రాష్ట్రీయం

ఇక మిషన్ భగీరథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాటర్‌గ్రిడ్ పేరు నిర్ణయించిన సర్కారు
సిద్ధమైన కాళేశ్వరం ఎత్తిపోతల ముసాయిదా
మొదలైన ప్రాజెక్టుల రీ-ఇంజనీరింగ్
నిధుల కేటాయింపుపై ఆర్థిక శాఖ కసరత్తు

హైదరాబాద్, డిసెంబర్ 4: ఇంటింటికి మంచినీరు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకాన్ని మిషన్ భగీరథగా నామకరణం చేశారు. మిషన్ భగీరథ పేరు పెట్టాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు సూచించడంతో శుక్రవారం ఈమేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మిషన్ భగీరథ తొలి విడతగా ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంటింటికి తాగునీరు అందించనున్నారు. ఈ పథకంతోపాటే ఇంటింటికి ఇంటర్‌నెట్ సేవలూ విస్తరించనున్న విషయం తెలిసిందే. తొలివిడతలో భాగంగా గజ్వేల్ ప్రాంతంలో గ్రిడ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మూడేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే, పనులు పూరె్తైనచోట వెంటనే తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పనులు పూర్తిచేసి తాగునీరు అందించేందుకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో ప్రాజెక్టుకు మిషన్ భగీరథ అని నామకరణం చేయడానికి నిర్ణయించారు. చెరువుల పూడికతీతను మిషన్ కాకతీయగా పిలుస్తున్న ప్రభుత్వం, అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన తాగునీటి పథకానికి మిషన్ భగీరథ పేరుపెట్టారు. ఒకవైపు ఇంటింటికి తాగునీరు అందించే పథకంపై దృష్టి సారించిన ప్రభుత్వం, అదే సమయంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తికీ ప్రాధాన్యతనిస్తోంది. విపక్షాల విమర్శలు, ఆరోపణలు మాటెలావున్నా ప్రాజెక్టుల రీ-డిజైనింగ్‌కు కట్టుబడి ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నుంచి శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులో పూర్తిగా మార్పులుచేస్తూ కొత్త డిజైన్‌కు రూపకల్పన చేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించి ముసాయిదా నివేదికను వ్యాప్కోస్ ప్రతినిధులు నీటిపారుదల మంత్రి టి.హరీశ్‌రావుకు శుక్రవారం సచివాలయంలో అందించారు. ముంపునకు సంబంధించి మహారాష్ట్ర అభ్యంతరాల వల్ల గతంలో నిర్ణయించిన విధంగా ప్రాజెక్టు ముందుకు సాగే అవకాశాలు లేకపోవడంతో, ముంపు తక్కువగావుండేలా కొత్త డిజైన్ రూపకల్పన చేశారు. సిఎం కెసిఆర్ మహారాష్ట్ర సిఎంతో దీనిపై గతంలో చర్చించినపుడు, ముంపు గ్రామాల సంఖ్య ఎక్కువున్న కారణంగా యథాతథంగా డిజైన్‌ను అంగీకరించలేమని తేల్చేశారు. దీంతో డిజైన్ మార్పునకు సిఎం కెసిఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రాజెక్టుల రీ-డిజైనింగ్‌లో కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సత్వరం చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం, దీనికి సంబంధించి వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఒకవైపు రీ-డిజైనింగ్‌కు తుదిరూపం ఇస్తూనే, మరోవైపు భూసేకరణకు ఇబ్బందులు తలెత్తకుండా జీవో 123 జారీ చేశారు. ఈ జీవో ప్రకారం ఉదారంగా పరిహారం చెల్లిస్తుండడం, స్థానిక ప్రజాప్రతినిధులు సైతం చొరవ చూపుతుండటంతో భూసేకరణ వేగవంతమైంది. అదే సమయంలో బడ్జెట్‌లో భారీ, మధ్యతరహా ప్రాజెక్టులన్నింటినీ మూడేళ్లలో పూర్తిచేసేలా ఏటా 25 వేల కోట్లు కేటాయించాలని నిర్ణయించారు. ఈ ఏడాది నీటిపారుదల శాఖకు 25వేల కోట్లు కేటాయించేలా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది.
కాళేశ్వరం ఎత్తిపోతల ముసాయిదా నివేదిక (డ్రాఫ్ట్ డిపిఆర్)ను మంత్రికి అందించిన వ్యాప్కోస్ ప్రతినిధులు, ప్రాజెక్టుపై మంత్రి హరీశ్‌రావుతో శుక్రవారం చర్చలు జరిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ నిర్మాణాలకు సంబంధించి ప్రాథమిక ప్రతిపాదనలపై వ్యాప్కోస్ ప్రతినిధులతో మంత్రి చర్చించారు. వీటికి సంబంధించి సాంకేతిక వివరాలపై సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ ఇంజనీర్లను నివేదిక ఇవ్వాలని మంత్రి కోరారు. 2015 నాటి ధరలతో మూడు బ్యారేజీలు, పంప్ హౌస్‌లు, ఇతర నిర్మాణాలకు 10,300 కోట్లు అవసరమని, 2007-08 ధరలతో 8900 కోట్లు అవుతుందని వ్యాప్కోస్ అంచనా వేసింది.
మెడిగడ్డ వద్ద 100 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్ వద్ద 16.17 టిఎంసిలు, అన్నారం బ్యారేజీ వద్ద 120 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్ వద్ద 3.52 టిఎంసిలు, సుందిళ్ల బ్యారేజీ వద్ద 130 మీటర్ల ఎప్‌ఆర్‌ఎల్ వద్ద 1.62 టిఎంసిలు నిల్వ ఉంటుందని అంచనా వేశారు. మొత్తం మూడు బ్యారేజీల వద్ద 21.29 టిఎంసిల నీరు నిల్వ ఉంటుందని ముసాయిదా నివేదికలో పేర్కొన్నారు. ముసాయిదా నివేదికను ఒకటి రెండు రోజుల్లో సిఎంకు వివరించి నిర్ణయం తీసుకుంటామని అధికారులకు మంత్రి హరీశ్ చెప్పినట్టు తెలిసింది. 100 మీటర్ల నుంచి 97 మీటర్ల వరకూ మీటర్లవారీ ముంపునకు సంబంధించిన వివరాలు అందించాలని నీటిపారుదల మంత్రి వ్యాప్కోస్ ప్రతినిధులను కోరారు. ఈ ముంపు వివరాలతో మేడిగడ్డ, తుమ్మడి హట్టిల వద్ద బ్యారేజీల నిర్మాణాలపై తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే మహారాష్టత్రో చర్చిస్తుంది. జనవరి చివరిలో అసెంబ్లీ సమావేశాలు జరుగనుండగా, అంతకు ముందే ప్రాజెక్టుకు సంబంధించి పనులు ప్రారంభమయ్యే అవకాశముంది.