాలుంటాయి. మొదటి నుండి సుపరిపాలనపై మక్కువ చూపే చంద్రబాబునాయుడు ప్రభుత్వం పోలవరం విషయంలో విమర్శలను ఎదుర్కొక తప్పలేదు. వైసిపి విమర్శలు చేస్తుందంటే సరే...విపక్షానికి ఆ బాధ్యత ఉందనుకోవచ్చు, కాని ప్రభుత్వంలో భాగంగా ఉన్న బిజెపి సైతం విమర్శలు చేస్తోంది. కొంత మంది బిజెపి నాయకులు అధికారపక్షంతో కలిసి ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతూ పోలవరం ప్రాజెక్టు తీరును సమర్ధిస్తుంటే మరికొంత మంది బిజెపి నేతలు మాత్రం రాష్ట్రంలో రూలింగ్ లేదని ట్రేడింగ్ జరుగుతోందని విమర్శించడంతో అసలేం జరుగుతుందో ప్రజలకే మింగుడుపడటం లేదు. ఇదేనా రాజకీయం అంటే...
-బి.వి.ప్రసాద్