Others

‘కమలం’ దూరం.. దూరం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఏపీలో బీజేపీకి చెందిన ఇద్దరు మంత్రులూ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొనకుండా ముఖం చాటేస్తున్నారు. సీఎం చంద్రబాబు, టీడీపీ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు అవకాశం దొరికినప్పుడల్లా మిత్రపక్షమైన బీజేపీపై అసంతృప్తిని వెళ్లగక్కుతునే ఉన్నారు. టీడీపీ నేతల విమర్శలకు దీటుగా జవాబు చెప్పలేక అధికారిక కార్యక్రమాలకు బీజేపీ మంత్రులు గైర్హాజరవుతున్నారు. ఇకముందు ప్రభుత్వ పరంగా జరిగే సభలు, మంత్రివర్గ సమావేశాల్లో ‘కమలనాథుల’ వైఖరి ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే!
- నిమ్మరాజు చలపతిరావు

‘జాక్’ అంటే ఉత్సాహం!
కొన్ని పదాలకు కొన్ని ఘటనలు, ఉద్యమాల వల్ల పాపులారిటీ వస్తుంది. దశాబ్దాలు గడచినా వాటి ప్రాధాన్యత పోదు. తెలంగాణ ఉద్యమంలో ‘జాక్’ (జాయింట్ యాక్షన్ కమిటీ) పదం సూపర్ హిట్టయింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమనే లక్ష్యసాధనలో అన్ని పార్టీలను కలుపుకుని ‘జాక్’ పోరుబాటలో నడిచి విజయం సాధించింది. తాజాగా ఆంధ్ర రాష్ట్రానికి దిశ, దశ నిర్దేశించాలని తపన పడుతున్న ‘జనసేనాని’ పవన్ కల్యాణ్ ఒక ‘జాక్’ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి తలపండిన మేధావులు, ఎన్నికల్లో గెలుపు ఓటములు చవిచూసిన పెద్దలు హాజరయ్యారు. ‘జాక్’ అని పేరుపెట్టకున్నా ప్రస్తుతానికి ‘్ఫక్ట్ ఫైండింగ్ కమిటీ’ అని నామకరణం చేశారు. ఇది చర్చలకే పరిమితం కాకుండా లక్ష్యసాధనలో ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాల్సిందే.
- కేవీఎస్

ఆ ఒక్కటీ అడక్కు..
తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర పర్యటనకు వచ్చే కేంద్రమంత్రులు పనిలో పనిగా పొగిడేస్తున్నారు. కాళేశ్వరం వంటి గొప్ప సాగునీటి ప్రాజెక్టు ఎక్కడా లేదని కేంద్ర జలసంఘం సభ్యులు కితాబు ఇచ్చి వెళ్లారు. కేంద్ర మంత్రులే కాదు, కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్నాటక మంత్రి రేవణ్ణతో పాటు నీతి ఆయోగ్ సైతం తెలంగాణ చేపట్టిన పథకాలను ప్రశంసించింది. రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులతో ఇటీవల ఢిల్లీలో కేంద్ర జలవనరుల మంత్రి గడ్కరీ ఓ సమావేశాన్ని నిర్వహించి, తెలుగు రాష్ట్రాలను చూసుకొని నేర్చుకోవాలని మిగతా వారికి హితవు పలికారు. ప్రశంసలు సరే.. అందరూ మెచ్చుకున్న పథకాలకు కేటాయింపులు చేశారా అంటే- ఆ ఒక్కటీ అడక్కు అన్నట్టుగా ఉంది కేంద్రం వ్యవహరం.
- వెల్జాల చంద్రశేఖర్

హైలెస్సా.. హైలెస్సా..
రోడ్డుపై ఉన్నట్టుండి ఏదైనా వాహనం ఆగిపోతే ప్రయాణీకులు ‘హైలెస్సా...హైలెస్సా’ అంటూ నెట్టడం పరిపాటే. కానీ, ఓ విమానమే ఆగిపోతే..? అమ్మో- అంత పెద్ద బరువైన విమానాన్ని నెట్టడం సాధ్యమేనా? అంటే సుసాధ్యం చేశారు ఇండోనేసియా ప్రయాణికులు. విమానం ‘రన్-వే’పై ల్యాండ్ అయ్యాక పార్కింగ్ ఏరియాలో ఆగకుండా పక్కన ఉన్న మైదానంలోకి వెళ్ళింది. దీంతో గాభరా పడిన టెక్నీషియన్లకు సమీపంలో పుష్‌బ్యాక్స్ కనిపించకపోవడంతో, ప్రయాణికుల సహాయంతో మెల్లిగా రన్-వేపైకి తీసుకుని వచ్చారు. 35 వేల కిలోల బరువున్న విమానాన్ని ప్రయాణీకులు నెట్టాల్సి వచ్చింది. ఆ విమానాన్ని నెట్టాక ప్రయాణీకులు హైలెస్సా అనడమే కాకుండా ఉసూరుమన్నారట.
- వి.ఈశ్వర్ రెడ్డి

నిజాయితీ ఏది..?
ప్రపంచం అంతా టెక్నాలజీ వెంట పరుగులు పెడుతోంది. ఏం అడిగినా వర్చ్యువల్ టెక్నాలజీలో డిజిటల్ లెక్కలు చెబుతున్నారు. రాష్ట్ర విభజన వివాదంలోనూ గణాంకాల గురించి అడిగితే-‘అన్నీ వెబ్ పోర్టల్‌లో ఉన్నాయి, చూసుకోండి..’ అంటూ అధికారుల నుంచి సమాధానం వస్తోంది. మొన్నటికి మొన్న టిఎస్‌పిఎస్‌సి, ఎపిపిఎస్‌సి ఫలితాలు వెబ్‌లో పెట్టాం చూసుకోండి అంటూ పోర్టల్‌పైనే ఆధారపడమంటున్నారు. తీరా చూస్తే ఫలితాల్లో గందరగోళం, లెక్కల తేడాలు, కేటాయింపుల్లో అనుమానాలు కనిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన మైనింగ్ కాంగ్రెస్ సదస్సులో రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ప్రస్తావించారు. ‘అన్నింటికీ టెక్నాలజీ అంటున్నారు, సరే పారదర్శకత ఏది? అందులో నిజం ఎంతుందో కూడా తెలియాలి కదా.. సామాన్యుడికి కూడా అన్నీ తెలిసిన నాడే ఐటికి అర్థం’ అంటూ ఆయన తన మనసులో మాట చెప్పడంతో అందరిలోనూ ఐటి వినియోగంలో నిజాయితీపై ప్రశ్నలు తలెత్తాయి.
- బీవీ ప్రసాద్