మిర్చిమసాలా

ఈ కన్నీరును ఏమంటారో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీసీల సంక్షేమం కోసం ఏమేమి చర్యలు తీసుకోవాలో సిఫారసు చేస్తే వాటిని యథాతథంగా ప్రభుత్వం అమలు చేస్తుందని ఆ సామాజిక వర్గాల ప్రజాప్రతినిధుల సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సమావేశానికి హాజరైన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్‌తో సహా ఇతరులంతా ముఖ్యమంత్రి నిర్ణయాన్ని వేనోళ్ల కొనియాడారు. ఆ తర్వాత ముఖ్యమంత్రికి సిఫారసు చేయడానికి నిర్వహించిన సమావేశాలకు లక్ష్మణ్ హాజరై పలు సూచనలు కూడా చేసారు. అయితే బిజెపి ఓబిసి సెల్ సభలో బిసీలపై ముఖ్యమంత్రి కేసీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఇదే లక్ష్మణ్ ధ్వజమెత్తారు. ఇంతకాలం బీసీలను ఏ పార్టీ పట్టించుకోకున్నా కనీసం ఆ దిశగా సిఎం కెసిఆర్ ఏ కన్నీరో ఓ కన్నీరు కార్చినా బీసీలకు మేలు జరిగితే చాలని ఆ సామాజిక వర్గాలు ఆనందపడుతుంటే ఈ లక్ష్మణ్ ఎందుకు కన్నీరు కారుస్తున్నారో?.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఓబీసీ క్రిమిలేయర్ పరిమితిని పెంచింది. మరీ ఇది బీసీలపై బీజేపీ సర్కార్ కార్చిన మొసలి కన్నీరు కాదంటారా?!
-వెల్జాల చంద్రశేఖర్
కృష్ణాలో చచ్చింది ‘చెంబు’!
బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా దేశంలోనే కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచి నేతలు, ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఇందుకోసం జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం తనదైన రీతిలో చేపట్టిన ‘చెంబు చచ్చింది.. ఆత్మగౌరవం బతికింది’ అనే నినాదం గ్రామాల్లోకి చొచ్చుకెళ్లింది. స్వయంగా కొన్ని గ్రామాల్లో తిరిగిన కలెక్టర్ స్థానికులతో మమేకమై దశాబ్దాలుగా వెంటాడుతూ వస్తున్న ‘చెంబు’కు శాస్త్రోక్తంగా పాడె కట్టించి, తానుకూడా మోసి, ఆపై పూజలు జరిపించి సమాధి చేయిస్తున్న తీరు మీడియాలో దేశవ్యాప్తంగా హల్‌చల్ చేస్తోంది.
కొసమెరుపు: ఈ పథకానికి ఆద్యులైన ప్రధాని నరేంద్ర మోదీ, ప్రస్తుత ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు చిత్రపటాలు స్వచ్ఛ ప్రచార కార్యక్రమంలో ఎక్కడా కనిపించటం లేదు. మరోవైపు చెంబులు విక్రయించే వ్యాపారులు తమవద్ద పోగుపడే నిల్వలను చూసుకుంటూ ఆందోళన చెందుతున్నారు!
-నిమ్మరాజు చలపతిరావు

‘స్వీట్’ హైదరాబాద్
హైదరాబాద్ నగరం బిర్యానీకే కాకుండా ‘స్వీట్స్’ కు కూడా అంతర్జాతీయంగా పేరుప్రఖ్యాతులు సంపాదించింది. 2018 జనవరి 13 నుండి మూడు రోజుల పాటు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న అంతర్జాతీయ స్వీట్ ఫెస్టివల్‌లో వెయ్యిరకాల స్వీట్లను ప్రదర్శిస్తున్నారు. ప్రదర్శన జరుగుతున్న చోటే స్వీట్ల తయారీ చేస్తుండటంతో అటుగా వెళ్లిన వారంతా స్వీట్ల తయారీతో వచ్చిన ఘుమఘుమలను ఆస్వాదిస్తున్నారు. వెయ్యి స్వీట్లలో ఏవి తినాలో నిర్ణయించుకోలేక చాలా మంది ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
-పి.వి.రమణారావు

‘విష్ణు’ చక్రం
యుద్ధతంత్రంలో విష్ణుచక్రం గురించి తెలియనివారెవరున్నారు... రాజకీయాల్లో కూడా విష్ణు చక్రం బాగానే పనిచేస్తున్నట్టు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. వైజాగ్ బీజేపీ ఎమ్మెల్యే గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నానా మాటలు అనేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాగల కార్యం ‘విష్ణు’ తీర్చాడులే అని సంతోషపడుతోంది. వ్యవసాయ భూమిని వాణిజ్య భూమిగా మార్చడానికి ఉద్ధేశించిన ‘నాలా బిల్లు’ ఆర్డినెన్స్‌ను తిరస్కరించిన గవర్నర్ తర్వాత దానిని బిల్లు రూపంలో ప్రభుత్వం పంపించినా దానిని సైతం ఆమోదించకుండా అనుమానాలు లేవనెత్తారు. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లును ఆమోదించినట్టు తెలుసుకున్న ఆంధ్రా ప్రభుత్వం తన అస్త్రాలను ప్రయోగించింది. అంతే ‘విష్ణు’ రూపంలో ప్రయోగించిన చక్రం బాగానే పనిచేసింది. గవర్నర్ సంతకం అయిపోయింది.
-బి.వి.ప్రసాద్

నేరస్థుల సర్వే..
సమగ్ర సర్వే మాదిరిగా సమగ్ర నేరస్థుల సర్వేకు పోలీసు శాఖ శ్రీకారం చుట్టింది. ఈ సర్వే ద్వారా దొంగలెవ్వరో తేల్చేస్తారు. సమగ్ర సర్వే ఆశించిన రీతిలో జరగలేదనే ఆరోపణలు వచ్చాయి. అదేదో కులాలు, సామాజిక హోదా లెక్కల కోసం జరిగింది కాబట్టి సరిపోయింది. సమగ్ర నేరస్తుల సర్వే అలా కాదు. పోలీసు శాఖలో ఉన్నత స్థాయిలో ఎన్ని మార్పులొచ్చినా సిబ్బందిలో ఆ మార్పు ఆశించినంత ఇంకా రాలేదు. ఈ నేపథ్యంలో నేరగాళ్ల లెక్కలు కూడా సమగ్ర సర్వేలా మొక్కుబడిగా నిర్వహిస్తారేమో వేచి చూద్దాం!
-బి.వి.రమణ