మిర్చిమసాలా

స్క్రిప్ట్ రైటర్‌దే బాధ్యత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ధర్మపోరాటం పేరిట చేసిన దీక్షలో ఆయన బావమరిది, వియ్యంకుడైన సినీనటుడు బాలకృష్ణ ఆవేశంగా మోదీపై విమర్శలు చేయడం కలకలం రేపింది. ఆయన తన ప్రసంగం మధ్యలో హిందీలో మా ట్లాడి సభికులతో ‘శభాష్’ అనిపించుకున్నారు. కానీ, ‘కమలనాథులు’ కనె్నర్ర చేశారు. తెలుగే సరిగా రాని బాలయ్య హిందీలో మాట్లాడడమా? అని భాజపా నేతలు మండిపడ్డారు. స్క్రిప్ట్ ఉంటేనే మాట్లాడగలిగే హీరో అది లేకపోతే జీరోనే అని వారు ఎద్దేవా చేశారు. మోదీపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసులు పెడతామని హెచ్చరించారు. కేసు నమోదైతే ‘నేరం నాది కాదు- స్క్రిప్టు రైటర్‌ది..’ అని బాలయ్య అంటారేమోనని ఓ భాజపా నేత వ్యాఖ్యానించారు.
-వి. ఈశ్వర్ రెడ్డి

‘డిప్యూటీ’ అయితే చాలు..
తెలంగాణ సీఎం కేసీఆర్ ఎక్కడికి బ యలుదేరినా అంతా మంచే జరగాలని ఆకాంక్షిస్తూ ఆయన మోచేతి మణికట్టుపై డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ‘ఇమా మే జామీన్’ను కట్టడం తెలిసిందే. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఈ ఆనవాయితీని అలీ కొనసాగిస్తున్నారు. తమ పార్టీ చేపట్టిన బస్సుయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మోచేతిపై కూడా ఇటీవల ‘ఇమా మే జామీన్’ దర్శనమిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉత్తమ్ సీఎం కావాలన్న ఆశతో ఎవరైనా దాన్ని కట్టి ఉండవచ్చు. కానీ, సీఎం పదవికి కాంగ్రెస్‌లో ఎంతోమంది నేతలు రేసులో ఉండగా, ఉత్తమ్‌కే ఇలా ‘ఇమామే జామీన్’ను ఎలా కడతారని ఆ పార్టీలో అపుడే లొల్లి మొదలైంది. ఉత్తమ్ సీఎం కావాలని అలా కట్టడం లేదనీ, మహమూద్ అలీ మాదిరిగా డిప్యూటీ సీఎం కావాలన్న మొక్కుతోనే కట్టినట్టు సదరు మైనార్టీ నాయకుడు పార్టీ నేతలకు వివరణ ఇచ్చాడట!
-వెల్జాల చంద్రశేఖర్

సినీ కోవర్టులు!
మావోయిస్టులను పట్టుకునేందుకు పోలీసులు చేసే ‘కోవర్టు ఆపరేషన్’ ఇపుడు అన్ని రంగాలకూ పాకింది. ‘క్యాస్టింగ్ కౌచ్’తో విలవిలలాడుతున్న తెలుగు సినీ పరిశ్రమలోనూ ఇంతకాలం అంతర్లీనంగా ఉన్న ‘కోవర్టు ఆపరేషన్’ను వేరే సినిమాల కథలు, పాటలు, సంగీతం వంటివి కాపీ కొట్టేందుకు వాడుకునేవారు. కాని తాజాగా నటి శ్రీరెడ్డి లీక్స్‌లో కోవర్టు ఆపరేషన్ చేసింది తానేనని దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ప్రకటించడంతో సినీ పరిశ్రమ నివ్వెరపోయింది. పవన్ కల్యాణ్‌పై ఆరోపణలు చేయించింది తానేనని రామ్ చెబుతుంటే, అతని వెనుక టీడీపీ నేతలున్నారని పవన్ చెబుతున్నారు. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోగా, అసలు విషయం ఏమిటో అర్థం కాని ఒక సినీ ప్రముఖుడు దీనినే ఒక సినిమాగా తీస్తే సూపర్‌హిట్ కావడం ఖాయం అంటున్నారు. ఏమో అదీ జరిగినా ఆశ్చర్యం లేదు.
-బీవీ ప్రసాద్