అంతర్జాతీయం

80 మంది గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎత్తయిన అలలు ఢీకొనడంతో మునిగిన నౌక
సెంట్రల్ ఇండోనేసియాలో ప్రమాదం

మకస్సర్, డిసెంబర్ 21: సెంట్రల్ ఇండోనేసియాలో పెద్ద ఎత్తున ఎగిసిపడిన అలలు బలంగా ఢీకొనడంతో ప్రయాణికులతో కూడిన ఒక నౌక మునిగిపోయింది. సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమైన సిబ్బంది ఆ మునిగిపోయిన పడవలోనుంచి 39 మందిని రక్షించి ప్రాణాలతో బయటకు తీసుకు వచ్చారు. మరో మూడు మృతదేహాలను వెలికితీశారు. ఈ ప్రమాదంలో గల్లంతయిన మిగతా 80 మందిని రక్షించేందుకు సోమవారం కూడా గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు. ఆగ్నేయ సులవేసి ప్రావిన్స్‌లోని కోలక నుంచి దక్షిణ సులవేసి ప్రావిన్స్‌లోని సివా టౌన్‌కు వెళ్తున్న ఈ నౌక శనివారం మార్గమధ్యంలో గల్ఫ్ ఆఫ్ బోన్‌ను దాటగానే తుపాను వల్ల మూడు మీటర్లకుపైగా ఎత్తులో ఎగిసిన అలలు బలంగా ఢీకొట్టడంతో మునిగిపోయిందని మకస్సర్‌కు చెందిన గాలింపు, సహాయక చర్యలు చేపడుతున్న సంస్థ అధిపతి రోకి అసికిన్ చెప్పారు. మకస్సర్ నగరం దక్షిణ సులవేసికి రాజధాని. ఫైబర్‌గ్లాస్‌తో తయారు చేసిన ఈ నౌకలో ప్రమాదం జరిగిన సమయంలో 110 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారని ఆయన వివరించారు. ప్రయాణికుల్లో 14మంది పిల్లలు ఉన్నారు. సహాయ కార్యక్రమాలలో పాల్గొనడానికి జాతీయ గాలింపు, సహాయక చర్యల సంస్థ ఒక హెలికాప్టర్‌ను, నౌకలను మోహరించిందని, నౌకాదళం యుద్ధనౌకలను పంపిస్తోందని స్థానిక గాలింపు, సహాయక చర్యల సంస్థ ఆపరేషనల్ చీఫ్ ఇవాన్ అహ్మద్ రిజ్‌కి టిటస్ చెప్పారు. వాయుసేనకు చెందిన ఒక సిఎన్-235 విమానం ఆదివారమే సహాయక చర్యల్లో చేరిందని ఆయన తెలిపారు. సివా ఓడరేవుకు ఆగ్నేయంగా 21 కిలోమీటర్ల దూరంలో గల తమ నౌకను అలలు ఢీకొంటున్నాయని సిబ్బంది నుంచి సమాచారం అందగానే ఆరు సహాయక నౌకలు, ఓడలను పంపించినట్లు అసికిన్ చెప్పారు. నౌకమీద ఒక మహిళ, ఒక బాలుడు సహా నలుగురు ఉన్నట్లు మత్స్యకారులు చూశారు. ఎత్తయిన అలలు ఢీకొన్న కొన్ని గంటలకే నౌక నీటిలో మునిగిపోయిందని వారు అధికారులకు చెప్పారు. ఆదివారం సాయంత్రం మరో 35 మందిని రక్షించినట్లు, మూడు మృతదేహాలను వెలికితీసినట్లు రవాణా మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జూలియస్ బరాటా తెలిపారు. ప్రాణాలతో బయటపడిన వారందరినీ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు ఆయన వివరించారు. గల్లంతయిన మరో 80 మంది కోసం గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు.