మిర్చిమసాలా

‘పొట్ట’డు కష్టాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నాటకలోని పోలీసులకు కొత్త చిక్కు వచ్చి పడింది. బాన పొట్ట, బరువు తగ్గించుకుంటే సరేసరి.. లేదంటే ఇంటిముఖం పట్టడం ఖాయమని ఆ రాష్ట్ర అదనపు డైరెక్టర్ జనరల్ భాస్కరరావు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగంలో చేరేటప్పుడు సన్నగా, తక్కువ బరువుతో ఉన్నా, కాలక్రమేణా కొంత మంది పోలీసులకు ఆహారపు అలవాట్లు, అనారోగ్య సమస్యల వంటి కారణాలతో బరువు పెరగడం, పొట్ట రావడంతో తిప్పలు తప్పడం లేదు. సదరు ఉన్నతాధికారి ఆదేశాలు జారీ చేయడమే కాదు, ఎక్కువ బరువున్న వారిని, బాన పొట్ట వారిని గుర్తించే ప్రక్రియ చేపట్టారట. పొట్ట తగ్గించుకునేందుకు కౌనె్సలింగ్‌తో పాటు కొంత గడువు కూడా ఇస్తామని ఆ అధికారి ప్రకటించడం కొంత ఊరట. గడువులోగా నిబంధనలను పాటించని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించడంతో, పోలీసులంతా బరువు, బాన పొట్ట తగ్గించుకునే పనిలో నిమగ్నమయ్యారట పాపం.
-వి.ఈశ్వర్ రెడ్డి

అంతా భేషుగ్గానే..
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవటంలో ముందుండే ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరు, వివిధ పథకాలపై ‘ఐవీఆర్‌ఎస్’ ద్వారా జనం మనోభావాలను తెలుసుకుంటున్నారు. ఉదయానే్న సెల్‌ఫోన్ రింగ్ అవడం, ఆపై బాబు గొంతు వినపడటంతో గ్రామాల్లో సైతం చాలామంది ఉలిక్కి పడుతున్నారు. ఎమ్మెల్యేల, ప్రభుత్వం పనితీరుపై అసంతృప్తి ఉన్నవారు సెల్‌ఫోన్‌లో 2 లేదా 3 నెంబర్ నొక్కాలట! అనేక సమస్యలను ఎదుర్కొంటున్న బాధితులు సహజంగానే తమ అసంతృప్తిని తెలియజేస్తారు. ఏ సమస్యలూ లేకుండా తమ జీవితాలు సజావుగా సాగిపోతున్నాయని ఎవరూ చెప్పరు. కానీ, ప్రభుత్వం మాత్రం తమ పాలన పట్ల 90 శాతం పైగా ప్రజలు సంతృప్తిగా ఉన్నారంటూ గొప్పగా ప్రచారం చేసుకోవడం విడ్డూరం! అంతా బ్రహ్మాండంగా ఉన్నప్పుడు ఇక జనం అభిప్రాయాలను కోరడం ఎందుకు?
-నిమ్మరాజు చలపతిరావు

భలే మంచి వ్యాపారం!
రెట్టింపు బంగారం అవుతుందని చెబితే నిరక్షరాస్యులు నమ్ముతారేమో, చదువుకున్నవారు ఎలా నమ్ముతారని అనుకుం టాం. ఓ నకిలీ బాబా ముందు మోసపోయిన వారంతా బాగా చదువుకున్న వారు, ఉద్యోగాలు చేసేవారు, అన్ని విషయాలూ తెలిసిన వారేనని తెలుసుకుని పోలీసులే నివ్వెరపోతున్నారు. వీళ్లను మార్చడం ఎవరితరం అంటూ వారు వాపోతున్నారు. అకస్మాత్తుగా డబ్బు వచ్చి పడుతుందని, సమస్యలు తీరిపోతాయని, ఆరోగ్యం కుదుట పడుతుందని చెప్పి- ఇంట్లో పూజలు చేస్తున్న ఆ నకిలీ బాబా ఒక కలశం పెట్టి అందులో బంగారం పెట్టమని కోరడం, అందుకు తగ్గట్టు అమాయకులు బంగారం వేయడం చూస్తుంటే వీళ్లను ఎవరు మార్చగలరనడంలో సందేహం అక్కర్లేదు. కలశంలో బంగారం వేసి, 60 రోజులు మూటకట్టి ఉంచితే మేలు జరుగుతుందని చెబుతున్న బాబా మాటలు విని మోసపోయిన వారి సంఖ్య వందల్లో.. దోచుకున్నది కిలోలకోద్దీ బంగారం.. ఇదేదో బావుందీ వ్యాపారం అనిపిస్తోందా?
-బీవీ ప్రసాద్