రాష్ట్రీయం

మిత్రభేదం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరస్పర విమర్శలు కట్టిపెడదాం
కలసి ముందుకు సాగుదాం
బాబు సమక్షంలో టిడిపి, బిజెపి నేతల నిర్ణయం

విజయవాడ, డిసెంబర్ 5: ఇక విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలకు ఇక స్వస్తి పలికి కలసి ముందుకు సాగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నివాసగృహంలో శనివారం ఉదయం జరిగిన తెలుగుదేశం బిజెపి సమన్వయ కమిటీ సమావేశంలో అగ్రనేతలు నిశ్చయించుకున్నారు. కేంద్రం ఇస్తున్న నిధులకు సకాలంలో సరైన లెక్కలు రావడం లేదని పలు పథకాల్లో అవినీతి చోటు చేసుకుందని, కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తనవిగా ప్రచారం చేసుకుంటున్నదంటూ కేంద్ర మాజీ మంత్రులు దగ్గుబాటి పురంద్రీశ్వరి, కావూరి సాంబశివరావు, రాష్ట్ర మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే సోము వీర్రాజు తదితరులు విమర్శలు చేస్తుంటే తాజాగా టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ పదవి తమ భిక్షని, కావూరి, కన్నా అక్రమంగా ఆస్తులు గడించారని వీరితోపాటు పురంద్రీశ్వరి, సోనియా గాంధీ ఏజెంట్లు అంటూ దుయ్యబట్టారు.
ఈ నేపథ్యంలో జరిగిన నేటి సమన్వయ కమిటీ సమావేశంలో ఆ అంశాలన్నింటిపై కూడా సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఏదైనా సమస్యలుంటే అంతర్గత సమావేశాల్లో చర్చించుకోవాలేగాని బహిరంగంగా పత్రికలకెక్కరాదని నిర్ణయించారు. రెండు పార్టీలు కల్సి ఉండటం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని, అలాగే రెండు పార్టీలకు కూడా భవిష్యత్ ఉంటుందని చంద్రబాబు సూచించారు. ఇక నుంచి నెల లేదా నెల 15 రోజులకోసారి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించుకోవాలని భావించారు. విభజన చట్టంలోని హామీలన్నింటినీ సత్వరం నెరవేర్చేలా తామంతా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని బిజెపి నేతలు వెల్లడించారు.
చంద్రబాబు సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు, పార్లమెంటు సభ్యులు కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, బిజెపి తరఫున రాష్ట్ర అధ్యక్షులు ఎంపి డాక్టర్ కంభంపాటి హరిబాబు, ఎంపి గోకరాజు గంగరాజు, మంత్రి మాణిక్యాలరావు, ఎమ్మెల్సీ కంతేరు సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. (చిత్రం) టిడిపి, బిజెపి సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు