మిర్చిమసాలా

సెల్ఫీలతో జాగ్రత్త..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు ‘సెల్ఫీ’ వ్యామోహం వెర్రితలలు వేస్తోంది. వీవీఐపీలు కనిపించినా, సెలబ్రెటీలు కలిసినా, విందులు, వినోదాలు, పర్యాటక ప్రదేశాల్లో సెల్ఫీ తీసుకోవడం అలవాటుగా మారింది. ఇది కొంత వరకు బాగానే ఉన్నా, కొన్ని సందర్భాల్లో శ్రుతి మించిపోయి ప్రాణాంతక మవుతోంది. సెల్ఫీ తీసుకుంటూ భవనంపై నుంచి దూకడం, నదిలో పడిపోవడం వంటి దుర్ఘటనలు జరిగాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న ఓ యువతి దక్షిణ ఢిల్లీలోని తన బంధువుల నివాసానికి వెళ్ళింది. ఆ ఇంటి యజమాని మైనర్ కుమారుడు చేతిలో రివాల్వర్ ఉంచుకొని ఆమెతో సెల్ఫీ దిగాలని ప్రయత్నించాడు. అనుకోని రీతిలో ట్రిగ్గర్‌పై ఆ కుర్రాడి వేలు పడడంతో రివాల్వర్ నుంచి బుల్లెట్ ఆ యువతి శరీరంలోకి దూసుకునిపోయి ఆమె నేలకొరిగింది. మైనర్ బాలుడికి లోడ్ చేసి ఉన్న రివాల్వర్ ఇచ్చినందుకు ఆ ఇంటి యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేరింతలే కాదు, ఒక్కోసారి సెల్ఫీ వెనుక మృత్యువు కూడా పొంచి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త..!
- వి. ఈశ్వర్ రెడ్డి
కేసీఆరా.. మజాకా..!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పని చేసినా చాలా పద్ధతిగా చేస్తుంటారు. ‘అతడు’ సినిమాలో హీరో మహేష్‌బాబు కొట్టిన దెబ్బలు చూసి తనికెళ్ల భరిణి ‘పద్ధతి ప్రకారం కొట్టాడ్రా...’ అన్నట్టు కేసీఆర్ వ్యూహాత్మక ప్రకటనలకు విపక్షాలు కకావికలం కావడం మామూలే. జాతీయ రాజకీయాల్లో థర్డ్ ఫ్రంట్ పెడుతున్నట్టు ఆయన చెప్పడమేగాక, అందుకు వడవడిగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు- ‘ఆదాయపు పన్ను వసూలు చేసే అధికారం, పంచుకునే అధికారం రాష్ట్రాలకే ఉండాలని, జీఎస్టీపై సర్వహక్కులు ఇవ్వాలని, రిజర్వేషన్లపైనా స్వేచ్ఛ ఇవ్వాలని పలు డిమాండ్లు చేయడంతో విపక్ష నేతలు గింగిర్లు తిరుగుతున్నారు. ఈ డిమాండ్లు ఇంకా ఎలా పెరుగుతాయోనన్న ఉత్కంఠ ప్రతిపక్ష పార్టీల్లో నెలకొంది.
-బీవీ ప్రసాద్
స్పందన ఇలాగేనా?
ఎక్కడి పని అక్కడే చేస్తే బాగుంటుంది. ఏపీ ప్రభుత్వం వచ్చే ఏడాదికి బడ్జెట్ ప్రవేశపెట్టింది. దీనిపై రాజధాని అమరావతిలో ప్రధాన ప్రతిపక్షమైన వైకాపా నేతలు స్పందించాలి. అదేమి విచిత్రమో కాని ఆ పార్టీ సీనియర్ నేతలు వరుసగా రెండు రోజులు హైదరాబాద్‌లో స్పందించారు. అధికార పార్టీ వైఫల్యాలను వైకా పా బాగానే ఎండగడుతోంది. ఇదంతా ఏపీ రాజధానిలో జరిగితే స ముచితంగా ఉంటుంది. హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌లు పెట్టి విమర్శించడం ఎందుకో? ‘రాజు ఒక చోట.. రాజ్యం మరోచోట’ అన్నట్టు కాకుండా, ఎక్కడ తేలాల్సివ విషయాలను అక్కడే తేల్చుకోవడం ఉత్తమం.
- శైలేంద్ర