మిర్చిమసాలా

మైలేజీకి ‘అంతరాయం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎక్కడైనా విషాదకర ఘటన చోటుచేసుకుంటే ఇక ఆరోజంతా ఇతరత్రా అంశాలేవీ ఎలక్ట్రానిక్ మీడియాలో దర్శనమివ్వవు. తాజాగా అందాల తార శ్రీదేవి అకాల మరణంతో మూడురోజులు ఇతర కార్యక్రమాలన్నీ ‘బుల్లితెర’కు దూరమయ్యాయి. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో విశాఖలో జరిగిన పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు ముగింపు రోజు ఉత్సవంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలెందరో హాజరయ్యారు. సరిగ్గా అదేరోజు శ్రీదేవి మృతి వార్తకు అన్ని టీవీ చానళ్లు విశేష ప్రాధాన్యమిచ్చాయి. కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతీ స్వామి శివైక్యం పొందిన రోజు కూడా శ్రీదేవి అంత్యక్రియల దృశ్యాలే టీవీల్లో ప్రధానంగా ప్రసారమయ్యాయి. ప్రింట్ మీడియాలో తమ వార్తలకు ఎంత ప్రాధాన్యత లభించిందో తెలుసుకునేందుకు రాజకీయ నేతలు మర్నాడు వచ్చే దినపత్రికల కోసం ఎదురుచూడాల్సి వచ్చింది!
- నిమ్మరాజు చలపతిరావు

సందట్లో సడేమియా..
రామాయణంలో పిడకల వేట అంటే ఇదే కాబోలు. ప్రముఖ హీరోయిన్ శ్రీదేవి దుబాయిలో మృతి చెందిన వార్త దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించగా, అదే స్థాయిలో మీడియా గందరగోళాన్ని సృష్టించింది. మొదట ఆమె గుండెపోటుతో మృతి చెందిందన్నారు. ఆ తర్వాత ప్రమాదవశత్తూ బాత్‌టబ్‌లో పడి చనిపోయిందన్న వార్త మరింత సంచలనం రేపింది. అంతటితో ఆగలేదు. శ్రీదేవి ఆల్కహాల్ సేవించినట్టు పోస్టుమార్టం నివేదికలో బయట పడటంతో మరింత సంచలనం రేపింది. ఆమె ప్రమాదవశాత్తూ మృతి చెందిందా? మరణం వెనుక ఏదైనా కుట్ర ఉందా? అన్న అనుమానాలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సందట్లో సడేమియాలా- సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత అమర్‌సింగ్ సీన్‌లోకి ఎంటరై, నా మాదిరిగా శ్రీదేవికి కూడా వైన్ తాగే అలవాటు తప్ప మందు తాగే అలవాటు లేదని బయట పెట్టారు. శ్రీదేవికి మందు తాగే అలవాటు లేదని చెబితే సరిపోయేది, పనిలో పనిగా తనకు కూడా శ్రీదేవి మాదిరి వైన్ తాగే అలవాటు మాత్రమే ఉందని పరోక్షంగా ఆయన తనకు తాను సర్ట్ఫికెట్ ఇచ్చేసుకున్నారు.
- వెల్జాల చంద్రశేఖర్

