మిర్చిమసాలా

ఉల్లం‘ఘనులు’..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిబంధనల్ని కాలరాసేందుకు కార్పొరేట్ కాలేజీలు వేసే ఎత్తుగడలు చూస్తే ఎవరికైనా దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంది. ఈసారి వీరి ఎత్తుగడలకు తావులేకుండా ఇంటర్ బోర్డు అధికారులు ముకుతాడు వేశారు. ‘శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు’ అన్న నానుడిని బాగా వంటబరుచుకున్న ప్రైవేటు జూనియర్ కాలేజీలు వేసవిలో తరగతులు నిర్వహించడానికే కాదు, అడ్మిషన్లకు కూడా చిట్కాలు పాటిస్తున్నాయి. ఇంటర్ బోర్డు అధికారులు దాడులు చేస్తే- తాము గుర్తింపే తీసుకోలేదని, అలాంటప్పుడు దాడులు ఎలా చేస్తారని కాలేజీ యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. దాడి చేయాలంటే ఉల్లంఘనలు జరగాలి, గుర్తింపు పొందిన కాలేజీలకే ఆ అవకాశం ఉంటుంది. గుర్తింపే తీసుకోపోతే ఏ గొడవా ఉండదని కాలేజీలు భావిస్తుండగా, వాటిపై చర్యలు ఎలా తీసుకోవాలో తెలియక బోర్డు అధికారులు బుర్రలు బాదుకుంటున్నారు.
- బీవీ ప్రసాద్

మేము పాండవులం..
కమ్యూనిస్టులు అనగానే నాస్తికులు అనే భావన చాలామందికి కలుగుతుంది. వారి ప్రసంగాలు ఆ విధంగానే ఉంటాయి. ఈమధ్య సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి మాట్లాడుతూ, తమను పాండవులుగా అభివర్ణించుకొని, భాజపా నేతలను కౌరవులుగా విమర్శించారు. దీనిపై భాజపా ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి స్పందిస్తూ, నాస్తికులుగా ముద్రపడిన కమ్యూనిస్టులు తమకు తాము పాండవులతో పోల్చుకున్నారంటే- మహాభారతం, రామాయణాన్ని వారు విశ్వసిస్తున్నట్లే కదా అన్నారు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాలు ఉన్నట్లు ‘కామ్రేడ్లు’ అంగీకరిస్తున్నట్లే కదా అన్నారు. ‘మిమ్మల్ని కౌరవులతో పోల్చారు కదా?’ అని విలేఖరులు ప్రశ్నించగా, కాలాంతకులైన కమ్యూనిస్టులు ఏదైనా మాట్లాడగలరని రామచంద్రా రెడ్డి విమర్శించడంతో అక్కడున్న వారంతా గొల్లుమని నవ్వారు.
-వి.ఈశ్వర్ రెడ్డి

ఆ సలహాలు నాకొద్దు..
‘కాంగ్రెస్ నేతలు ఒకొక్కరు కనీసం 70 కిలోలకు తక్కువ లేరు. కానీ వారికి ఏ మాత్రం తెలివి లేద’ని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై సీఎం కేసీఆర్ ఇటీవల ఒక సభలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ తక్కువగా అంచనా వేసినా, ఉత్తమ్ మాత్రం తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు కంటే తెలివైన వాడని కాంగ్రెస్ సీనియర్లు అంటున్నారు. తన సలహాలను ఉత్తమ్ తీసుకోవడం లేదని, అదే తాను తెదేపాలో ఉన్నప్పుడైతే చంద్రబాబు ప్రతి విషయంలో తన సలహాలు తీసుకునే వాడని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. రేవంత్ సలహా వల్లనే ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఇరుక్కున్నారని, అందుకే ఆయన సలహాలకు ఉత్తమ్ దూరంగా ఉంటున్నారు కాబోలు!
-వెల్జాల చంద్రశేఖర్