మిర్చిమసాలా

దీనే్నమంటారు బాబూ..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం గడించిన నవ్యాంధ్ర సీఎం చంద్రబాబులో ఎంతో పరిపక్వత కనిపిస్తోందిట! చట్టాలకు ఏ ఒక్కరూ అతీతులు కారని ఆయన సెలవిస్తున్నారు. విపక్షనేత వైఎస్ జగన్, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను ముంచేసిన నీరవ్ మోదీ, ‘అగ్రిగోల్డ్’ నిందితులను కేంద్రం వెనకేసుకొస్తోందని ఆరోపిస్తున్న తెదేపా అధినేతకు ఫిరాయింపుల చట్టం మాత్రం గుర్తుకురావడం లేదు. వైకాపా నుంచి 23 మంది శాసనసభ్యులు తెదేపాలో చేరగా, వారిలో నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టారు. ఎదుటివాళ్లకు నీతులు చెప్పే చంద్రబాబు ముందుగా ఆత్మవిమర్శ చేసుకోవాలని విపక్షాలు సలహా ఇస్తున్నాయి.
-నిమ్మరాజు చలపతిరావు

‘డిప్యూటీ’కి కొత్తశాఖ!
తెలంగాణ మంత్రివర్గంలో మార్పులు జరగకపోయినా, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీకి ఒక కొత్తశాఖ అదనంగా వచ్చి చేరింది. ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి కావడంతో తరుచూ హైదరాబాద్‌కు వచ్చి వెళ్తుంటారు. ప్రొటోకాల్ ప్రకారం ఉప రాష్టప్రతికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి తదితర ఉన్నతాధికారులు స్వాగతం, వీడ్కోలు పలకడం ఆనవాయితీ. మిగతా మంత్రులు తమ శాఖల నిర్వహణలో బిజీగా ఉన్నారేమో? ‘ప్రొటోకాల్’ బాధ్యతలను మహమూద్ అలీకి పర్మినెంట్‌గా అప్పగించినట్టు ఉంది. ఈ మధ్య వెంకయ్యకు స్వాగతం, వీడ్కోలు పలకడానికి మహమూద్ అలీయే క్రమం తప్పకుండా విమానాశ్రయానికి వచ్చి పోతున్నారు.
-వెల్జాల చంద్రశేఖర్
నుదుటి రాత..!
‘నుదుటి రాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంద’ని పెద్దలంటారు. తమ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందోనని వారి జాతకం తెలుసుకోవడానికి తల్లిదండ్రులు ఆరాటపడుతుంటారు. కానీ, మహర్జాతకుణ్ణి కనాలనుకున్నా తల్లిదండ్రుల చేతుల్లో ఏమీ ఉండదు కదా? అంతా జాతకం ప్రకారమే.. అని సంతృప్తి పడాల్సిందే. మధ్యప్రదేశ్‌కు చెందిన భాజపా నేత పన్నాలాల్ శక్య మాత్రం- ‘సంస్కారవంతమైన పిల్లలను కనండి.. లేకపోతే మానేయండి’ అని మహిళలకు పిలుపునిచ్చి వివాదాన్ని రగిలించాడు. పిల్లాడు పెరిగి పెద్దాయ్యాక రాజకీయ నాయకుడు అవుతాడో, కలెక్టర్ అవుతాడో కండక్టర్ అవుతాడో, నేరస్థుడు అవుతాడో ఎలా చెప్పగలం? అని మహిళలు శక్యపై మండిపడుతున్నారు. మంచి చెప్పబోయి నోరు జారిన శక్య మహిళల ఆగ్రహానికి గురయ్యాడు పాపం.
-వి.ఈశ్వర్ రెడ్డి
సినిమా కిక్కు..
ఆ కిక్కే వేరప్పా అం టూ ఉర్రూత లూగించిన డైలాగ్- ఇప్పుడు ఈ ‘సినిమా కిక్కు’కు అచ్చం సరిపోతుంది. ఆ మధ్య తాగి వాహనాలు నడిపిన కేసుల్లో సినీ ప్రముఖులు దొరిగిపోవడంతో హుషారైన వార్తలు షికారు చేశ యి. అవి కొనసాగుతుండగానే డ్రగ్స్ కేసుల్లో అధికారులు పారదర్శకత పాటించి ప్రముఖుల గుట్టు రట్టు చేశారు. దీంతో కోలుకోని సినిమా లోకంపై క్యాస్టింగ్ కౌచ్ దుమ్ము రేపేసింది. జూనియర్ నటి శ్రీరెడ్డి ఒక్కరే ఏం చేస్తుందిలే- అని తేలిగ్గా తీసుకున్న ‘మా’ ఉక్కిరిబిక్కిరైంది. ఫ్లాపులూ, హిట్‌లతో సాగే ఈ గందరగోళ ప్రయాణంలో తాజాగా అమెరికాలో తెలుగు తారల తెరచాటు వ్యవహారాలు వెలుగు చూశాయి. అమెరికా అధికారులే తెలుగు నటీమణులకు నోటీసులు ఇవ్వడంతో సినిమా ప్రపంచంలో సునామీ వచ్చింది. దీంతో తారలు ఉలిక్కిపడి ముందే సంజాయిషీ ఇవ్వడం చూస్తుంటే ఆ కిక్కే వేరప్ప...
-బీవీ ప్రసాద్