రేటింగ్‌లే ముఖ్యం..
ఎక్కడైనా ఏదైనా జరిగితే చాలు.. మితిమీరిని ఉత్సాహంతో టీవీ చానళ్లు తమ రేటింగ్‌ల కోసం ఎంతకైనా తెగిస్తాయి. ఒక పెద్ద ఘటన జరిగితే ‘సీన్ కనస్ట్రక్షన్’ పేరుతో.. కల్పిత పాత్రలతో ఆ ఘట్టాలను అతికినట్టు చూపించడంలో ముందున్న తెలుగు చానళ్లు అగ్రనటి శ్రీదేవి మృతి సందర్భంగానూ వార్తల్ని వండి వార్చడంతో వీక్షకులు విస్మయం చెందారు. దుబాయి పత్రిక ‘ఖలీజ్ టైమ్స్’ ఇచ్చిన కచ్చితమైన సమాచారాన్ని తెలుగు చానళ్లు వక్రీకరించి అంతా తాము అక్కడే ఉండి చూసి చెబుతున్న చందంగా టిఆర్పీ రేటింగ్ పెంచుకోవాలని పరితపించాయి. చివరికి శ్రీదేవి మరణించిన బాత్‌టబ్, దానికి ఉన్న కనెక్షన్లు, టబ్‌లో మునిగిపోయిన తీరు గంటల తరబడి చూపడం, బోనీకపూర్ ఎక్కడికీ వెళ్లరాదని దుబాయి పోలీసులు ఆదేశించారని చెప్పడం, ఆయన పాస్‌పోర్టును సీజ్ చేశారని మరోసారి.. ఇలా అడ్డగోలు వార్తలు అందించిన చానళ్లు తాము అభాసుపాలయ్యామని అంగీకరించడం లేదు. సరికదా సిగ్గు లేకుండా టిఆర్పీ పెరిగిందని చెప్పుకోవడం విడ్డూరం.
- బీవీ ప్రసాద్

కదిలే రైలులో కల్యాణం
వివాహం అనగానే ఫంక్షన్ హాలు, పెద్ద కల్యాణ మండపం, భారీ సెట్టింగ్‌లు, లక్షలాది రూపాయలు ఖర్చు చేయడం వంటివి గుర్తుకొస్తాయి. కానీ, లక్నో-గోరఖ్‌పూర్ మధ్య నడుస్తున్న రైలులో ఫార్మాసిస్ట్ సచిన్ కుమార్, పన్నుల శాఖలో ఉద్యోగిని జ్యోత్స్నసింగ్ పటేల్ జంటగా మారారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ ప్రసాద్ వీరి వివాహాన్ని అత్యంత సాధారణంగా జరిపించారు. నడుస్తున్న రైలులో వివాహం జరుపుకుని లక్షలాది రూపాయలు ‘ఆదా’ చేయాలన్న తమ కల నెరవేరిందని కొత్త దంపతులు చెప్పారు. ఇలా రైలులో వివాహం చేసుకోవడం భారతీయ రైల్వే చరిత్రలోప్రప్రథమం.
-వి. ఈశ్వర్ రెడ్డి
నేతల డైలమా!
నిత్యం అనేక సమస్యలతో సతమతమయ్యే ప్రజలను గందరగోళం నుంచి బయట పడేయాల్సిన బాధ్యత నేతలదే. ఇందుకు భిన్నంగా ఏపీలో ఇప్పుడు రాజకీయ నాయకులు తీవ్ర గందరగోళంలో ఉన్నారు. ప్రజలకు స్పష్టత ఉంది. ‘ప్రత్యేక హోదా’ సంజీవిని కాదని, ప్యాకేజీ వస్తుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ మధ్య తన గళం సవరించారు. జనంలో నిరసన చూసిన వెంటనే వారి అభిమతం మేరకు నడుచుకుంటామని, హోదా కోసం ఉద్యమిస్తామని ఆయన తాజాగా ప్రకటించారు. వైకాపా అధినేత జగన్ మొదటి నుంచి హోదా గురించే పట్టుబడుతున్నారు. ఇక భాజపా నేతలు కూడా హోదా కంటే ప్యాకేజీ గొప్పదని చెబుతున్నారే తప్ప- ప్యాకేజీ వివరాలు చెప్పడం లేదు. ఆంధ్రాకు హోదా కావాలా? ప్యాకేజీ కావాలా? అనే దానిపై రాజకీయ పార్టీలకే అవగాహన లేదు. దీనిపై స్పష్టత సాధించి జనంలోకి వెళ్లడం ఉత్తమం.
-కెవీఎస్

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్ ఫోన్: 040- 2742 5668