మిర్చిమసాలా

కాంగ్రెస్ నేతలకు కళ్ళ పరీక్షలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా తరహాలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్యం గురించి పట్టించుకునే బాధ్యత మాదేనని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అసెంబ్లీలో ప్రకటించారు. గవర్నర్ నుంచి ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజలందరికీ వైద్య పరీక్షలు చేయిస్తామన్నారు. అదేవిధంగా కళ్ళ పరీక్షలు చేయించి, అవసరమైన వారికి అద్దాలు (కళ్ళ జోడు) ఇస్తామని, కాటరాక్ట్ చికిత్స చేయిస్తామని చెప్పారు. అయితే రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరుగుతున్నా, కేంద్ర మంత్రులూ అభినందిస్తున్నా కాంగ్రెస్ నాయకులకు, ఎమ్మెల్యేలకు ఎందుకు కనిపించడం లేదో అర్థం కావడం లేదని ఆయన విమర్శించారు. కంటి పరీక్షల కోసం ఏర్పాటు చేసే శిబిరాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకూ ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి అనడంతోనే పాలకపక్ష సభ్యులు బల్లలు చరుస్తూ నవ్వారు.
- వి. ఈశ్వర్ రెడ్డి
గప్‌చుప్!
తెలంగాణకు పాలిట కాంగ్రెస్సే మొదటి నుంచీ నంబర్ వన్ విలన్‌గా వ్యవహరించిందని ఉధారహణలతో సహా సిఎం కేసిఆర్ శాసనసభలో ఏకీపారేసారు. ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ స్టేట్‌ను విలీనం కావడానికి ముందు అప్పటి హైదరాబాద్ స్టేట్ సిఎం బూర్గుల రామకృష్ణారావు మొదలుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వరకు ఏ విధంగా ద్రోహం చేసారో ఉధాహరణలతో సహా కెసిఆర్ ఉటంకించారు. ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు కె జానారెడ్డితో సహా కాంగ్రెస్ నాయకులు జి చిన్నారెడ్డి, డికె అరుణ, తక్కేళ్లపల్లి పురుషోత్తమ్‌రావు వరకు ఏ ఒక్కరినీ సిఎం కేసిఆర్ వదిలిపెట్టకుండా ఉతికి ఆరేసారు. పదవుల కోసం ఆంధ్ర నాయకుల అడుగులకు మడుగులు వత్తారని తీవ్రస్థాయిలో విరుచుకుపడినా ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు తమపై సిఎం కేసిఆర్ చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పకపోవడం వౌనం అర్ధాంగీకారంగా ఒప్పుకున్నారు కాబోలు!
- వెల్జాల చంద్రశేఖర్

శిక్షలు భేఖాతర్
తమకు జైలు శిక్ష, జరిమాన లెక్క కాదు. మందేయడమే ముద్దు అంటున్నారు మందుబాబులు. ట్రాఫిక్ పోలీసులు నగరంలో చేపడుతున్న డ్రంకన్ డ్రైవ్‌లో వందల సంఖ్యలో మద్యం సేవించిన వారు పట్టుబడుతున్నారు. జరిమాన,, జైలు శిక్ష విధించినా లెక్కే లేదంటున్నారు. అయితే పోలీస్‌లకు మాత్రం మందుబాబులను పట్టుకోవడం పరేషన్ అవుతుంది. మహిళలు సైతం మందేసి డ్రైవింగ్ చేస్తుంటే వారిని పట్టుకున్న పోలీసులపై చిందులు తొక్కడం కూడా ఆగడం లేదు. ఇంకేం చేస్తే మందుకొట్టి వాహనం నడపకుండా ఉంటారోనంటూ పోలీసులు నిట్టూర్చడం వారి వంతవుతోంది.
- బి.వి. రమణ