జాతీయ వార్తలు

తదుపరి లక్ష్యం మిషన్ ‘గగన్‌యాన్’:శివన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్: ఇస్రో తదుపరి లక్ష్యం మిషన్ ‘గగన్‌యాన్’ అని ఛైర్మన్ శివన్ వెల్లడించారు. ఆయన భువనేశ్వర్‌లో మీడియాతో మాట్లాడుతూ 2022 నాటికి భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 98శాతం విజయవంతమైందని, విక్రమ్ ల్యాండర్ కోసం అనే్వషణ కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఆర్బిటర్ చక్కగా పనిచేస్తుందని, ఇందులో అమర్చిన 8 సైన్సు పరికరాలు తమ విధులను చక్కగా నిర్వర్తిస్తున్నాయని తెలిపారు. విక్రమ్‌తో కమ్యూనికేషన్ సంబంధాలు తెగిపోవటానికి కారణాలను ఇస్రో అనే్వషిస్తుందని, వారి నివేదిక అందిన తరువాత తదుపరి కార్యాచరణ చేపడతామని తెలిపారు.